మెయిన్ ఫీచర్

ఛిగురంత ఆశ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాలా మంది వృద్ధాప్యాన్ని శాపంగా పరిగణిస్తారు. ఆ వయసులో ఎలా గడపాలా అని మధ్య వయసు నుంచే ఆలోచిస్తారు. పిల్లలు తమను కళ్లల్లో పెట్టుకుని చూసుకోవాలని ఆశపడతారు. ఏమీ చెయ్యలేని, చేసుకోలేని నిస్సహాయత, ఒంటరితనం, నిరాదరణ వంటి రుగ్మతులతో మానసిక కుంగుబాటుకు లోనవుతుంటారు. మలివయసులో పలుకరించే సమస్యలే అధికం. అవి భిన్నంగా కూడా ఉంటాయి. పిల్లలంతా బయటకు వెళ్లిపోతుంటే రోజంతా ఒంటరిగా గడపాల్సి రావటం.. ఇవన్నీ వృద్ధుల్లో కుంగుబాటుకు దారితీసేవే. కాని మన దేశంలో వృద్ధాప్యం వేధనాభరితంగా తయారైంది. వృద్ధులు అధికంగా ఉన్న దేశాలలో ప్రపంచంలోనే రెండవ అతి పెద్ద దేశంగా మన దేశం ఉంది. వృద్ధులు ఉన్న 96 దేశాలలో మనది 71వ దేశంగా పరిగణించబడుతోంది. మనదేశంలో 80శాతం వృద్ధులు గ్రామీణ ప్రాంతాలలోనే ఉంటున్నారు.
40శాతం మంది అతి తక్కువ సంపాదనతో బతుకీడుస్తున్నారు. ఇందులో 73శాతం చదువురానివారే అధికంగా ఉన్నారు. ఇదిలావుండగా వృద్ధాప్యంలో 73శాతం మంది గుండె సంబంధిత వ్యాధులతో చనిపోతుండగా..20శాతం మంది క్యాన్సర్ సంబంధిత జబ్బులతో మరణిస్తున్నారు. జబ్బుపడిన 50శాతం మందిలో 30శాతం మంది ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.
మనలో చాలామంది కుక్కపిల్లను పెంచడంలో చూపించే శ్రద్ధ, వాటిమీద కురిపించే ప్రేమ వయసుడిగిన తల్లిదండ్రులమీద, అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్యలమీద చూపించలేకపోతున్నాం అన్నది వాస్తవం. చాదస్తం, సర్దుకుపోవడంలేదు, కొత్త వాతావరణానికి అలవాటు పడటంలేదు, వెనుకటి అలవాట్లు మానుకోవడం లేదు, కొత్త కుటుంబ సభ్యులను గుర్తించడం లేదు, మంకుపట్టు పడతారు.. కారణాలేవైనా మనలో చాలామంది తల్లిదండ్రులను ముఖ్యంగా వయోవృద్ధులను దూరంగా ఉంచడానికే మొగ్గుచూపుతున్నారన్నది వాస్తవం. వయసు తెచ్చిన చిత్త వైకల్యమో, లేక పిల్లలు పెద్దవారయ్యారు, నిర్ణయాలు తీసుకోగల సమర్థులు అన్న విషయాన్ని గ్రహించలేని బలహీనతవల్లనో ముసలి తల్లిదండ్రులు, అమ్మమ్మ / నాన్నమ్మ, తాతయ్యలు బెట్టు చేస్తే భరించలేకపోతున్నాం. మూగ జీవాలమీద చూపుతున్నది మానవత్వమైతే, మనసుపెట్టి మాటలాడే తల్లిదండ్రులపట్ల, ముసలి అవ్వలపట్ల మన దాష్టీకాన్ని ఏమని పిలవాలి? మన చిన్నతనంలో అన్నివేళలా మనం అమ్మా నాన్నల మనసెరిగి అనుకూలంగా మసలుకున్నామా? మారాం చేయలేదా? ధిక్కరించలేదా? ప్రశ్నించలేదా? పారిపోతానని బెదిరించలేదా? హక్కుల కోసం పోరాటం చేయలేదా నాడు మనలను ఆవహించిన పసితనమే నేడు వయసుడిగిన మన అమ్మా నాన్నలను, తాతయ్యలను అమ్మమ్మ, నాన్నమ్మలను ఆవహించింది. ఇది ప్రకృతి సహజం. నాడు పసితనంలో మన ప్రశ్నలకు ఓపికగా విని, తిరుగుబటును ప్రేమతో సహించి, బెదిరింపులకు భయపడి, హక్కులను గుర్తిస్తూ మనమీద మన అమ్మా నాన్నలు చూపిన ఔదార్యం, కురిపించిన ప్రేమామృతం, మన కోరికలు నెరవేర్చడానికి చేసిన త్యాగాలు, వదులుకున్న సొంత సుఖాల్లో కొంతయినా నేడు మనం వారిపట్ల చూపలేమా?
పాలు, బిస్కట్లు, కోడిగుడ్లు, బొక్కలు, సబ్బులు, వాక్సిన్‌లు అంటూ నెల 2 వేలు కుక్కకు ఖర్చుచేస్తాం. కాని చిన్నతనంలో తమ అవసరాలను, కోరికలను చంపుకొని మన కోరికల కోసం ఖర్చుచేసిన తల్లిదండ్రుల కొరకు 500 ఖర్చు చేయడానికి వెనుకా ముందుచేస్తాం, అసలు వారికి అవసరాలు ఉంటాయనే గుర్తిచడంలేదు! కుక్కల మేటింగులమీద చూపే శ్రద్ధలో పదోవంతు కూడా తల్లిదండ్రుల హెల్త్ చెకప్‌మీద చూపడంలేదు. మన కడుపున పుట్టిన పిల్లల కోరిక మేరకు పెంచుకుంటున్నామని సరిపెట్టుకుందామా, మరి మనలను కని పెంచిన వారిపట్ల మనకు బాధ్యత లేదా? రెండు రోజలు ఊరుకెళితేనే పెంచుకున్న కుక్కను డాగ్ కేర్ సెంటర్‌లో, లేదంటే నమ్మకమైన పక్కింటివారికో, బంధువులకో అప్పగించి పూట పూటకి దాని ఆలనా పాలనా తెలిసికొనే ప్రేమమూర్తులైన మనం చిన్న విశ్వాసానికే పొంగిపోయి కుక్కపిల్లకు ఎంతో చాకిరీ చేస్తున్నాం. చిన్నతనంలో అమ్మ వెళ్ళమంటే ఇంటి పక్కనే ఉన్న కిరాణా దుకాణానికి వెళ్లటానికి కూడా బద్ధకించిన మనం, పెంచుకున్న కుక్కకు చికెన్ బొక్కలకోసం మార్కెట్ మొత్తం వెతుకుదాం. మసకబారిన నాన్న చూపుమీద శ్రద్ధచూపని మనం, కుక్క బిస్కెట్ల కొరకు ఎంతైనా ఖర్చుచేస్తాం. కుక్కను కొనడానికి, వాక్సిన్‌ల కొరకు, సబ్బులని, షాంపులని ఎంతైనా ఖర్చు చేసే మనం, ఇంట్లో వున్న ముసలివాండ్ల కనీస ఖర్చుల విషయంలో మాత్రం లెక్కలు వేసుకుంటాం. అన్నదమ్ములు, అక్కచెలెళ్ళ మధ్య వాటాలు వేసుకుంటాం! వంతులు పెట్టుకుంటాం? నాడు నేను అమ్మ కొడుకును, నేను నాన్న బిడ్డను అని పోటీపడి మన అవ్యాజ్యమైన ప్రేమతో నాడు వాళ్ళను ఉక్కిరిబిక్కిరి చేసిన మనం, నేడు మలి వయసులో అమ్మ బాధ్యత నీదే, నాన్నను నేను భరించలేను నీతో ఉంచుకో అంటూ విదిలించుకుంటున్నాం, అదనపు బరువంటూ నిట్టూర్చుతున్నాం! మనమే లోకమనుకుని మనకోసం ఎన్నో వదులుకున్న వారి విలువ కుక్క విశ్వాసం పాటిది కాదా? ఇంతకూ మన విశ్వాసం ఏపాటిది? తిరిగిరాని లోకాలకు తరలివెళ్ళిన తరువాత ఘనంగా జరిపే కర్మకాండలమీద చేసే శ్రద్ధలో పావలా వంతు కండ్లమందు కదలాడుతున్న రోజుల్లో మనింట్లోని ముసలివాండ్లమీద చూపగలిగితే, ఆప్యాయతతో కూడిన స్పర్శను, మాటను వారికదించగలిగితే వారు జీవన్ముక్తులు కారా? ఎవరూ చూడని వైరతరణిని దాటించాలనుకోవడం కన్నా బ్రతికుండగా ఆదరించడం గొప్ప కర్మ కాదంటారా? అంతిమ ఘడియల్లో ఆప్యాయతకు, ఆసరాగా అంగలార్చిన తల్లిదంల్రు, తాతయ్యలు, అమ్మమ్మలు, నాన్నమ్మలు తనువు చాటించిన తరువాత పిండాల రూపంలో మనం పెట్టే మృష్టాన్న భోజనం కోసం ఆత్మలుగా ఎగిరివస్తారంటారా? మూగ జీవాలమీద కురిపిస్తున్న వల్లమాలిన ప్రేమలో కొంతైనా మలి సంధ్యలోని కన్నవారిమీద చూపించగలిగితే అంతకుమించిన మహాయజ్ఞం, కర్మయోగం మరోటి ఉండదు కదా.

పసితనంలో తెలిసీ తెలియక తప్పటడుగులు వేసినపుడు మనకు ఆసరాగా నిలిచిన, గోరుముద్దలు తినిపించిన చేతులవి, మనకు నడకలు నేర్పిన పాదాలని, కళ్ళలో వత్తులు వేసుకొని మన కండ్లలో నిద్ర కొరకు ఎదురుచూసిన నేత్రాలవి, నేడు వయసుడిగి, కండరాలలో పట్టు సడలి ఆసరా కొరకు ఎదురుచూస్తున్నాయి. ఊతంగా నిలబడలేదా? సుదీర్ఘ తీరాలకు అడుగులువేస్తున్న వారి ఈ చివరి మజిలీలో పసితనపు చిరునవ్వులను వారికి పరిచయం చేయలేమా? వయసు ఉడిగిన తల్లిదండ్రులను, బామ్మలను, జేజమ్మలను, తాతయ్యలను వాళ్ళ మానాన వదిలేసి రోజుల తరబడి తిరుగుతున్నాం, వేరు కాపురాలు పెడుతున్నాం. వారి ఆలనా పాలనా గుర్తురాదెందుకో? పొద్దునే్న ఇంత వండేసి దానే్న సాయంత్రం కూడా తినేయమని చెప్పి మరునాడు ఉదయమే వస్తామంటూ ముసలివాళ్లను ఇండ్లలో ఒంటరిగా వదిలేసి వెళ్ళే వాళ్లెందరో ఉన్నారు మనలో. ఆ ఒంటరి పక్షులకు ఏదైనా జరగరానిది జరిగితే, ఆత్మీయ పలుకు లేని ఆ ముసలి గుండె ఆగిపోతే ఎలా అనే ఆలోచనే మనకు రాదెందుకు? వయసుడిన మన తల్లిదండ్రులకు, నానమ్మ, తాతయ్యలకు చోటులేని మన ఏసీ కారులో ఆశ్చర్యంగా పెంపుడు కుక్కలకు మాత్రం ప్రత్యేక ప్రవేశం ఉంటుంది! మనసులో విప్పలేని మూగ జీవానికి, నోరున్నా బలవంతంగా మనసు కట్టేసుకుంటున్న ముసలివాళ్ళకు తేడా లేదంటారా?

-చందుపట్ల రమణ కుమార్‌రెడ్డి