మెయిన్ ఫీచర్

ఓ మహిళా! మేలుకో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయ పురాణాల్లో మహిళను శక్తి అవతరంగా అభివర్ణించారనీ, సమాజాభివృద్ధికి మహిళా సాధికారిత అత్యంత కీలకమనీ దేశంలోని నాలుగు అత్యంత పురాతనమైన హైకోర్టులకుగాను మూడింటికి మహిళలే నేతృత్వం వహిస్తున్నారనీ, అంగారకుడిపైకి రోవర్‌ను పంపిన యాత్రలోనూ మహిళల పాత్రే కీలకమనీ, క్రీడల్లోనూ మహిళలే గర్వకారణంగా నిలుస్తున్నారనీ, ఇటీవల నవంబరులో జరిగిన మహిళా పారిశ్రామికవేత్తల సదస్సులో హైదరాబాద్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు కానీ వాస్తవములో మహిళలు ఇంకా ఎన్నో రంగాలలో వెనుకబడి ఉన్నారనీ గణాంకాలు పేర్కొంటున్నాయి. మహిళలు, పురుషుల విషయంలో చట్టాలు ఊకేలా లేవని ఇవాంక పేర్కొన్నారు. ఈ విషయంలో అభివృద్ధి చెందిన చెందుతున్న దేశాలు చాలావరకు మార్పులు చేశాయనీ, అయినా ఇంకా జరగాల్సింది చాలా ఉందన్నారు. ‘‘కొన్ని దేశాల్లో మహిళలు భర్తల అనుమతి లేకుండా పనిచేయలేరు. మహిళలు బయట పనిచేసేందుకు వారి కుటుంబ కట్టుబాట్లు, సంప్రదాయాలు అడ్డొస్తున్నాయి’’ అని అన్నారు. అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సు 2017ను హైదరాబాద్‌లో ప్రారంభిస్తూ మహిళతోనే మార్పు సాధ్యమని అమెరికా అధ్యక్షుడి సలహాదారు ఇవాంకా ట్రంప్ ఉద్ఘాటించారు.

లింగ వ్యత్యాస సూచీ

2017 నవంబర్ 2న అంతర్జాతీయ లింగ వ్యత్యాస సూచీని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ విడుదల చేసింది. మొదటి స్థానంలో ఐస్‌లాండ్, రెండో స్థానంలో నార్వే, మూడోస్థానంలో ఫిన్లాండ్ తరువాత వరుసగా రువాండా, స్వీడన్, నికరాగ్వా, స్లావేనియా, ఎనిమిదో స్థానంలో ఐర్లాండ్, తొమ్మిదో స్థానంలో న్యూజీలాండ్, పదో స్థానంలో ఫిలిప్పీన్స్ ఉన్నాయి. ఆర్థిక కార్యకలాపాల్లో మహిళల పరిమిత పాత్ర, తక్కువ వేతనాలు కారణంగా భారత్ 108వ స్థానంలో నిలిచింది. 2016 నాటి ర్యాంకింగ్‌తో పోలిస్తే 21 స్థానాలు దిగజారింది. ఆర్థిక కార్యకలాపాలు, అవకాశాలు, ఆరోగ్య విషయంలో మహిళల పాత్రకు సంబంధించి వరుసగా 139, 141 స్థానాల్లో నిలిచింది. పనిచేసే చోట లింగవ్యత్యాసం, మహిళలకు వేతనాల చెల్లింపులో 136 స్థానంలో నిలిచింది. భారత్‌లో సగటున 66 శాతం మహిళలకు వేతనాలు చెల్లించడంలేదు. రాజకీయ, సాధికారత, ఆయుఃప్రమాణం, అక్షరాస్యతలో లింగ వ్యత్యాసం పెరగడమే భారత్ ఈ ర్యాంకింగ్‌లో వెనుకబడటానికి ప్రధాన కారణాలు. విద్య, ఆరోగ్యం, పనిచేసే చోటు, రాజకీయ ప్రాతినిధ్యం ఈ నాలుగు అంశాల ఆధారంగా లెక్కిస్తుంది. మొత్తం 144 దేశాల్లో అధ్యయనం చేపట్టారు.

జనాభాలో ఇంచుమించు సగమైనా కేవలం 17 శాతం మహిళలుమాత్రమే వివిధ రంగాల్లో పనిచేస్తున్న దేశం మనది. హైదరాబాద్ సదస్సులో భారతీయ మహిళలు పదిహేను శాతమేనని ‘నీతి ఆయోగ్’ పెదవి విరిచింది. అల్పాదాయ దేశాలైన ఉగాండా, ఫిలిప్పీన్స్ లాంటివే పారిశ్రామికవేత్తలుగా స్ర్తిలను ప్రోత్సహించడానికి మనకన్నా మెరుగ్గా ఉన్నారు. అమెరికాలో కోటి పది లక్షలమందికిపైగా మహిళామణులు సొంతంగా వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. 90 లక్షలమందికి ఉపాధి కల్పిస్తూ ఎనిమిది లక్షల కోట్ల డాలర్ల రాబడిని తెస్తున్నట్లు భాగ్యనగర వేదికపై ఇవాంకా ప్రకటించింది. అమెరికాలో 47 శాతం మహిళలు ఉద్యోగాలు చేస్తుండగా అందులో కంప్యూటర్ రంగంలో 21 శాతం, ఇంజనీరింగ్‌లో 13 శాతం మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఉన్నారట. ప్రపంచ వ్యాప్తంగా చట్టసభల్లో సగటున 22 శాతం మహిళా సభ్యులుండే మన లోక్‌సభలో వారి సంఖ్య 12 శాతానికి మించకపోవడం గమనార్హం. ప్రపంచ జడిపిలో మహిళల వాటా 37 శాతం ఉండగా, భారత్‌లో అది 17 శాతం కూడా లేకపోవడం విచారకరం. మన తోటి బ్రిక్స్ దేశాలైన చైనా, బ్రెజిలో స్ర్తి శ్రామిక వాటా 65 నుంచి 70 శాతంకన్నా ఎక్కవ ఉండగా, భారతావని శ్రామిక శక్తిలో స్ర్తిల వాటా కేవలం 27 శాతంగా ఉండటం విచారకం. ఆకాశంలో సగమైన మహిళలకు తగినంత భాగస్వామ్యం ఉంటేనే దేశం వేగంగా పురోగమించగలుగుతుంది. మహిళా శక్తిని గుర్తించాల్సిన అవసరం ప్రభుత్వాలకు, సమాజానికి ఇపుడు ఎంతైనా ఉంది. ప్రధానాధికారి పదవుల్లో ఒక్కశాతం కూడా స్ర్తి మూర్తులు కనబడుటలేదని అంకెలు చెబుతున్నాయి. ఆర్థికంగా, సామాజికంగా సమాన హక్కులు, సాధికారితను సాధించడంలో ఇంకా శైశవ దశలోనే ఉన్నారని చెప్పక తప్పదు.
మహిళల కోసం సేఫర్ సిటీస్
ఆడవాళ్ళకు అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం ఏదంటే దేశ రాజధాని ‘్ఢల్లీ’ పేరే చెబుతుంటారు. అలాంటి పరిస్థితిని అధిగమించేందుకు ‘సేఫర్ సిటీస్’ అనే స్వచ్ఛంద సంస్థ ఏర్పడింది. ఆడవాళ్ళపై జరుగుతున్న అకృత్యాలను ఆపేందుకు ప్లాన్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థ మొదలుపెట్టిన ఉద్యమమే సేఫర్ సిటీస్. బాలల హక్కులపై పోరాడే ఈ సంస్థ మహిళల సంరక్షణ కోసం కూడా ప్రత్యేకమైన వర్క్‌షాపులు నిర్వహిస్తున్నది. అబ్బాయిలు, అమ్మాయిలను ఒక చోట చేర్చి లింగ సమానత్వం, మహిళా సంరక్షణ వంటి అంశాలపై అవగాహన కల్పిస్తుంది. ఇంతవరకు ఈ సంస్థలో సుమారు 10వేలమంది యువతీ యువకులు సభ్యులుగా చేరారట. లైంగికంగా దాడులు చేయడం ఎంత తప్పో అబ్బాయిలకు వివరిస్తున్నారు. సేఫర్ సిటీస్ వలంటీర్లు గల్లీలో తిరుగుతూ ఆత్మరక్షణకై మహిళలకు అవగాహన కల్పిస్తున్నారు. మహిళలకు సాధికారత కల్పించని మానవ పురోగతి అసంపూర్ణమేనని నమ్ముతున్న ప్రధాని మోదీని ఆమె మనస్ఫూర్తిగా అభినందించారు.
తొలిసారి మహిళల మెజారిటీ
మహిళల ప్రాధాన్యం - అందరికీ పురోవగతి పేరిట నవంబర్‌లో జరిగిన పారిశ్రామికవేత్తల సదస్సులో 1500మంది మహిళలు మెజారిటీ సంఖ్యలో హాజరవడం ఇదే తొలిసారి. ప్రపంచ వ్యాప్తంగా 2014-16 మధ్య మహిళా పారిశ్రామికవేత్తల సంఖ్య 10 శాతం పెరిగింది. కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గ్ధామమని.. ప్రపంచ స్థాయి సదస్సు నిర్వహించి ఈ విషయాన్ని చాటి చెప్పడం ఎంతో ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పేర్కొన్నారు. జిఇఎస్ భవిష్యత్ పారిశ్రామిక రంగంలో మహిళల నాయకత్వానికి మరింత ఊతమిస్తుందని మహిళా పారిశ్రామికవేత్తలు ధీమా వ్యక్తం చేశారు. మహిళల నాయకత్వం పెరిగితేనే అభివృద్ధి సాధ్యం కాగలదని ఈ సదస్సు పేర్కొంది.
ఈ విధంగా 2017 సంవత్సరంలో జరుగుతున్న సంఘటనలతో మహిళలు మేల్కొని మహిళా సాధికారతను భవిష్యత్తులో సాధించుకోవాలి.

-కె.రామ్మోహన్‌రావు