మెయిన్ ఫీచర్

తిలాదానం.. దారిద్య్రనాశనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణ్యభూమి యైన మన భారతదేశంలో ప్రతితిథీ ప్రతివారమూ మహనీయమైనదే. ఒక్కొక్క తిథిలో ఒక్కొక్క దైవాన్ని పూజించడం సంప్రదాయం. మహావిష్ణువు అత్యంత ప్రీతిదాయకమైన తిథి ‘ఏకాదశి’ఈ ‘ఏకాదశి’ మరీ మహత్తరమైంది. ఆరోజున ఉపవాసం ఉండడం, మహావిష్ణువు పూజించడం లాంటివాటిని ఆచరించిస్తే అటు ఆరోగ్యసంపద ఇటు ఆధ్యాత్మిక సంపద ఒనగూడుతాయి అంటారు. సంవత్సరానికి 24ఏకాదశులున్నా ఒక్కొ ఏకాదశి ఒక్కో మహాత్య్మానికి ప్రత్యేకతను పొందింది. మాఘమాసంలో వచ్చే షట్‌తిలాఏకాదశిని గురించి భవిష్యోత్తర పురాణం వివరిస్తుంది. పూర్వం ఒక బ్రాహ్మణ స్ర్తి సత్‌సంప్రదాయాలను, ఆచారాలను తప్పకుండా పాటిస్తూ ఉండేది. ఆమె కృష్ణ్భక్తురాలు. నియమానుసారంగా శ్రీకృష్ణునకు పూజాదికాలు నిర్వహించేది. ఉపవాసాది వ్రతాలు పాటించేది. భక్తులైన వారికి తనకు తోచినంత సాయం చేయాలన్న సంకల్పంతో ఉండేది. తన ఇంటికి ఎవరైనా భక్తులు వస్తేవారికి అన్ని వసతులను కల్పించేది. ఇలా చేయడం కృష్ణుని సేవలో భాగంగా ఆమె తలిచేది. కాని వారికి భోజనం మాత్రం పెట్టేది కాదు. ఇంత భక్తుల సేవ చేసిన ఆమెను మహావిష్ణువు రక్షించదలచి ఒకనాడు ఆమె ఇంటికి భిక్షువులాగా వచ్చాడు. ‘అమ్మా ఆకలి అవుతోంది కాస్త ఏమైనా తినడానికి పెట్టు’అని అడిగాడు.
కాని ఆమె నీవు కావాలంటే కాసేపు మా ఇంట విశ్రమించు. సేద తీరింతర్వాత నీవు ఎక్కడికైనా ప్రయాణం చేసి నేను మంచినీరు తప్ప మరేమీ ఇవ్వను అని కరాఖండీగా చేప్పేసింది. అయినా ఆ భిక్షుకుడు మరలా మరలా తినడానికి ఇవ్వమనే అడుగుతున్నాడు. వాని బాధకు తాళలేక ఆమె ఒక మట్టిముద్దను తెచ్చి ఆ భిక్షగానిపాత్రలో వేసింది.
ఆ మహావిష్ణువు అక్కడ నుంచి వెళ్లిపోయాడు.
కాలం కరిగింది. ఆమె ముదుసలి అయ్యింది. ఒకనాడు కాలం తీరింది. యమసదనానికి వెళ్లింది.
అక్కడనుంచి ఆమె చేసిన పూజలు, వ్రతాలు, భాగవతుల సేవ వల్ల కాలుడు ఆమెకు స్వర్గలోక నివాసం ఏర్పాటు చేసాడు. స్వర్గంలో ఆమెకు ఉన్నతమైన ఇల్లును ఇచ్చారు. అందులో ఆమెను నివసించమని చెప్పారు. ఆమె ఎంతోసంతోషంతో అక్కడికి వెళ్లింది. కాని అక్కడ ఏమీ లేదు. తినడానికి, తాగడానికి ఏదీ కనిపించలేదు. వెంటనే వైకుంఠపతి దగ్గరకు వెళ్లింది. నీకు నేను ఎన్నోపూజలు, వ్రతాలు చేశాను. కాని నాకు ఇట్లాంటి గతి పట్టిందేమి అంటే ఆమె చేసిన పనిని మహావిష్ణువు గుర్తుకు తెప్పించాడు. అపుడు బుద్ధి తెచ్చుకుని ఇకమీద నేను దానధర్మాలు చేస్తానని చెప్పింది. కాని ఈ జన్మలో చేసుకొన్న కర్మఫలాన్ని అనుభవించాలి కదా. అప్పటిదాకా ఈ ఇంటిలో ఉండమని మహావిష్ణువు చెప్పాడు.
నన్ను కరుణించమని వేడుకొంది ఆమె. అపుడు నీ దగ్గరకు దేవతాస్ర్తిలు వస్తారు. వారు నిన్ను చూడాలని అంటే నీవు ముందుగా వారి షటాతిలా ఏకాదశి ఫలాన్ని నీకు ఇవ్వమని అడుగు. అప్పుడు నీ పాపఫలం తీరిపోతుంది అని చెప్పాడు. దేవతాస్ర్తిలు వచ్చారు. ఆమె మహావిష్ణువు చెప్పినట్లే అడిగింది.వారు వ్రతఫలం ఇచ్చారు. ఆమెకు ఆకలిదప్పులు నశించాయి. అయితే వారిని షట్‌తిలా ఏకాదశి వ్రతాన్ని ఎలా చేయాలో చెప్పమని వారిని అడిగి తెలుసుకొని అప్పటినుంచి ఆమె ఈ వ్రతాన్ని చేసింది.పాపరాశిని దూరం చేసుకొంది. షట్‌తిలా ఏకాదశి వ్రతం - తిలలను ఆరురకాలుగా ఈ ఏకాదశినాడు ఉపయోగించాలి. తెలకపిండితోఅంటే నువ్వుపిండితో స్నానం చేయడం, నువ్వులు దానం చేయడం, నువ్వులు కలిపిన నీటితో స్నానం చేయడం, మహావిష్ణువును నువ్వులతో పూజించడం, తిలా హోమం చేయడం, నువ్వుల నీళ్లను తాగడం, ఇలా చేయడం వల్ల పూర్వజన్మ పాపాలు నశిస్తాయి. ఇంకా మాఘమాసంలో ఆవుపేడను నేలకు అంటకుండా సేకరించి వాటిల్లో నువ్వులు కలిపి పిడకలు తయారు చేసి ఏకాదశినాడు 108 నువ్వులు కలిపిన ఆవుపేడతో చేసిన పిడకలతో హోమం చేసి, బ్రాహ్మణునికి ఉదకంతోకూడిన కడవనుదానం చేస్తే ఏకాదశి పుణ్యఫలం దక్కుతుంది. పాదరక్షలు, గొడుగు కూడా కావాల్సినవారికి దానం చేస్తే మహావిష్ణువు వారికే కష్టం రాకుండా కాపాడుతాడు.
ఇట్లా షట్‌తిలా ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారికి విష్ణుసాయుజ్యం లభిస్తుంది.

- ఆర్.పురంధర్