మెయన్ ఫీచర్

భారతదేశంలో విపరీత ధోరణులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవులంతా సమానమే కాని కొందరు మాత్రం ఎక్కువ సమానం అని ఆంగ్లంలో ఒక నానుడి వుంది. ఇదిగో ఈ ఎక్కువ సమానస్థుల జాబితాలో మాయావతి, అరవింద్ కేజ్రీవాల్ లాంటి వారు చేరుతారు. న్యూఢిల్లీలోని కరోల్‌బాగ్‌లో ఒక బ్యాంక్ ఖాతాలో నూట నాలుగు కోట్ల ముప్ఫది ఎనిమిది లక్షల రూపాయల - వెయ్యి రూపాయల (పెద్ద) నోట్లు జమచేయబడ్డాయి. ఆ ఖాతా మాయావతి సోదరునిది. మొత్తం ఎనిమిదిసార్లు ఈ మొత్తం జమ చేయబడింది. అపుడు ఐటి శాఖవారు ఇంత మొత్తం నీకు ఎక్కడిది? అని ప్రశ్నించారు. ‘నేను దళిత నేతను కాబట్టి నా కుటుంబ సభ్యులను వేధిస్తున్నారు’ అని మాయావతి సమాధానం చెప్పింది. మాయావతికి కుడి భుజం లాంటి నేత స్వామి ప్రసాద్ కొద్దికాలం క్రితం బిఎస్‌పి పార్టీని వదిలివెళ్తూ ‘‘ఈమె కోట్లు వసూలు చేసి అభ్యర్థులకు ఎన్నికల టిక్కెట్లు అమ్ముకుంటుంది. ఈ అవినీతి భరించలేక బిఎస్‌పి వదిలి వెళ్తున్నాను’’ అని ప్రకటన విడుదలచేశాడు. 13-12-2013 నాడు న్యూఢిల్లీ బిఎస్‌పి కేంద్ర కార్యాలయంలో కమిషన్‌మీద నల్లధనాన్ని తెల్లధనంగా మారుస్తూ పార్టీ నాయకుడు రహస్య నిఘా కెమెరాకు దొరికాడు. ఈ వీడియో దృశ్యాలు ఒక ఇంగ్లీషు న్యూస్ ఛానల్‌లో దేశ వ్యాప్తంగా ప్రసారం చేసింది. ఇక రెండవ అంశం అరవింద్ కేజ్రీవాల్‌కు సంబంధించినది. లోకంలో అందరూ దొంగలే- నేనొక్కణ్ణే పరమ పవిత్రుణ్ణి అని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించాడు. అవినీతిపరులపై ఆడియో కాసెట్లు విడుదల చేశాడు. అన్నా హజారే వద్దన్నా ఒక రాజకీయ పార్టీ స్వయంగా స్థాపించాడు. మనం ఓడిపోయినా ఫరవాలేదు కాని మతతత్వ బిజెపి గెలువకుండా చూడండి’’ అని ప్రకాశ్ కారత్ తన పార్టీ ఓట్లను అరవింద్ కేజ్రీవాలాకు బట్వాడా చేయించాడు. ఫలితంగా కమలం న్యూఢిల్లీలో ఓడి అరవిందం గెలిచింది. ఇంతవరకు బాగానే వుంది. అధికారంలోకి వచ్చాక నలుగురు మంత్రులను అవినీతి ఆరోపణలతో తన మంత్రివర్గం నుండి తొలగించాడు. మరొక ఇరవై మంది ఎంఎల్‌ఏలకు కోర్టు నోటీసులు పంపింది. ఈయనకు పది వెబ్‌సైట్లు ఉన్నాయి. ఈ పార్టీకి భారీగా విదేశీ నిధులు వచ్చాయి. ఐటి శాఖ వారు ‘నీ ఎకౌంట్లలో తేడా ఉంది’ అంటూ నాలుగుసార్లు సమన్లు పంపారు. ఐదవసారి ఇక సెక్షన్ 13పి నీకు వర్తించదు అని బెదిరించారు. ఈ సెక్షను కింద ఎన్నికలలో పోటీ చేసే పార్టీలకు మినహాయింపు వర్తిస్తాయి. అపుడు కేజ్రీవాల్ రివైజ్డ్ రిటర్న్స్ దాఖలు చేశాడు. దాని ప్రకారం ఆయన భారీగా డబ్బు దాచినట్లు వెల్లడి అయింది. ఇది వర్తమాన భారతదేశ పరిస్థితి. నిన్నటివరకు హంస- నేడు కొంగగా మారింది.
యుపిలోని ఘజియాబాదులో ఒక నిరుపేద దంపతులకు జనధన్ యోజన ఖాతా ఉంది. ఆమె వంద రూపాయలు తెచ్చుకోవాలని వెళ్తే తన ఎకౌంటులో కోటి రూపాయలు జమ అయినట్లు తెలిసి నిర్ఘాంతపోయి బ్యాంకు అధికారుల దృష్టికి తీసుకువచ్చింది. వారు ఆమె మొర ఆలకించలేదు. దానితో ఆమె గత్యంతరం లేక నేరుగా ప్రధాని నరేంద్ర మోదీకి జాబు వ్రాసి ‘ఈ కోటి రూపాయలు నావి కావు’ అని విన్నవించుకుంది. మరి ఆ డబ్బు ఎవరది? అహమ్మదాబాదులో మహేశ్ షా ఎకౌంట్‌లోని కోట్లాది రూపాయలు ఎవరివి? మహేశ్ షా చిరువ్యాపారి, హైదరాబాద్‌లోని ముసద్దీలాల్ రాత్రికి రాత్రి (8-11-2016) నూరు కిలోల బంగారం బంజారాహిల్స్‌లో కొందరికి అమ్మాడు. ఆ పేర్లు అతడు బయటపెట్టలేదు.
***
ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఇలా జరిగిందా?
ఐఓఎ (ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్) 27 డిసెంబర్ 2016 నాడు సురేష్ కల్మాడీ, అభయ్ చౌతాలా అనే వ్యక్తులను ఆ జీవన అధ్యక్షులుగా నియమించింది. వీరు వివాదాస్పద వ్యక్తులు. కామెన్‌వెల్త్ క్రీడల సందర్భంగా జరిగిన నిర్మాణాలల్లో కోట్ల సంపద ఫలహారం చేసి బీహార్ జైలు ఊచలు లెక్కబెట్టినవాడు కల్మాడీ. ఆయనకు ఇవ్వాళ ఐఓఎకు ఏం సుగుణ సంపత్తి కన్పడింది? భారత క్రీడాకారులు జరుపుతున్న మాచ్ ఫిక్సింగ్ జగద్విదితం. అమాయకులైన ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోయి ఏదో అద్భుతం జరుగబోతున్నదని ఎదురుచూసే లోపలే మన హీరో రెండు పరుగులు చేసి చాలా సౌకర్యంగా ఔట్ కావటం ఈ దేశ క్రీడా చరిత్ర. ఇవ్వాళ క్రీడా రంగంలో అంతర్జాతీయ మాఫియా గాంగులు ప్రవేశించాయ. ఇదొక హవాలా వ్యాపారం. దీనిని ఎవరు నిరోధించగలరు? భారతీయ క్రీడలైన కబడ్డీ, హాకీ వంటివి అదృశ్యమైనాయి. ఎక్కడ చూచినా క్రికెట్ మాత్రమే కన్పడుతున్నది. సి అంటే క్రికెట్. సి అంటే కాంగ్రెస్. సి అంటే కరప్షన్. సి అంటే కాన్సర్.
ఇక మరో అంశం చూద్దాం- భారతదేశం ఒరిస్సా సమీపంలోని అబ్దుల్ కలాం ద్వీపం నుండి ఐదవ శ్రేణికి చెందిన ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఇప్పటివరకూ చైనా భారత్‌ను భయపెడుతూ వస్తున్నది. ఇలాంటి మిస్సైల్స్ అమెరికా, రష్యా, చైనా వంటి దేశాల్లో ఉన్నాయి. చైనా ఎఫ్‌సి 31 గేర్‌వాల్కన్ విమానాన్ని రంగంలోకి దించింది. చైనా దక్షిణ సముద్రం వద్ద జపాన్ - తైవాన్‌లో ఘర్షణలు చెలరేగుతున్న తరుణంలో ఈ గేర్ ఫాల్కన్ రంగంలోకి దిగిందని విశే్లషకులు సరిపెట్టుకున్నా చైనా తన క్షిపణులను ఇండియాపైనే గురిపెడుతున్నది అనేది చారిత్రక సత్యం. ఐదవ తరం అగ్ని సామర్థ్యం ఐదువేల కిలోమీటర్లు- చైనా దీని సామర్థ్యం 8 వేలు అని తేల్చింది. అంటే చైనా క్షిపణి న్యూఢిల్లీ చేరకముందే బీజింగ్ - షాంఘైలు భస్మీపటలమవుతాయి. ఇక అగ్ని-6 రావలసి ఉంది. దీనితో యుద్ధ్భయం తీరకపోయినా చైనా ఇండియాపై దాడికి ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవలసి ఉంటుంది. కాకుంటే చైనాలో ఇండియా గూఢచారులు లేరు కాని ఇండియా నిండా పెద్ద సంఖ్యలో చైనా గూఢచారులు ఉన్నారు.
ఆసియన్‌లో సభ్యత్వంగల అనేక ద్వీపాలను చైనా మింగివేయాలని ప్రయత్నిస్త్తున్నది. మన కళ్ళముందే 1959లో టిబెట్, 2012లో నేపాల్‌ను చైనా స్వాహా చేసింది. మంగోలియా తైవాన్‌లకన్నా ఇండియా చైనాకు ఆసియా ప్రధాన ప్రత్యర్థి. ఇపుడు చైనా లక్ష్యం అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్, సిక్కింలను కబళించటం- తన అనుచరుల చేత త్రిపుర, తెలంగాణ, కేరళ, చత్తీస్‌ఘడ్, జార్ఖండ్ వంటి ప్రాంతాలను అదుపులోకి తెచ్చుకోవడం ఇండియాలో కొందరు ఏజెంట్లను సృష్టించి అంతర్యుద్దాన్ని ప్రోత్సహించటం. అందుకు మమత, పిన్నారాయ్, లల్లూ, స్టాలిన్ వంటి ప్రాంతీయ సామంతుల ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకులో నెట్టడం- అంటే నేపాల్‌లో భట్టారాయ్ పాత్రను కేరళలో పిన్నారాయ్ వంటివారు ప్రత్యక్షంగా పోషిస్తున్నారని అర్థం. దీనిని కేంద్ర ప్రభుత్వం ఎలా ఎదుర్కోబోతున్నదో చూడవలసి వుంది. రాజ్‌మల్హోత్రా రచించిన ‘బ్రేకింగ్ ఇండియా’ చదివారా? న్యూఢిల్లీ జెఎన్‌యు, బెంగాల్ యాదవపూర్ యూనివర్సిటీల్లో ‘ఇండియాను ముక్కలు చేయండి’ అంటూ జరిపిన ఊరేగింపులు గుర్తున్నాయా? ఇవన్నీ ప్రత్యక్షంగా చైనా చేయించిన దుర్మార్గాలేనని చెప్పడానికి ‘రా’ వాటి నిఘా విభాగాల అవసరం లేదు. చైనా ఎందుకింత దౌర్జన్యానికి పాల్పడుతున్నది. అంటే ఇండియాలో అరవై సంవత్సరాలుగా బూటకపు ప్రజాస్వామ్యం నడిచింది. 1962లో నెహ్రూ- వి.కె.కృష్ణ మీనన్ కలిసి ఇండియా ఓటమికి కారణమైనారు. చైనా, ఆ పాత చరిత్రను పునరావృత్తం చేయాలని ఉబలాటపడుతున్నది. ఇప్పటికీ ఆక్రమిత కాశ్మీర్‌ను పాక్ నుండి దత్తత తీసుకున్నది.
***
తమిళనాడు దేశ రక్షణ దృష్ట్యా కీలకమైన రాష్ట్రం. అక్కడ సినిమా పిచ్చోళ్ళ సంఖ్య ఎక్కువ. జయలలిత, కరుణానిధి, శివాజీగణేశన్, ఎంజిఆర్, విజయ్‌కాంత్, వెన్నిరాడై నిర్మల, చో- వీరంతా సినిమా నుండి రాజకీయ అరంగేట్రం చేసినవారే. జయలలిత మీద అక్రమాస్తుల కేసులు వచ్చాయి. కర్ణాటకలో జైలుశిక్ష అనుభవించింది. పొయిస్ గార్డెన్‌లో బంగారు దిమ్మెలు, వజ్రాల బస్తాలు దొరికాయి. ఐనా ఈమె తమిళులకు పురుచ్చితలైవి. కారణం ఉచిత (సబ్సిడీ) పథకాలు ప్రవేశపెట్టి ప్రజలను బిచ్చగాళ్లుగా మార్చింది. ఇవాళ జయలలిత వారసత్వాన్ని శశికళ స్వంతం చేసుకోవాలనుకుంటున్నది. ఈమె ఒక వీడియో ఫోటోగ్రఫీ సెంటర్ నడుపుకునే అతి సామాన్య వ్యక్తి. కోట్లకు ఎలా పడగలెత్తింది? పన్నీరు సెల్వం అమ్మకు టీ అందించేవాడు. నేడు అస్మదీయులతో ముఖ్యమంత్రి అయినాడు. ఇపుడు ఇటు పన్నీరు అటు శశికళ కన్నీరూ కలిసి తమిళనాడును సంక్షోభంలోకి నెట్టివేసింది. చీఫ్ సెక్రటరీ రామమోహన్‌రావు ‘నేను నిర్దోషిని’ అని ఎట్టి అక్రమాస్థులు లేవు అన్నాడు. ఆయన కొడుకు మాత్రం ‘మేము ఆర్థిక నేరాలు చేశాము. పన్ను ఎగగొట్టాము’ అని ఒప్పుకున్నాడు.
***
బెంగాల్‌లో బెబ్బులి గర్జిస్తున్నది. ఇప్పటికే మాల్దా వంటి ప్రాంతాలు పరోక్షంగా బంగ్లాదేశ్‌ను దత్తత చేసింది. బెంగాల్ విజయం తన ప్రయోజకత్వం అనుకుంటున్నది. బెంగాల్ ప్రజలు కమ్యూనిజంపై వ్యతిరేకతతో ప్రత్యామ్నాయంగా ఉన్న మమతకు పట్టం కట్టారు. ఈ పదవిని ఆమె సద్వినియోగం చేసుకొని బెంగాల్ అభివృద్ధికి తోడ్పడితే బాగా ఉండేది. అందుకు భిన్నంగా కేంద్రంపై కత్తి కట్టింది. కారణం ఆమె శారదా చిట్‌ఫండ్ స్కాంలో ఇరుక్కోవటం. రోజ్‌వాలీ చిట్‌ఫండ్ గొడవ ఒకటి వెలుగులోకి వచ్చింది. ఒకప్పటి కమ్యూనిస్టు కార్యకర్తలు ఇపుడు టిఎంసిలో చేరారు. జెండాలు మారినా వారి అరాచక ఎజెండా మారలేదు. కేంద్రం బెంగాల్‌ను దారిలో పెట్టకపోతే మొత్తం రాష్ట్రం బంగ్లాదేశ్‌లో కలిసిపోతుంది. పరిస్థితి చేజారిపోతే బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో రాష్టప్రతిపాలన విధించాలి.
***
ఈ క్రింది గణాంకాలు చూడండి
కొత్త కార్ల కొనుగోళ్లు నవంబరు ఎనిమిదవ తేదీ 2016 తర్వాత పెరిగాయి. పన్ను ఎగగొట్టినవారు తమ దొంగ డబ్బుతో కార్ల, షేర్ల కొనుగోళ్లుచేశారు. పూర్వం వీధిలో ఒకరికి కారు ఉండేది తర్వాత ఇంటికొక కారుండేది. ఇపుడు మనిషికొక కారు కావాలి. కార్లలో చౌకార్లుగా తిరుగుతున్నారు. ఇందుకు ఎంత డీజిల్ దిగుమతి చేసుకున్నా చాలటంలేదు. అంటే భారత సంపద మొత్తం అరబ్బీ దేశాలకే చేరుతున్నది.
దేశంలో మిలియన్ సాలీనా ఆదాయం కలవారు 24.4 లక్షలమంది. 2015-2016లల్లో అమ్ముడవుతున్న కార్లు 25 లక్షలు- అందులో 35 వేలు లగ్జరీ కార్లు. వీటి కొనుగోళ్ళ నిర్వహణకు డబ్బు ఎంత ఖర్చు అయింది? 50 లక్షలకుపైగా వార్షిక ఆదాయం కలవారు 1.49 లక్షలు ఉన్నారు. ఇదిగో ఈ బడా కుబేరులే ఎక్కువగా ఆదాయ పన్ను ఎగగొడుతున్నారు. మన దేశపు అవసరాలకు సైకిళ్లు చాలు. మోదీ తర్వాతి ఆర్థిక సంస్కరణలో భాగంగా కార్లు నడిపే బీకార్ల వివరాలు సేకరించాలి. ప్రభుత్వ ఉద్యోగులు పెట్రోలు వాడకం తగ్గించాలి. ఆర్థికంగా ఉగ్రవాద జిహాదీ దేశాలను దివాలా తీయించడానికి మార్గం పెట్రోలు కొనుగోళ్లను తగ్గించటం. అంటే రేషన్ పెట్టడం. సైకిళ్లకు సబ్సిడీ రేట్లకు అమ్మే కార్ల కొనుగోళ్లు తగ్గించండి. ఐసిస్ దుర్మార్గాల వెనుక సిరియాలోని చమురు క్షేత్రాలపై ఆధిపత్యపు పోరు ఉన్నదనే సత్యం మరచిపోరాదు.
***
తమిళనాడును ముంబాయిని శాసిస్తున్నది సినిమా డబ్బు అని మనకు తెలుసు. ప్రజల బలహీనతలను రెచ్చగొట్టి వీళ్ళు ద్రవ్యార్జన చేస్తున్నారు. చిత్రసీమపై రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు గల నియంత్రణ నామమాత్రం. అంతేకాదు దావూద్ ఇబ్రహీం లాంటి జిహాదీ ఉగ్రవాదుల మద్దతుతోనే ముంబాయి చలన చిత్ర రంగం నడుస్తున్నది. భారీ చిత్ర నిర్మాణం చేసినవారు పన్నులు సరిగా కడుతున్నారా? ఆలోచించండి. రెండు పూటలా తినడానికి తిండి లేని వాళ్లకు సినిమా నిత్య జీవితావసరంగా మార్చటంలో ఈ ఇంద్రజాలికులు విజయం సాధించారు.
దేశ ప్రజలకు తిండి పెట్టలేని నేతలు విమానాల్లో విలాసయాత్రలు చేసే అధికారం లేదు. సినీతారలు స్విస్ బ్యాంకులో డబ్బు దాచుకొనే నిమిత్తం విదేశీ షూటింగ్‌ల నాటకం ఆడటం కేంద్ర ప్రభుత్వం దృష్టిలోకి వచ్చిందా?
***
ఉత్తరప్రదేశ్‌లో ఏం జరుగుతున్నది?
ఔరంగజేబు తన తండ్రి షాజహాన్‌ను ఆగ్రా జైలులో పెట్టినట్లు మొగలు చరిత్రలో చదువుకున్నాము. ఇవ్వాళ మళ్లీ చరిత్ర పునరావృతమయిందా? అఖిలేష్ యాదవ్ తన తండ్రి ములాయంసింగ్ యాదవ్‌మీద యుద్ధం ప్రకటించాడు. తానే సమాజవాది పార్టీకి వారసుడినని చెప్పుకున్నాడు. ఆయన వెంట రెండు వందలకుపైగా ఎంఎల్‌ఏలు ఉన్నారు. పార్టీ యంత్రాంగం ముఖ్యమంత్రి హోదాలో తన చేతిలోకి తీసుకున్నాడు. బాబాయి శివపాల్ యాదవ్‌ను పార్టీ నుండి బహిష్కరించాడు. ఈ బహిష్కరణ సమాజవాద పార్టీ రాజ్యంగా 16- 17 - 24 సెక్షన్ల ప్రకారం జరిగింది. తన ఎన్నికను ఎవరూ సవాలు చేసే అవకాశం లేదని చెప్పుకొన్నాడు. అంతకుముందు తండ్రి ములాయం కొడుకును పార్టీనుండి బహిష్కరించాడు. లోగడ రామ్‌నరేశ్ యాదవ్‌ను నాలుగుసార్లు బహిష్కరించారు. నాలుగుసార్లు పార్టీలో చేర్చుకున్నారు. ఇపుడు అమర్‌సింగ్ బహిష్కరణకు గురి అయినాడు. ‘‘నేను మంచివాణ్ణి. మా నాయన, చిన్నాయన దుర్మార్గులు కాబట్టి మంచి పనులు చేయడానికి స్వేచ్ఛ లభించలేదు’’ అనేది అఖిలేష్ వాదం. ఇది నిజమేనా? గత ఐదేళ్ళ కాలంలో యుపిలో వందలాది మత కల్లోలాలు హత్యలు, మానభంగాలు జరిగాయి. ముజఫర్‌పూర్ ఘటన గుజరాత్ గోద్రా వంటిదే. అంటే స్వదేశంలోనే పౌరులు కాందిశీకులైనారు. ఎన్నికల ముందు ఈ బాధ్యత మొత్తం తండ్రిమీదికి నెట్టి అఖిలేష్ పక్కకు తప్పుకోజాలడు. యుపిలో ములాయంకు ఇద్దరు భార్యలు - వారి కుమారుల మధ్య వారసత్వపు పోరు మొదలైంది. తమిళనాడులో కరుణానిధికి ఇద్దరు భార్యలు. వారి మధ్య వారసత్వపు యుద్ధం మొదలైంది. అంటే ఈ పరివార యుద్ధంలో రాష్ట్ర ప్రగతి ఆగిపోవలసిందేనా? గతంలో యుపిలో శివపాల్ యాదవ్ నేతృత్వంలో కోఆపరేటివ్ సొసైటీ మొత్తం తమ సామాజిక వర్గీయులతోనే నింపారు. రామమనోహర్ లోహియా చెప్పిన సోషలిస్టు పార్టీ ఇదేనా?
చరిత్ర పునరావృతమైంది. ఔరంగజేబు సోదరులను చంపి తండ్రి షాజహాన్‌ను ఆగ్రా జైలులో పెట్టడం గుర్తుచేసుకోండి.

- ప్రొ. ముదిగొండ శివప్రసాద్