మెయిన్ ఫీచర్

సాంబుని పెళ్లితో కౌరవులకు బుద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామాయణం, మహాభారతం, భగవద్గీత, భాగవతం మానవజాతికి మనశ్శాంతిని ప్రసాదించే గుళికలు. వీటిలోని పాత్రలు ధర్మమార్గంలో వెళ్లడానికి దారిచూపుతాయి. ఎల్లప్పుడు వీటిని మననం చేసుకుంటూండాలి అంటారు పెద్దలు. ద్వాపరయుగంలో హరిహరులు శ్రీకృష్ణబలరాములుగా అవతారాలెత్తారు. ఆనాడు శ్రీకృష్ణుడు ధర్మాన్ని రక్షించ బద్ద కంకణుడైతే, బలరాముడు అన్యాయాన్ని భూస్థాపితం చేయ నడుంకట్టాడు.
కౌరవుల్లో దుర్యోధనుడు పెద్ద అహంభావి. దురాలోచనాపరుడు. బాల్యం నుంచి ఎవరైనా బాగుంటే చూడలేడు. మరీ పాండవులు సంతోషిస్తున్నారంటే అసలు ఓర్చుకోలేడు. అటువంటి మనస్తత్వం పెరిగి దుర్యోధనునితో పాటు పెద్దయం ది. పాండవులకన్నా తాను అధికంగా ఉండాలని కోరుకునేవాడు. కాని అధర్మపరుడు కాబట్టి ఎపుడు అపజయమే ఎదురవుతూ ఉండేది..దాంతో మరింత గింజుకొనేవాడు. ‘లక్షణ’ దుర్యోధనుని అందాల కూతురు. ఆమెను శ్రీకృష్ణ జాంబవతిల కుమారుడు ‘సాంబుడు’ వివాహం చేసుకోజూసి ఎత్తుకెళ్లాడు. దుర్యోధనుడు, ఆయన సోదరులు దీన్ని పరాభవంగా భావించారు.
అందుకే సైన్యంతో మధుర వెళ్లి లక్షణతోపాటు సాహసవంతుడైన సాంబుడిని బంధించి హస్తినాపురానికి తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న బాలరామకృష్ణులు, యాదవులు ఆగ్రహంతో ఊగిపోయారు. అప్రమత్తమైన యాదవ సైన్యం దండయాత్రకు సిద్ధపడింది. ‘‘మనం ఇప్పుడు కౌరవులతో వియ్యం కోరుకోవాలి కానీ, కయ్యం కాదు’’ అని బలరాముడు వారిని శాంతపరిచాడు. ఆయన బ్రాహ్మణులు, యాదవ పెద్దలను వెంటబెట్టుకొని గౌరవ మర్యాదలకు లోటురాకుండా హస్తినకు బయలుదేరాడు. హస్తినాపురంలో బలరాముడు, యాదవ పెద్దలు కౌరవులకు అనేక విధాలుగా నచ్చచెబుతూ సాంబునితో లక్షణ వివాహం జరిపించ ఒప్పించడానికి ప్రయత్నించారు. అందుకు దుర్యోధనుడు ససేమిరా అన్నాడు. - పదిమంది యోధులు కలిసి ఒక్క కుమారున్ని బంధించి, తమ రాజ్యానికి తెచ్చుకోవడం న్యాయ సమ్మతం కాదు కాబట్టి, చేసిన తప్పొప్పుకొని పశ్చాత్తాపం చెందాలని బలరాముడన్నాడు. కానిఅదీ కుదరదని దుర్యోదనుడు అన్నాడు.
అంతవరకు ఎంతో ప్రశాంతంగా ఉన్న బలరాముడు కోపాగ్ని జ్వాలలు చిమ్మే కండ్లతో, పొంగిన నరాలతో ‘‘దుర్యోధనా! నీ తమ్ములు, శకుని, కర్ణుడూ మొదలైన వారి బలం చూసుకొని నువ్వింతగా ఎగిసిపడుతున్నావ్. త్వరలో వీటన్నిటికి మూల్యం చెల్లించుకోక తప్పదు’’అని హెచ్చరిస్తూ తన పరివారంతో వెళ్లిపోయాడు. బలరాముడు మధురలో తన మంత్రులను, యాదవ పెద్దలను కూర్చోబెట్టి తక్షణ కర్తవ్యన్ని సూచించవలసిందిగా కోరాడు. చాలాసేపు తర్జన భర్జనలు జరిగాయి. అందరూ ముక్తకంఠంతో జాగుచేయక ధనమదాంధులైన కౌరవులకు తగిన బుద్ధి చెప్పవల్సిందేనని సలహా ఇచ్చారు. బలిష్ఠుడైన బలరాముడు, కౌరవుల నామరూపాలు లేకుండా చేస్తానంటూ తన హలంతో హస్తినాపురాన్ని పెకలించి ఎండుటాకువలె ఎత్తి సముద్రంలో పడవేశాడు.
జరగాల్సిన నష్టం జరుగుతోంది. ఇపుడు ఏం చేయాలో బలరాముణ్ణి ఎలా నిలువరించాలో దుర్యోధనుడికి తెలియలేదు. దాంతో ముందు నుయ్యి వెనుక గొయ్యి వంటి పరిస్థితుల్లో చేసేదేమీ లేక దుర్యోధనుడు, ఆయన సోదరులు విచారంలో మునిగి కూర్చున్నారు. భీష్మ ద్రోణ కృపాచార్యులు ఇది బలరాముని అవమానించినందుకు చేసిన పనియేనని అనుకొన్నారు. ఆలస్యం చేయక లక్షణ సాంబుల వివాహం జరపడమే ఏకైక మార్గమని దుర్యోధనునికి సలహా ఇచ్చారు.
అందరూ వెళ్లి బలరాముని కోపం తగ్గించి చివరకు వారి వివాహ ప్రయత్నంతో కౌరవులు ముక్కుమూసుకుని కూర్చోన్నారు. చూశారా చెడు ఆలోచనలు చెడు పనులు చేస్తూ ఉంటే చివరకు అందరి చేత చివాట్లు తప్పవు. అందుకే అంటారు పెద్దలు చూపిన దారిలో నడుస్తూ ఎవరికీ హాని చేయకూడదని. అందరి మంచి కోరుకుంటే మనకూ మంచి జరుగుతుందని అంటారు. అది తెలియకపోతే దుర్యోధనునికి పట్టిన గతి పడుతుంది.

- చివుకుల రామమోహన్