మెయిన్ ఫీచర్

దూసుకెళ్లిన ప్రతిభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అది తమిళనాడులోని మారుమూల గ్రామం. చిన్నప్పటి నుంచి వ్యవసాయ పనులు చేసిన చేతులు. మాతృభాష తమిళంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న నేపథ్యం. కష్టాలతో సావాసం చేస్తూనే అంతరిక్ష పరిశోధనలో తలమునకలయ్యాడు. నేపథ్యం పేదరికమైనా నేడు ప్రఖ్యాత ఇస్రో ఛైర్మన్‌గా ఎదిగాడు. ఆయనే డాక్టర్ కె.శివన్.
*

తమిళనాడు రాష్ట్రం నాగర్‌కోయిల్ ప్రాంతంలో విసిరేసినట్లు ఉండే గ్రామం శరక్కల్‌విలై. నేడు ఈ గ్రామం పతాక శీర్షికల్లో చేరింది. ఇక్కడ నుంచి వచ్చిన ఓ యువకుడు అంచలంచెలుగా ఎదిగి ఆ గ్రామానికే పేరు తీసుకువచ్చాడు. ఆ గ్రామంలోకి అడుగుపెట్టి డాక్టర్ శివన్ ఇల్లు ఏది అని అడిగితే చాలు.. రైట్ తీసుకుని రోడ్డు చివరికి వెళితే కనిపిస్తుందని చెబుతారు. ఆ ఇంటికి వెళితే అక్కడ డాక్టర్ శివన్ వదిన కనిపిస్తోంది. ఆమె తన కుమార్తెతో అ ఇంటిలో నివశిస్తోంది. ఆమెను పలుకరిస్తే చాలు ఆ కళ్లల్లో మెరుపు. ఎందుకంటే డాక్టర్ శివన్ ఇటీవలే నా పెద్ద కుమార్తె పెళ్లికి వచ్చి వెళ్లాడు అని ఆనందంగా చెబుతుంది. డాక్టర్ శివన్ గురించి చెప్పిన విశేషాలు ఆమె మాటల్లోనే..
‘నాకు ముప్పయేళ్ల క్రితం పెళ్లయింది. ఇక్కడకు అడుగుపెట్టేసరికి శివన్ అప్పటికే తిరువనంతపురంలోని ఇస్రోలో పనిచేస్తున్నాడు. కుటుంబ వేడుకలకు, పండుగలకు మాత్రమే వచ్చేవాడు. అంతేకాదు ప్రతి ఏడాది ఏప్రిల్- మేలో జరిగే భద్రకాళి పూజకు తన కుటుంబంతో హాజరవుతాడు. వదినగా తనను ఎంతో గౌరవిస్తాడు. అంతేకాదు చిరునవ్వు చెదరనీయడు’ అని వదిన సరస్వతి ఎంతో గర్వంగా చెబుతుంది. డాక్టర్ శివన్ ఎపుడూ తరగతిలో ఫస్ట్ అని ఆయన మేనమామ చెబుతాడు. డాక్టర్ శివన్ చదువుకున్న స్కూల్లోనే పీటీ మాస్టర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి మాట్లాడుతూ..‘ తను నాకంటే ఐదేళ్ల జూనియర్. మా స్కూలు ప్రధానోపాధ్యాయుడు పిల్లల చేత స్కూల్లో మొక్కలు నాటించేవారు. ఉదయం స్కూలుకురాగానే ఆ మొక్కలకు శివన్ నీళ్లు పోసేవాడు. ఆనాటి మొక్కలే నేడు వృక్షాలుగా మారాయి. తండ్రితో పాటు పొలం పనులు చేస్తూనే ఖాళీ సమయంలో చెట్టు కింద కూర్చొని చదువుకునేవాడని ఆ పిటీ మాస్టర్ ఆనాటి జ్ఞాపకాలను గుర్తుకుచేసుకున్నాడు.
డాక్టర్ శివన్ ఇక్కడ ప్రాథమిక పాఠశాలలో చదువు అయిపోగానే ఉన్నత చదువుల కోసం వలంకుమరవిలైకి నడుచుకుంటూ వెళ్లి 12వ తరగతి వరకు చదువుకున్నారు. ఆ తరువాత మద్రాసు ఏరోనాటికల్ ఇంజినీరింగ్ 1980లో పూర్తిచేశారు. తదనంతరం బెంగళూరులోని ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో మాస్టర్ డిగ్రీ పూర్తిచేశారు. అంతేకాదు అంతరిక్ష విజ్ఞానంలో పిహెచ్.డి సైతం చేశారు. ఆ కుటుంబంలోనే కాదు ఆ గ్రామంలోనే తొలి గ్రాడ్యూయేట్. శివన్.
పట్టుదల ఎక్కువ..
1982లో పోలార్ శాటిలైట్ లాంచ్ చేసే సందర్భంలో డాక్టర్ శివన్ ఇస్రోలో జాయన్ అయ్యారు. మిషన్ రూపకల్పనలో కీలక భూమిక పోషించారు. తన కెరీర్‌లో ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు. పట్టుదల గల వ్యక్తి. ఏదైన పని తలపెట్టాడంటే సాధించే వరకు నిద్రపోడు అని మాజీ డైరెక్టర్ కార్తీకేశన్ అంటున్నారు. ఆయన సాన్నిధ్యంలో మిగిలిన శాస్తవ్రేత్తలు సైతం కష్టపడి ఇస్రో ఖ్యాతిని ఇనుమడింపజేస్తారనే ఆశాభావాన్ని కార్తీకేశన్ వ్యక్తంచేస్తున్నారు. ప్రణాళికాబద్ధంగా పనులు చేసుకుంటూ వెళ్లటంలో డాక్టర్ శివన్ దిట్ట. ఇదిలా ఉండగా డాక్టర్ శివన్ చదివిన పాఠశాలను మరింత అభివృద్ధి చేయటానికి ఆయన మేనమామ మరికొంత స్థలాన్ని విరాళంగా ఇచ్చాడు. ఇప్పటికీ ఈ విశ్వం మెచ్చిన శాస్తవ్రేత్త గ్రామానికి వెళ్లాలంటే బస్సు సదుపాయం లేదంటే ఆశ్చర్యం కలగకమానదు. డాక్టర్ శివన్‌కు ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు బి.టెక్ చదివాడు. రెండవ కుమారుడు కాలేజీలో చదువుకుంటున్నాడు.

-టి.ఆశాలత