మెయన్ ఫీచర్

అంతులేని అనుమానాలకు జవాబేదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనేక మలుపులు తర్వాత జస్టిస్ లోయ అనుమానాస్పద మరణంపై సుప్రీంకోర్టు పునః విచారణ ప్రారంభించింది. దేశంలో దిగ్గజాలైన న్యాయవాదులు సుప్రీంకోర్టు హాలులో వాద ప్రతివాదుల తరఫున హాజరయ్యారు. హరీష్ సాల్వే, దుష్యంత్ దవే, ముకుల్ రోహత్గీ, ఇందిరాజైసింగ్ తమ వాదనలు ప్రారంభించారు. బాంబే లాయర్ల సంఘం తరఫున దవే హాజరయ్యారు. హరీష్ సాల్వే, ముకుల్ రోహత్గీ మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున, మహారాష్ట్ర జర్నలిస్టు బందురాజ్ లోనా తరఫున ఇందిరాజైసింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి, న్యాయవాదులకు మధ్య ఆసక్తిదాయకమైన చర్చ జరిగింది. దేశ న్యాయవ్యవస్థలో ఇంతకుముందెన్నడూ లేనంత సంక్షోభం నెలకొనడానికి గల కారణాల్లో జస్టిస్ లోయ మృతి కేసు ఒకటి.
పూర్వపరాల్లోకి వెళ్తే... సుప్రీంకోర్టు గాడి తప్పుతోందని నలుగురు సీనియర్ న్యాయమూర్తులు తమ అసంతృప్తి వ్యక్తం చేస్తూ వారు ప్రస్తావించిన కేసుల్లో ప్రధానమైనది జస్టిస్ లోయ అనుమానస్పద మరణంపై దాఖలైన పిటీషన్ ఒకటి. రోస్టర్‌కు తానే మాస్టర్ అని ప్రకటించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్‌కు అప్పగించడం సీనియర్ల అసంతృప్తికి కారణమైంది. సీనియర్ల గళాన్నివిన్న జస్టిస్ అరుణ్ మిశ్రా కేసు విచారణ బాధ్యతల నుండి తప్పుకున్నారు. కేసు పునః విచారణ చేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. కేసు విచారణకు ప్రధాన న్యాయమూర్తి కొత్త ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. ఈ బెంచ్‌లో ప్రధాన న్యాయమూర్తితోపాటు జస్టిస్ ఎ ఎం ఖాన్ విల్కర్, జస్టిస్ డి వై చంద్రచూడ్ సభ్యులుగా ఉంటారు. జస్టిస్ లోయ మృతి కేసుకు సంబంధించి అన్ని డాక్యుమెంట్లను తమ ముందుంచాలని వాది- ప్రతివాదిలను ప్రధాన న్యాయమూర్తి ఆదేశించారు. దాంతో కథ మళ్లీ ప్రారంభమైంది. జస్టిస్ లోయ కేసు పునఃవిచారణను సుప్రీంకోర్టు చేపట్టడంతో దేశం అంతా భవిష్యత్ పరిణామాలను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
సోహ్రాబుద్దీన్, అతని భార్య కౌసర్ బీ, వారి స్నేహితుడు తులసీదాస్ ప్రజాపతిని గుజరాత్ యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ 2005 నవంబర్ 3న హైదరాబాద్ నుండి సాంగ్లీ వస్తున్నపుడు బస్సులోనుండి దించి విడివిడిగా తీసుకువెళ్లి ఎన్‌కౌంటర్ చేసి చంపేశారనేది ఆరోపణ. ఈ కేసులో అప్పటి గుజరాత్ హోం మంత్రి అమిత్‌షా పేరు వినిపించింది. దాంతో కేసు విచారణను గుజరాత్ నుండి బాంబేకు మార్చారు. దానిపై విచారణ ప్రారంభించిన న్యాయమూర్తిని ఆకస్మికంగా మార్చేశారు. ఆయన స్థానంలో వచ్చిన రెండో న్యాయమూర్తి జస్టిస్ లోయ.
ముంబైలో సిబిఐ ప్రత్యేక న్యాయమూర్తిగా వ్యవహరించిన జస్టిస్ బ్రిజ్ గోపాల్ హరికిషన్ లోయ (48) 2004లో బాధ్యతలు స్వీకరించే నాటికి కేవలం సోహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసు మాత్రమే విచారణలో ఉంది. దానిని ఆయన చేపట్టి విచారణ కొనసాగిస్తున్న సమయంలో హఠాన్మరణం చెందారు. సోహ్రాబుద్దీన్‌ను గుజరాత్‌కు చెందిన యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఎన్‌కౌంటర్ చేసింది. అప్పట్లో గుజరాత్ హోంమంత్రిగా ఉన్న ప్రస్తుత బిజెపి అధినేత అమిత్ షా పేరు ఇందులో ప్రస్తావనకు రావడంతో సోహ్రాబుద్దీన్ కేసు ప్రాధాన్యతను సంతరించుకుంది. జస్టిస్ లోయ 2014 డిసెంబర్ 1న ఆకస్మికంగా మరణించారు. సహచరుడు స్వప్నా జోషి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరైన జస్టిస్ లోయ నాగ్‌పూర్‌లోని సివిల్ లైన్స్‌లో ఉన్న రవి భవన్ అనే విఐపి అతిథి గృహంలో బస చేశారు. తెల్లవారుజామున నాలుగు గంటలకు గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా ఆయన చనిపోయారని కథనాలు వచ్చాయి. ఆయన మరణం వెనుక పెద్ద మిస్టరీ ఉందని లోయ సోదరి బియానీ తండ్రి హరికిషన్ ఆరోపించారు. అయితే కుమారుడు అనూజ్ మాత్రం తన తండ్రి మరణంలో ఎలాంటి సందేహాలు లేవని బాంబే హైకోర్టు చీఫ్ జస్టిస్ మంజులా చెల్లూర్‌ను వ్యక్తిగతంగా కలిసి వివరించాడు. అయితే ఆయన బయటివారి ఒత్తిళ్ల వల్లే అలా చెప్పి ఉంటారనే కథనాలు కూడా వినిపిస్తున్నాయి. జస్టిస్ లోయ సతీమణి మాత్రం బహిరంగ ప్రకటనకు వెనుకాడుతున్నారు. లోయకు ఛాతినొప్పి వచ్చినపుడు తామే కారులో ఆయనను దగ్గరలోని దండే ఆస్పత్రికి తీసుకువెళ్లామని జస్టిస్ శ్రీ్ధర్ కులకర్ణి, జస్టిస్ శ్రీరామ్ మోదక్‌లు చెప్పడం, మరో కథనంలో రిక్షాలో ఆస్పత్రికి వెళ్లారనడం అనుమానాలకు తావిచ్చింది. జస్టిస్ లోయను ఆస్పత్రికి తీసుకువెళ్లినపుడు స్థానిక జడ్జి విజయకుమార్ బోర్డే కారును డ్రైవ్ చేశారని మరికొందరు చెప్పారు. దండే ఆస్పత్రికి తీసుకువెళ్లేసరికి అక్కడ ఇసిజి మిషన్ పనిచేయలేదని దాంతో సమీపంలోని కార్పొరేట్ ఆస్పత్రి మెడిట్రినాకు తీసుకవెళ్లేసరికే ఆయన మార్గమధ్యంలో చనిపోయారని మరో కథనం. జడ్జీలు ఆయనను తీసుకువెళ్లలేదని, ఆటోరిక్షాలోనే తీసుకువెళ్లారని ప్రత్యక్ష సాక్షులు చెప్పడం మరికొన్ని అనుమానాలకు తావిచ్చింది. ఆరు నిమిషాల్లో వెళ్లాల్సిన దూరానికి 43 నిమిషాలు ఎందుకు పట్టిందనేది కూడా అనుమానమే. జస్టిస్ లోయ మరణంపై అనుమానాలు అక్కర్లేదని గుండెపోటుతోనే మరణించారని జస్టిస్ భూషణ్ గవాయ్, జస్టిస్ సునీల్ షుక్రీ ఆనాడే చెప్పారు. లోయ దండే ఆస్పత్రికి వచ్చిన తర్వాత ఇసిజి చేశారని, అయితే ఆ ఇసిజిపై నవంబర్ 30వ తేదీ రాసి ఉందని, వాస్తవానికి ఆనాటికి లోయ అసలు నాగ్‌పూర్ రాలేదనేది మరో అంశం. ఈ మొత్తం వ్యవహారంలో బాంబే న్యాయమూర్తుల ప్రమేయం ఎక్కడా లేకపోయినా వారంతట వారే ఎందుకు ప్రకటన చేయాల్సి వచ్చిందనేది మరో అనుమానం. లోయ మరణించినట్టు తమకు ఐదు గంటలకే చెప్పారని, అయితే రికార్డుల్లో మాత్రం ఆయన మరణించింది 6.15 అని పేర్కొన్నారని లోయ కుటుంబ సభ్యులు చెప్పడం ఇంకో అనుమానానికి తావిచ్చింది. రక్తంతో చొక్కా ఎందుకు తడిసిపోయిందనేది ఇంకోకొత్త అనుమానం. ఛాతిలో నొప్పి వచ్చిన మాట నిజమే అయితే ఆయన శరీరంపైన గాయాలు, దుస్తులు రక్తంతో ఎందుకు తడిశాయని లోయ కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. చొక్కా కాలర్‌పై రక్తం ఉందని, ఫ్యాంట్ బెల్టు వ్యతిరేక దిశలో ఉందని, ఫ్యాంట్ క్లిప్ విరిగిపోయి ఉందని లోయ సోదరి ఆరోపించారు. మరో సోదరి మంధానే మాట్లాడుతూ మెడపై రక్తపు చారికలు ఉన్నాయని, తలపై గాయమైందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రశ్నలకు ఇంత వరకూ సమాధానం లేదు. ఇందులో ఏది నిజమో, ఏది అవాస్తవమో కూడా తేలలేదు.
జస్టిస్ లోయ విచారించిన సోహ్రాబుద్దీన్ కేసులో తదుపరి న్యాయమూర్తి 2015లో అమిత్ షాకు క్లీన్ చిట్ ఇచ్చారు. అక్కడి నుండి అనుమానాలు మొదలయ్యాయి. అనుమానాలు నిజమో కాదో తెలియకున్నా ఇలాంటి కేసుల్లో విచారణ జరిపించకుండా ఉండటమంటే అది న్యాయవ్యవస్థకు మాయని మచ్చగా మిగిలిపోతుందని ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎ పి షా సహా పలువురు తీవ్రంగా స్పందించారు. సంచలన కేసు కొనసాగుతున్న సమయంలో సిబిఐ ప్రత్యేక న్యాయమూర్తి మరణించడం దిగ్భ్రాంతికి గురిచేసింది. జస్టిస్ లోయ మృతిపై విచారణ కోరుతూ బాంబే హైకోర్టు, సుప్రీంకోర్టులలో మూడు పిటీషన్లు దాఖలయ్యాయి. వాటిలో ఒకటి బాంబే లాయర్స్ అసోసియేషన్ తరఫున బాంబే హైకోర్టులో దాఖలు కాగా, సుప్రీంకోర్టులో రెండు పిటీషన్లు దాఖలయ్యాయి. సుప్రీంకోర్టులో ఒక కేసు కాంగ్రెస్ నేత తహసీన్ పూనావాలా దాఖలు చేయగా, మరో కేసు మహారాష్ట్ర జర్నలిస్టు బందురాజ్‌లోనే దాఖలు చేశారు. బందురాజ్‌లోనే తరఫున సుప్రీంకోర్టులో ఇందిరా జైసింగ్ వాదిస్తున్నారు. ఆమె తన పిటీషన్‌ను డిసెంబర్ 12న దాఖలు చేశారు.
ప్రధాన విచారణలో ఇందిరాజైసింగ్ తన వాదనలు వినిపిస్తూ ఇదేదో ఒక కుటుంబానికి చెందిన కేసు కాదని అన్నారు. ఒక న్యాయమూర్తి మరణించినపుడు దానిపై విచారించాల్సిన బాధ్యత న్యాయవ్యవస్థపై ఉందని పేర్కొన్నారు. మరో పక్క జస్టిస్ లోయ పోస్టుమార్టం రిపోర్టును అందజేయాలని సుప్రీంకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. లోయ మృతిపై ఉన్న అన్ని అనుమానాలు నివృత్తి కావల్సి ఉందని ఆమె పేర్కొన్నారు. జస్టిస్ లోయను ఎవరో చంపారని మనం చెప్పలేం, కాని పరిస్థితి చూస్తే మాత్రం అది సహజమైన మృతిలా అనిపించడం లేదని ఇందిరా తన వాదన వినిపించారు. లోయ కుమారుడు అనూజ్ మాత్రం తన తండ్రిది సహజ మరణమేనని దానిని వివాదం చేయవద్దని చెబుతుండగా, లోయ సోదరి మాత్రం జస్టిస్ లోయ మరణం సహజంగా లేదని అంటున్నారు. కుటుంబ సభ్యులే భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అనూజ్ మీడియాతో చెబుతున్నపుడు ఆయన బాడీ లాంగ్వేజి చూస్తే ఆయనలో ఆత్మవిశ్వాసం కనిపించడంలేదని, ఇందువల్ల అనుమానాలు పెరుగుతున్నాయని ఇందిరా చెప్పారు. సుప్రీంకోర్టుకు ఈ కేసు విషయంలో అంత తొందర ఎందుకు? కోర్టుకు నిజంగానే అంత ఆసక్తి ఉంటే జస్టిస్ కర్ణన్ కేసు మాదిరి జస్టిస్ లోయ మృతి చెందిన వెంటనే విచారణ జరిపి ఉండాల్సింది అని ఇందిరా వాదిస్తున్నారు.
ఆద్యంతం అనుమానాలే
జస్టిస్ లోయ అనుమానాస్పద మరణం కేసు విచారణపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గతంలో తీసుకున్న నిర్ణయమే నలుగురు సీనియర్ న్యాయమూర్తులు మీడియా ముందుకు రావడానికి కారణమైందనేది నిర్వివాదాంశం. అమిత్‌షాకు అనుకూలంగా తీర్పు చెబితే 100 కోట్ల బంపర్ ఆఫర్ ఉందని సాక్షాత్తు నాటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మొహిత్ షా చెప్పారని లోయ సోదరి బియానీ ఆరోపించారు. గమ్మత్తు ఏమంటే లోయ మరణం తర్వాత సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం జడ్జీగా నియమితులైన ఎంబి గోసని అనే న్యాయమూర్తి సోహ్రాబుద్దీన్ ఎన్ కౌంటర్ కేసును విచారించారు. 2015 డిసెంబర్‌లో అమిత్ షా, ఇతర పోలీసు అధికారులపై కేసు కొట్టి వేశారు. 2014 డిసెంబర్ ఒకటో తేదీన లోయ మరణం తర్వాత ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపించాలని అనేక డిమాండ్లు వచ్చినా మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించలేదు. బాంబే హైకోర్టు సైతం పిటీషన్లను తోసిపుచ్చింది. అకస్మాత్తుగా ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ గవాయి, జస్టిస్ షుక్రే రంగ ప్రవేశం చేసి, లోయ మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని కేసును కొట్టివేశారు. తర్వాత కుటుంబ సభ్యుల కథనాలతో కారవాన్ అనే పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. ఆ కథనం ఆధారంగా హైకోర్టులో ఒక పిటీషన్ దాఖలైంది. అదే సమయంలో ఇటు సుప్రీంకోర్టులోనూ వేర్వేరు పిటీషన్లు దాఖలయ్యాయి. దీనిని పరిశీలించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఎ ఎం ఖాన్ విల్కర్, జస్టిస్ డి వై చంద్రచూడ్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఇది చాలా సీరియస్ విషయమని వ్యాఖ్యానించింది. రానున్న రోజుల్లో ఈ వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుందో ఎదురూచూడాలి.

-బి.వి.ప్రసాద్