మెయన్ ఫీచర్

ఉగ్రవాద వృక్షానికి పూలు-పండ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్ష్యసాధనకు రాజ్యాంగేతర, అప్రజాస్వామిక- హింసా మార్గాల్ని అనుసరించటం పేరు ఉగ్రవాదం. ఉగ్రవాద పికాలాపనల్లో కొమ్మకొమ్మకొక సన్నాయి అన్నట్లు, ఎన్నో విశ్వశాంతి మధుర గీతాలు. జీహాదీలు క్రూసేడర్లు మావోయిస్టులూ అందరూ విశ్వశాంతికోసమే ఉగ్రవాదాన్ని ఆశ్రయించారు అని చెపుతున్నారు. కలకత్తాలో కాళీమాత దేవాలయం ఉంది. ఆ సమీపంలో కొన్ని అంగళ్లున్నాయి. అక్కడ పూజాసామగ్రి అమ్ముకునేవాడు చండీ సప్తశతి పారాయణ చేసుకుంటూ ఉంటాడు. ‘బాబూ నీది ఏ పార్టీ?’అని ప్రశ్నిస్తే, ‘నాది కమ్యూనిస్టు పార్టీ’అని చెపుతున్నాడు. ఇలాంటి వారి సంఖ్య బెంగాల్‌లో గణనీయంగా ఉంది. వీరంతా సమ సమాజాన్ని ఆర్థిక వికేంద్రీకరణను కోరుకుంటున్నారు. ఇటీవల బెంగాల్‌లో కమ్యూనిస్టులు ఒక కరపత్రం విడుదల చేశారు. అందులో మహిషాసురుడు మన దేవుడు. కాళీమాత దుర్గామాత సెక్సువర్కర్లు అని వ్రాశారు. ఇలా చేయటంవలన వారికి ముస్లిం ఓట్లు దళితుల ఓట్లు భారీగా పడుతాయి అని ఆశించారు. కాని జరిగిందేమిటంటే ఇందాక పేర్కొన్న పూజా ద్రవ్యాల వ్యాపారి వంటివాళ్లంతా తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. మమతాబెనర్జీ దేవత కాదు. ఆమె కూడా మనలాంటి మనిషే. కాకుంటే ఒంటరి పోరాటంలో ఆమె కమ్యూనిస్టు కంచుకోటను బద్దలు కొట్టింది. అక్కసు పట్టలేక మమత తన చీరె తానే చింపుకొని మామీద నేరారోపణ చేసే మనస్తత్వం కలది అని స్వయంగా జ్యోతిబాసు అనిన మాటలు నాకు బాగా గుర్తున్నాయి. ఒక కార్యానికి తప్పకుండా కారణం ఉంటుంది. ప్రతిఫలమూ ఉంటుంది. బెంగాల్‌లో కమ్యూనిస్టు ప్రభుత్వం ఎందుకు అంతరించింది? మొదటిది హత్యా రాజకీయాలు. అట్లని తృణమూల్ కాంగ్రెసు కూడా తక్కువ తినలేదు. మీరెందుకు హత్యలు చేస్తున్నారు? అంటే గత్యంతరం లేక అని తృణమూల్ కార్యకర్తలు సమాధానం చెప్పారు. రెండు తప్పులు ఒక ఒప్పు ఎలా అవుతుంది? కాంగ్రెసువారు ఏ విలాస జీవితాలకు అలవాటుపడ్డారో అవన్నీ సిపియం కార్యకర్తలకు సంక్రమించాయి.
వరంగల్‌లో జరిగిన లోక్‌సభ ఉప ఎన్నికలో పధ్నాలుగు వామపక్షాలు కలిసి గాలి వినోద్‌కుమార్ అనే ఉస్మానియా యూనివర్సిటీ లా డిపార్ట్‌మెంట్ టీచర్‌ను అభ్యర్థిగా నిలిపింది. ఆయనకు లోక్‌సభ ఎన్నికలలో వచ్చిన ఓట్లు 14వేలు- అంటే డిపాజిట్ పోయింది. ఓరుగల్లు పోరుగల్లులో ఇలా ఎందుకు జరిగింది?!
కేరళలో పచ్చి మతతత్వ పార్టీలతో అటు కమ్యూనిస్టులూ ఇటు కాంగ్రెసు వారూ జతకట్టారు. అవకాశం దొరికినప్పుడల్లా హిందూ దేవీదేవతలను అవమానించారు. ‘శివుడు మగవాడు విష్ణువు మగవాడు. ఇద్దరు మగవాళ్లకు అయ్యప్ప ఎలా పుట్టాడు?’ అని పరిహసించారు. మరి స్ర్తిపురుష సంయోగం లేకుండా ఏసుప్రభువు ఎలా పుట్టాడు? అని కమ్యూనిస్టులూ ప్రశ్నించలేదు సరికదా కేరళలోని చర్చి వర్గాలతో ఎన్నికల పొత్తులు పెట్టుకున్నారు.
న్యూఢిల్లీలోని కేరళ భవన్‌లో బీఫ్ వడ్డిస్తున్నారని తెలిసి దానిని ఆపటంకోసం పోలీసులు వచ్చారు. అక్కడ పిన్నరాయ్ విజయన్ సత్యాగ్రహం చేసి తమ గోమాంస భక్షణా హక్కును కాపాడుకున్నాడు. మా తిండి మా ఇష్టం అన్నాడు- సరే ఒప్పుకుందాం- కాని ఢిల్లీకి భారత రాజ్యాంగంలోని 48వ అధికరణం వర్తిస్తున్నది- అమలులో ఉంది కూడా!!
2002లో అమెరికాలో యునైటెడ్ ఎంపైర్ బిల్డింగ్ ఉగ్రవాదుల దాడిలో కూలిపోతే ఇండియా సామ్యవాదులు మిఠాయిలు పంచుకున్నారు. ఎందుకు అంటే పెట్టుబడిదారీ దేశం అమెరికాకు నష్టం వాటిల్లింది కదా? అందుకని! ఉగ్రవాది యాకూబ్ మెమన్, అఫ్జల్ గురుల జయంతి వర్ధంతి ఉత్సవాలను సిపియం అనుబంధ విద్యార్థి సంస్థల ద్వారా ఆయా విశ్వవిద్యాలయాల్లో జరుపటం ఇటీవలి సంఘటనలే. స్వామి వివేకానంద దొంగ మేధావి అన్నారు. నేతాజీ సుభాష్‌చంద్రబోసును ‘కుక్క’ అని తిట్టి గాడిద బొమ్మను పీపిల్స్‌వార్ పత్రికలో (కార్టూన్) వేసి కసి తీర్చుకున్నారు. అరవింద ఘోష్‌ను ఘోష్ట్ అన్నారు. మహాత్మాగాంధీని మూడు కోతులూ బోడి నవ్వులూ అని పరిహసించారు. 1942 స్వరాజ్య ఉద్యమకాలంలో వీరు బ్రిటీషువారితో జతకట్టారు. 1948లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘంపై నెహ్రూగారితో కలిసి నిషేధం విధింపజేశారు. తాడికొండ లింగమూర్తి (హిందూ సామాజిక్ కార్యకర్త- ప్రస్తుతం 80 సంవత్సరాల వయస్సు హైదరాబాదు చిక్కడపల్లిలో ఉన్నారు) వంటి వారిని పోలీసులకు పట్టించారు. 1975లో జయప్రకాశ్ నారాయణ్‌ను జైలులో పెట్టించారు. 2008లో సోనియా ఇటాలియాకు మద్దతు నిచ్చి కేంద్ర ప్రభుత్వంపై తమ ఆధిపత్యం సాగించారు. 2016లో కన్హయాకుమార్ అనే ఉగ్రవాద విద్యార్థిని హీరోను చేసి ఊరేగించారు. ‘‘ఈ పిల్లవాడు అపర భగత్‌సింగ్-’’ అన్నాడు శశిధరూర్ అనే తిరువనంతపురం కాంగ్రెసు ఎంపీ. ఇలా ఎందుకు జరిగింది?
వీటన్నింటి సారాంశం ఒకటే! హిందూ సంస్కృతి అంటే పంది సంస్కృతి అని (జ్వాలాముఖి) వీరి అభిప్రాయం. హిందువులను హిందూ దేవీ దేవతలను వారి ఆచార వ్యవహారాలను నిందించవచ్చు. అందుకోసం జీహాదీలతోను క్రూసేడర్లతోనూ కూడ చేతులు కలుపవచ్చు. ఈ దారుణం గత నూరు సంవత్సరాలుగా ఇండియాలో జరుగుతూనే వస్తున్నది. చైనా భారతదేశాన్ని జయించాలని విశ్వప్రయత్నం చేస్తున్నది. అందుకు బహిరంగ యుద్ధం కన్నా అంతర్గత యుద్ధాన్ని (సివిల్ వార్) ప్రోత్సహిస్తున్నది. ఈ పరిస్థితిని మనం బెంగాల్, బీహార్, జార్ఖండ్, తెలంగాణా, కేరళ, చత్తీస్‌గఢ్, న్యూఢిల్లీ జెఎన్‌యులల్లో చూడవచ్చు. అనుశాసన బద్ధతకు శ్రమించాలి కాని అరాజకత్వానికి- అనార్కీ- విధ్వంసానికి ఎక్కువ సమయం- సంయమనం అవసరం లేదు. ఢిల్లీలో నరేంద్రమోడీకి మన హైదరాబాదులో కెసిఆర్‌కు నిద్ర లేకుండా చేయటంలో చైనా విజయం సాధించింది. మావోయిస్టుల ఎజెండాయే నా ఎజెండా అని కెసిఆర్ కెటిఆర్‌లు పదేపదే చెప్పిన విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు. ఇప్పుడీ ఎన్‌కౌంటర్లు ఏమిటి? అని సూటిగా ప్రశ్నిస్తున్నారు- నిజమేకదా?
భారతదేశంలో కమ్యూనిస్టులకు మొదటినుండి బలం తక్కువే. అందుకే కాంగ్రెసు భుజాలు ఎక్కండి అని స్టాలిన్ ఆజ్ఞాపించాడు. నేతాజీ, లాల్‌బహదూర్‌శాస్ర్తీ, శ్యామాప్రసాద్ ముఖర్జీ, దీనదయాళ్ ఉపాధ్యాయ వంటి నాయకులను భారత రాజకీయ రంగస్థలంనుండి తొలగించటంలో చైనా, రష్యాలు కీలకపాత్ర పోషించాయి. చేసింది కాంగ్రెసు చేయించింది రష్యా. రష్యాలోని ఒక కోర్టులో ఇటీవల ఒక సంఘటన జరిగింది. శ్రీకృష్ణుడు దుర్మార్గుడు లక్షల మందిని చంపించాడు. గోపికలతో రాసక్రీడలాడాడు. కాబట్టి భగవద్గీతను నిషేధించండి- అని ఒక క్రైస్తవ సన్యాసిని కేసుపెట్టింది. జడ్జి ఇలా ప్రశ్నించాడు. నీవు బాప్టిజం పుచ్చుకొన్నప్పుడు ఏమని ప్రమాణం చేశావు? ‘‘క్రీస్తు నాకు ప్రభువు అని ప్రమాణం చేశాను. నాకు కర్త- భర్త-? ఏసుక్రీస్తే? ‘‘ఇలా ప్రపంచంలో ఎంతమంది ప్రమాణం చేశారు. ‘‘కొన్ని కోట్ల మంది క్రైస్తవ సన్యాసినులు ప్రమాణం చేశారు’’.
‘‘ఐతే క్రీస్తుకు ఎందరు భార్యలు?’ అని జడ్జి
ప్రశ్నించాడు.
‘‘మైలార్డ్- ఇది భౌతిక శారీరక సంబంధం కాదు. ఇది ఆధ్యాత్మిక అనుబంధం’’అని చెప్పింది క్రైస్తవ సన్యాసిని.
‘గోపికలతో శ్రీకృష్ణుడి సంబంధం కూడా ఆధ్యాత్మికమేనని హిందూ పురాణాలల్లో వ్రాసి ఉంది. గోపికల చీరెలు దొంగిలించినపుడు శ్రీకృష్ణుని వయస్సు 8 సంవత్సరాలు. దీనిని సంకేతం(సింబాలిక్స్)గా స్వీకరించాలి. చీరెలు అంటే లౌకిక వ్యామోహాలు- ‘వాటిని కృష్ణుడు హరించాడు’ అని తీర్పుచెప్పి నన్ వేసిన కేసును కొట్టివేశాడు.
చైనా, పాకిస్తాన్, శ్రీలంక, మయన్మార్, అమెరికా చివరకు నేపాల్ కూడా దాడికి సిద్ధపడ్డాయి. ఇది మన అరవై ఏళ్ళ మన విదేశాంగ నీతి పరిణామం. ఇక అంతర్గతంగా ప్రతి విశ్వవిద్యాలయమూ కూడా ఒక చైనా వారి స్థావరంగా మారింది.
భారుూచారా అంటే స్నేహబంధం- ఇస్లాం భారుూచారాను ప్రబోధిస్తున్నది అని ప్రచారం చేశారు. పారిస్ ఫుట్‌బాల్ స్టేడియంలో బాంబులుపెట్టి వందలాదిమందిని చంపడం స్నేహబంధం కిందికి వస్తుందా? బ్రెస్సెల్‌లో (22-3-2016) విమానాశ్రయంలో బాంబులు పెట్టి అమాయకులైన ప్రయాణికులను చంపడం భారుూచారా అంటారా? హైదరాబాద్ కోఠీలోని గోకుల్ ఛాట్ భాండార్ దగ్గర మిరపకాయ బజ్జీలు తినేవారిని చంపటం భారుూచారా అంటారా?? ఇలాంటివాళ్ళకు శశిధరూర్ దిగ్విజయ్‌సింగ్, మనీష్ తివారీలు మద్దతునివ్వటం ఏమిటి?
ఉగ్రవాద విషవృక్షానికి పూచిన పూలు- పండ్లూ ఇవి. భరించండి!!
జిహాదీ ఉగ్రవాదం సామ్యవాద ఉగ్రవాదం. ఎవాంజిలికల్ ఉగ్రవాదం మణిశంకర అయ్యర్ మనీష్ తివారీల ఉగ్రవాదం- అమెరికా ఆర్థిక ఉగ్రవాదం, కన్హయాకుమార్ వెర్బల్ టెర్రరిజం- ఇవన్నీ ఉగ్రవాద వృక్షఫలాలే- వీటిని నిరోధించడంలో వీటిని నిరోధించే సంకల్పం పాలకులకు లేకపోవడానికి కారణం అట్టివారిని ఎన్నుకున్న ఓటర్లు చేసుకున్న పాపఫలం.
‘‘్భరతదేశంలో మోడీ ప్రభుత్వాన్ని ఓడించటంకోసం ఐఎస్‌ఐ(పాకిస్తాన్) వారు సహాయపడాలి’’ ఈ ప్రకటన కరాచీలో చేసింది మణిశంకర అయ్యర్.
‘‘నేషనలిజం ఈజ్ స్క్రేండర్స్ లాస్ట్ రిసార్ట్’’ ఈ ప్రకటన చేసింది మనీష్ తివారి.
‘‘శ్రీమహావిష్ణువు పరమ దుర్మార్గుడు’’ రాజ్యసభలో ఈ ప్రకటన చేసింది సిపియం నాయకుడు ఏచూరి సీతారాం.
ఆ దృశ్యాలు టీవీలో నేను స్వయంగా చూచిన తర్వాత ఇక కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీల మీద జీవితంలో ఎలా సానుభూతి ప్రకటించగలను??
‘‘్భరతదేశాన్ని ముక్కలు ముక్కలు చేయండి’’- జెఎన్‌యు ఫిబ్రవరి 9, 2016 సబర్మతి దాబావద్ద విద్యార్థి నాయకుడు కన్హయకుమార్ ప్రకటన!

- ముదిగొండ శివప్రసాద్