మెయిన్ ఫీచర్

చేజారితే రానిది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గొప్ప రాజనీతిజ్ఞునిగా పేర్గాంచినవాడు చాణుక్యుడు. ఇతనికి వేర్వేరు పేర్లు వేర్వేరు పనులు చేసినందున వచ్చి ఉన్నాయి. కాని భారతదేశ చరిత్రలో అర్థశాస్తవ్రేత్తగా, సుభాషిత కర్తగా సాహిత్యంలో ముఖ్యస్థానాన్ని పొంది ఉన్నాడు. ఆధ్యాత్మిక సామాజిక, ఆర్థికాంశాలపై చాణిక్యుని దృక్పథం ఎలా ఉందో మచ్చుకు కొన్ని సూత్రాలను చూద్దాం.
తద్భోజనం యద్ద్విజ భుక్తశేషమ్
తత్‌సౌహృదం యత్‌క్రియతే పరస్మిన్
సా ప్రాజ్ఞతా యా న కరోతి పాపమ్
దంభం వినా యత్ క్రియతే స ధర్మః
భావం: జ్ఞానులకు ఇవ్వగా మిగిలినదే ఆహారం. పరుల హితాన్ని కోరేది స్నేహగుణం, పాపకార్యం చేయకపోవడమే ప్రాజ్ఞత. కపటం లేని దానమే దానం.
మరి ఇప్పుడు ఎవరైనా ఈ లక్షణాలన్నీ కలిగున్నారా అంటే అటువంటివాళ్లను వేళ్లమీద లెక్కించాల్సిందే కదా. పరధనం ఆశించేవాళ్లు బీద బిక్కి నుంచి రాజకీయ నేతల వరకు ఎక్కడ చూస్తే అక్కడ కనిపిస్తున్నారు. పరుల సొమ్ము పాముతో చూడమని మన హైందవ ధర్మం చెబుతుంది. పరుల సొమ్ము నాశించిన వారికి నరకం వేయిరెట్ల శిక్ష వేస్తుంది. ఇది మనసున పెట్టుకొంటే ఎన్నో అరాచకాలకు భరతవాక్యం పలుకవచ్చు.
పునర్విత్తం పునర్మిత్రం పునర్భార్యా పునర్మహీ
ఏతత్ సర్వం పునఃప్రాప్యం న శరీరం పునఃపునః
భావం: పోయిన ధనం మళ్లీ చేరుతుంది. దూరమైన మిత్రుడు చేరువఅవుతాడు. భార్య గతిస్తే మరొక భార్య లభిస్తుంది. భూసంపద మళ్లీ ప్రాప్తిస్తుంది. పోయిన వన్నీ మళ్లీ తిరిగి రాబట్టుకోవచ్చు. కాని శరీరం మాత్రం మళ్లీ మళ్లీ రాదు.
ఇదే శరీరం ఖలు ధర్మసాధనం అన్నారు. కేవలం శరీరం ఉంటేనే ధార్మికపనులు చేయవచ్చు. శరీరం ఉంటేనే నాలుగు మంచి పనులు చేసే అవకాశం వస్తుంది. శరీరం ఉంటేనే హితవాక్యాలు చెప్పవచ్చు. ఏ పని చేయడానికైనా శరీరమే కావాలి. కనుక శరీరాన్ని రక్షించుకోవాల్సింది మానవ జన్మ వచ్చినవాళ్లే. జంతువులకు శరీరం ఉంటుంది కాని వాటికి ఆలోచన ఉండదు. పైగా ఆలోచన కలిగినా దాన్ని అమలు చేయడానికి శరీరం సహకరించదు. బుద్ధి , ఆలోచన ఉండేది మనుష్యులకే. వాటిని అమలు చేసే నైపుణ్యమూ మనుష్యులకే ఉంటుంది. కనుక మనం అందరూ శరీరాన్ని కాపాడుకోవాలి. అతి తిన్నా, అతిగా ఆలోచించినా, అతిగా సుఖం కలిగించినా, అతిగా దుఃఖం కలిగించినా ఏదైనా అతి చేస్తే శరీరం కాస్త పుటుక్కుమంటుంది. ఇక శరీరం చేజారి పోయాక చేసేది ఏమీ ఉండదు. కనుక ముందు శరీరం జాగ్రత్త. దీనికి సత్యధర్మాలను పాటించడమే మహాషధంగా పనికి వస్తుంది.
యావత్ స్వస్థో హ్యయం దేహోయావన్ మృత్యుశ్చ దూరతః
తావదాత్మహితం కుర్యాత్ ప్రాణాంతే కిం కరిష్యతి
భావం: ఈ దేహం ఆరోగ్యంగా ఉండేవరకు, మృత్యువు చేరనంత వరకు తనకు శుభం కలిగించు సత్ కర్మలను ఆచరిస్తూ ఉంలి. మరణిస్తే ఏమి చేయగలడు? నిజమే కదా. ఎప్పుడైనా శరీరం ఉంటేనే అందులో చైతన్యం ఉండేవరకే దేనినైనా సాధించగలం.

ఆర్. పురంధర్