మెయిన్ ఫీచర్

భక్తుల పాలిట కల్పతరువు జమలాపురం వేంకటేశ్వర స్వామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆపద్బాంధవుడు అనాధరక్షకుడిగా పిలిస్తే పలికే దైవంగా కలియుగ శ్రీవేంకటేశ్వరునికి త్రేతాయుగంలోను ద్వాపర యుగంలోను భక్తులున్నారనడానికి వేలాది సంవత్సరాల చరిత్ర వున్న జమలాపురంలో వెలసిన స్వయంభూ శ్రీవేంకటేశ్వరుడే నిదర్శనమని చరిత్ర చెపుతోంది. త్రేతాయుగంలో దశరథ మహారాజు ఆస్థానంలో వున్న జాబాలి మహర్షి వనవాసానికి వెళ్లిన సీతారాములను వెనక్కి తీసుకురావడానికి ప్రయత్నించి విఫలమై అయోధ్యకు తిరిగి వెళ్ళలేక మార్గమధ్యమంలోని సూచిగిరి కొండపై తపస్సుకు పూనుకొన్నాడు. ఈ కొండపై రెండు గుహలున్నాయి. జాబాలి మహర్షి తపస్సుకు మెచ్చి వేంకటేశ్వరస్వామి సాక్షాత్కరించి మహర్షి ని మెచ్చుకున్నాడు. అందుకే ఈ గుహకు వైకుంఠ గుహ అనే పేరు సార్థకమైందని
ద్వాపర యుగంలో అర్జునుడు పాశుపతాస్త్రం కోసం తపస్సు చేసే సమయంలో ముకాసురుడి రూపంలో వున్న వరాహస్వామి శివార్జునుల బాణాలు తగిలి అంతర్థానమయ్యాడని, ఆ ప్రదేశమే వేంకటేశ్వరుడు వెలసిన గుహ అని పురాణాలు చెప్తున్నాయి. ఈ ప్రదేశంలో వున్న కోనేరులో స్నానం చేస్తే పాపాలు, సర్వరోగాలు నశించిపోతాయని ఆనాటి నుండి ప్రజల విశ్వాసం. కాల ప్రభావంతో ఆ కోనేరులో నీరు మాయమైంది.
ఆ తర్వాత కాలంలో స్వామివారికి నిత్య పూజా ఆరాధన తగ్గిపోయంది. కొంతకాలానికి ఉప్పల యజ్ఞనారాయణ శర్మ అనే బ్రాహ్మణుడు దేశాటనచేస్తూ భరద్వాజ నదిలో స్నానం చేసి సూచిగిరిపై వెలసిన వేంకటేశ్వరుడిని పూజించే వాడని, ఆయనే అక్కడ శ్రీవేంకటేశ్వరుడికి ప్రథమ అర్చకుడని చరిత్ర చెపుతోంది. ఈయన వంశంలో ఆరవ తరానికి చెందిన అక్క్భుట్టు అరణ్య ప్రాంతంలో వున్న సూచిగిరి నుండి వేంకటేశ్వరుడిని ప్రస్తుతం వున్న జమలాపురానికి తీసుకొని వచ్చి భక్తిశ్రద్ధలతో పూజించి ఈ ప్రాంతానికి విశిష్టత పెంచారు. ఆ తరువాతకాలంలో కాకతీయ ప్రభువు ప్రతాపరుప్రదుడు, విజయనగర రాజులు ఈ ఆలయాన్ని శిల్పకళా వైభవంతో బాగా అభివృద్ధి చేశారు.
ఒకసారి ఈ ప్రాంతాన్ని పాలించే దేశపాండే ఆలయ అర్చకులను పిలిచి తనకు పూజలు జరిపించాలని ఆదేశించగా అర్చకులు నిరాకరించారని, ఆ క్షణమే ఆ పూజారులను అర్చకవృత్తి నుండి తొలగించారని చరిత్ర చెపుతోంది. ఆ తరువాత నియమించిన పూజారులు ఆలయానికి వెళ్లనీయకుండా దండుచీమలు, పాములు అటకాయించి పూజారిని ప్రజలను భయభ్రాంతులను చేశాయి. తన తప్పు తెలుసుకున్న దేశపాండే విధులనుండి తొలగించిన బ్రాహ్మణులనే రప్పించి పూజలు నిర్వహించారు. ఆనాటినుండి ఆ పూజారుల వంశానికి చెందిన పూజారులే వంశపారంపర్యంగా అర్చక వృత్తి నిర్వహిస్తూ స్వామివారిని సేవిస్తున్నారు.
ఈ స్వామి ప్రక్కనే శ్రీచక్ర రూపంలో అమ్మవారిని ప్రతిష్టించారు. ఉప్పు వంశీయులైన పూజారులు, ధర్మకర్తలు దేవాలయ నిర్వహణకు 25 ఎకరాల భూమిని సమకూర్చారు. ఖమ్మం జిల్లా జమలాపురంలో వున్న ఈ ఆలయానికి ఆ గ్రామ ప్రజలు తమ పంట పొలాల్లో పండించిన వాటిని ముందుగా కొంత స్వామివారికి నివేదిస్తారు. ఆలయం ప్రాంతంలోనే స్వామివారి పాదాలు, గోదాదేవి మందిరం కూడా వున్నాయి. కోరిన కోర్కెలు తీర్చే భక్తుల పాలిట కల్పతరువుగా జమలాపురంలోని శ్రీవేంకటేశ్వరుడు నిత్య పూజాభిషేకాలతో దేదీప్యమానంగా వెలుగొందుతున్నాడు.

- మురళీధర్