మెయిన్ ఫీచర్

నిత్య విద్యార్థి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయ నృత్యం పవిత్ర గంగానదిలాంటిది. అందరినీ పునీతుల్ని చేసే ఆ గంగాప్రవాహం వంటిదే తెలుగువారి నృత్యరీతి కూచిపూడి ఈ రసగంగ ప్రవాహంలో ఎందరో కళాకారులు తమ జీవితాలను ధన్యం చేసుకున్నారు. అసమాన రీతిలో కళకు సేవచేస్తూ ఆ కళావైభవానికి వనె్నలద్దుతున్నారు. ఈ రసామృతాన్ని ఆస్వాదిస్తూ, పావనులవుతున్న నాట్యాచారుడు, కూచిపూడి అనే ఈ పవిత్ర రసగంగలో విరిసిన పద్మం
డా చింతా రవి బాలకృష్ణ.

డా చింతా రవి బాలకృష్ణ కూచిపూడి నృత్యంలో ఎం.ఏ చేసి, స్వర్ణపతకం కూడా అందుకున్నారు. అలాగే కూచిపూడి నృత్యంలో సర్ట్ఫికెట్, డిప్లొమా పొందారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో కూచిపూడిలో పరిశోధన చేసి, ‘కూచిపూడివారి రూపానుసారం -వేదాంతం సత్యనారాయణ శర్మ’ అనే అంశంమీద సిద్ధాంత వ్యాసం రాసి, 2016లో పిహెచ్‌డి పొందారు. చింతా రామమూర్తి, వేదాంతం రత్తయ్య శర్మ, పసుమర్తి రత్తయ్య శర్మ ,పద్మశ్రీ వేదాంతం సత్యనారాయణ శర్మ వంటి గురువుల వద్ద నృత్యాన్ని అభ్యసించారు. ఈయన పిహెచ్‌డికి పరిశోధన చేస్తున్నప్పుడు వీరి మార్గదర్శి డా.వేదాంత రామలింగ శాస్ర్తీ. అలాగే పి.సత్యనారాయణ వద్ద మృదంగం చాలా సంవత్సరాలు నేర్చుకున్నారు. ఎన్నో ప్రముఖ పత్రికలలో, సావనీర్లలో వ్యాసాలు ప్రచురించారు. ప్రస్తుతం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో, శ్రీ సిద్ధేంధ్ర యోగి కూచిపూడి కళాపీఠంలో నృత్య శాఖలో గత 12 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. వీరు ఇప్పటివరకు వందల శిష్యులను తయారుచేసి సర్ట్ఫికెట్, డిప్లొమా పరీక్షలలో ఉత్తీర్ణులను చేశారు. వీరివద్ద శిక్షణ పొందిన విద్యార్థులు ఎంతోమంది సిసిఆర్‌టి, హెచ్‌ఆర్‌డి స్కాలర్‌షిప్స్ పొందారు. తిరిగి వారు నృత్యానికి కూడా సేవ చేస్తున్నారు.
పొందిన గౌరవాలు
డా. చింతా రవి బాలకృష్ణ ఎన్నో గౌరవాలు, సత్కారాలు పొందారు. 1995లో న్యూఢిల్లీ, భారత ప్రభుత్వం నుండి సిసిఆర్‌టి స్కాలర్‌షిప్ పొందారు. 2002లో హెచ్‌ఆర్‌డి, హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్, న్యూఢిల్లీ నుండి యంగ్ ఆర్టిస్ట్ స్కాలర్‌షిప్ పొందారు. 2010 హెచ్‌ఆర్‌డినుండి జూనియర్ రీసెర్చి ఫెలోషిప్ పొంది ‘కూచిపూడి నాట్యయోగం - విశే్లషణ’ అనే అంశంమీద పరిశోధన చేశారు. వేదాంతం సత్యనారాయణ శర్మ వద్ద స్ర్తి వేషం నేర్చుకున్నారు. నర్తనశాలలో బృహన్నలగా వేశారు. అలాగే సీతాపహరణంలో సీతగా ఇంకా రావణుడిగా కూడా చక్కగా చేస్తారు. స్ర్తివేషం ఎంత బాగా చేస్తారో ఉషాపరిణయంలో బాణాసురుడిగా అంతే బాగా చేస్తారు . దూరదర్శన్‌లో బి గ్రేడు కళాకారునిగా రాణిస్తున్న ఈయన 2009లో ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ యువ పురస్కారం సంగీత నాటక అకాడమీ నుండి లభించింది. 2007లో యువ సూత్రధారి పురస్కారం సిద్ధేంద్రయోగి ఫెస్టివల్‌లో పొందారు. 2008లో నృత్య కౌముది, 2009లో విశిష్టరత్న- ఉగాది పురస్కారం, 2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉగాది పురస్కారం, నటరాజ సాంస్కృతిక కళాపీఠం, విజయవాడ నుండి నటరాజ పురస్కారం పొందారు. స్వర్ణకంకణంతో సత్కారం పొందారు.
1900 నృత్య ప్రదర్శనలు
డా. చింతా రవి బాలకృష్ణ దాదాపు 1900 నృత్య ప్రదర్శనలు దేశ విదేశాలో ఇచ్చారు. ఎన్నో నృత్య రూపకాలకు రూపకల్పన చేశారు. వెంకటేశ్వర వైభవము, శ్రీరామ పట్ట్భాషేకము, మహిషాసుర మర్దని, గోదా కళ్యాణం, అన్నమయ్య, తరిగొండ వెంగమాంబ, భగవద్గీత, మోహినీ భస్మాసుర, అమరావతీ వైభవం- ఎన్నో కొత్త వ్యస్త నృత్యాంశాలను కొరియోగ్రఫి చేసి అందరి మన్ననలు పొందారు. స్ర్తి పాత్రలు పురుష పాత్రలు సమానంగా, అవలీలగా, సునాయాసంగా చేయగలరు. భామకలాపంలో సత్యభామ, మాధవి, శ్రీకృష్ణుడు చేశారు.
ప్రహ్లాద యక్షగానం: సూత్రధారుడు, హిరణ్యకశ్యపుడు, నరసింహస్వామి, వేత్రహస్తుడు, చండామార్కులు, పాములవాళ్ళు, లీలావతి.
ఉషాపరిణయం: ఉష, చిత్రలేఖ, అనిరుద్ధుడు, శ్రీకృష్ణుడు, శివుడు, వేత్రహస్తుడు, నారదుడు, సూత్రధారి.

శశిరేఖాపరిణయం:శ్రీకృష్ణుడు.
పార్వతీ కళ్యాణం:మన్మథుడు, భృంగి.
మోహినీ భస్మాసురుడు : భస్మాసురుడు.
నర్తనశాల: బృహన్నల, భీముడు
వినాయకచవితి: మయావిష్ణువు
గోదాకళ్యాణం:గరుత్మంతుడు.
కృష్ణవిజయం : వసుదేవుడు.
విజయవిలాసం:బ్రాహ్మణుడు
రుక్మిణీ కళ్యాణం: అగ్నిజ్యోనుడు

స్పిక్ మెకీ ఆధ్వర్యంలో డా. చింతా రవి బాలకృష్ణ ఎన్నో లెక్చర్ డెమాన్‌స్ట్రేషన్స్ భారతదేశమంతటా ఇచ్చారు. కాకినాడ, హైదరాబాద్ మొదలగు ముఖ్య పట్టణాలలవో కేంద్రీయ విద్యాలయాల్లో ఇచ్చారు. అలాగే పగటి వేషాలమీద పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో బుడబుక్కలు, శారద వేషం వేసి చూపించారు.
సంగీతం: నాట్యం సమాహారకళ. ఇందులో సంగీతం, సాహిత్యం, శిల్పం, చిత్రలేఖనం, నృత్యం అన్నీ ఇమిడి ఉన్నాయి. వీరు తండ్రి నాట్యభూషణ చింతా రామమూర్తిగారి వద్ద సంగీతం, నాట్యశాస్త్రం నేర్చుకున్నారు. మృదంగం పి.సత్యనారాయణగారి వద్ద నేర్చుకున్నారు.
ఆశయం: ఎన్ని కష్టాలు వచ్చినా కూచిపూడి గ్రామంలోనే వుండి మా పెద్దలు, గురువులు అందించిన కూచిపూడి సంప్రదాయ నృత్యాన్ని భావితరాలకు కుల తమ భేదాలు లేకుండా అందించడమే నా ఆశయం. ఇది నా తండ్రి మాట మరియు ఆశయం. ఎల్లప్పుడూ నేను నిత్య విద్యార్థినే అని అంటారు డా. చింతా రవి బాలకృష్ణ.

-డా. శ్రీలేఖ కొచ్చెర్లకోట, పిహెచ్.డి