మెయిన్ ఫీచర్

ఆర్ట్ సిల్క్.. అదిరే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెళ్లి లేదా వేడుక ఏదైనా చీర కొనాలనుకుంటే చాలామంది మహిళలు ఇష్టపడేది పట్టుచీరనే. ప్రతిసారీ పట్టుచీర కొనాలంటే తటపటాయించక తప్పదు. షాపింగ్‌కు వెళ్లిన ప్రతిసారీ పట్టుచీర కొనాలంటే జేబులకు చిల్లులు పడతాయి. అందుకే చాలామంది మగువలు ఆర్ట్ సిల్క్ చీరలను ఇష్టపడుతున్నారు. పట్టుచీర స్థానంలో ఆర్ట్ సిల్క్ చీరలు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. సంప్రదాయ వేడుకలకు నిండుదనాన్ని తీసుకువస్తున్నాయి. ప్యూర్ సిల్క్ లేదా ఆర్ట్ సిల్క్ చీరలు చిరుగాలికి సైతం రెపరెపలాడుతుంటాయి. లైట్‌వెయిట్‌తో పండుగ లేదా శుభకార్యాల్లో ప్రత్యేకంగా కనిపిస్తారు. రాబోయేది వేసవి కాలం కాబట్టి ఇంకా మరింత సౌకర్యవంతంగా మేనుకు హత్తుకుంటాయి. ఆర్ట్ సిల్క్ చీరల తయారీ పట్టుచీర కంటే తక్కువగా ఉంటుంది. ఆర్ట్ సిల్క్ చీరలు రేయాన్తో తయారుచేస్తారు. వీటిపై డిజైన్లు, ప్రింట్స్ అన్నీ కూడా పట్టుచీరను పోలి ఉండటంతో ఆర్ట్ సిల్క్ చీరను పట్టుచీరగానే భ్రమపడతారు. కాటన్, పట్టు, ఉన్ని దారాలతో తయారుచేసే ఈ చీరలు ఖరీదు తక్కువ. ఈ చీరలు కట్టుకుంటే మేనుకు చల్లగా ఉంటుంది. ఏ కాలంలోనైనా పట్టుచీరను మరిపిస్తోంది.ఈ చీరలపై ఏ డిజైన్ వేసినా ప్రత్యేకంగా కనిపిస్తాయి. పార్టీవేర్‌గానూ వస్తున్నాయి. ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఆర్ సిల్క్‌చీరలను చక్కని రంగులను ఎంచుకుని అంతే సింపుల్‌గా బ్లౌజ్ ఉండేలా చూసుకుంటే చాలు. ఆకుపచ్చ చీరకు చెక్స్ అంచుతో క్రింది భాగాన చక్కటి డిజైన్‌తో వెలిగిపోయోలా ఉంది. పసుపు రంగు చీరకు సైతం పైట అంచుకు సింపుల్‌గా డిజైన్ చేశారు. చీర మొత్తం గ్రే, తెలుపు, నలుపు రంగులతో డిజైన్ చేశారు. మెరూన్ కలర్‌కు బంగారు వర్ణంతో పాటు, నల్లటి బోర్డర్ ఇవ్వటంతో ప్రత్యేకంగా కనిపిస్తోంది. చిన్న చిన్న పూలు పరుచుకున్న డిజైన్లు , పెద్ద అంచు వంటివన్నీ కూడా అందాల్ని రెంట్టింపు చేస్తాయి. హాయి గొలిపే రంగులు.. చిన్న, వెడల్పాటి అంచుల్లో జరీ చేసే జిలుగులు వేడుకలో ప్రత్యేకతను చాటడానికి సిద్ధం అంటున్నాయి. మెహందీ ఫంక్షన్ మొదలుకుని పెళ్లిళ్ల సీజన్‌లోనూ వీటిని హాయిగా ధరంచవచ్చు.
తుస్సార్ మైసూర్ సిల్క్ చీర అందమైన డిజైన్‌లో కనువిందు చేస్తుందో చూడండి. బంగారు వనె్నలోబోర్డర్‌తో పైట అంచు అంతా గీతల డిజైన్‌లో హుందాతనాన్ని కలిగిస్తోంది.
ఆర్ట్ సిల్క్ చీరలు బ్లౌజ్‌తో కనువిందుచేస్తుంటాయి. సింథటిక్ జార్జెట్ ప్రింటెడ్ చీర లైట్‌వెయిట్‌తో పాడు అందంగా డిజైన్ చేయటంతో సరికొత్త ట్రెండ్ సృష్టిస్తున్నాయి.