మెయిన్ ఫీచర్

భక్తుల పెన్నిధి భగవంతుని సన్నిధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంబరీషుడు ఒక మహారాజై ప్రజలను కన్నబిడ్డల్లాగా పాలిస్తున్నాడు. అతడు సకల సద్గుణ సంపన్నుడు. అంతకు మించి పరమ భాగవతోత్తముడు. విష్ణ్భుక్తికే జీవితాన్ని అంకితం చేసినవాడు. ఇతని భక్తికి మెచ్చి శ్రీమహావిష్ణువు దివ్య చక్రాన్ని ప్రసాదించాడు. అంబరీషుడు ఏకాదశీవ్రతాన్ని తాను ఆచరించడమే కాకతన రాజ్యంలోని వారందరిచేత వ్రతాన్ని ఆచరింపచేసేవాడు. ఏకాదశీవ్రతం తరువా త అంబరీషుడు నియమనిష్టలతో ద్వాదశీ వ్రతాన్ని ఆచరిస్తాడు. ఏకాదశీ పారణకోసం ద్వాదశి రోజు విష్ణుపూజ చేసి అతిథికోసం అంబరీషుడు ఎదురుచూస్తున్నాడు. ఆ సమయంలో దుర్వాసమహర్షి అభ్యాగతునిగా విచ్చేస్తాడు. రాజు మునిని సకల మర్యాదలతో ఆహ్వానించి భోజనానికి పిలుస్తాడు. ఆ ముని నదీస్నానం ఆచరించి వస్తానని తన శిష్యులతో నదీస్నానానికి వెళ్లాడు. కాలతీతం అవుతున్నా దూర్వాసుడురాలేదు. ఈలోగా ద్వాదశీ ఘడియలు దాటిపోతున్నందువల్ల ఏమి చేయాలో పాలుపోక అంబరీషుడు తనపురోహితులను, పండితులను మార్గోపాయం చెప్పమని అడుగుతా రు. ఉదకపానం చేసి వ్రతదీక్ష విరమిస్తే దోషం లేదని, వ్రత ఫలితం దక్కుతుందని చెబుతారు. అంబరీషుడు వారుచెప్పినట్టు చేస్తాడు.
ఇంతలో దుర్వాసుడు తిరిగి వచ్చి జరిగినది తెలుసుకుని కోపోద్రిక్తుడై రాజుపై మండిపడి తన జటాజూటం నుండి ఒక జడను తెంపి దానితో ‘‘కృత్య’’ అనే ఒక భీకర శక్తిని సృష్టించి అంబరీషుని సంహరించ పంపుతాడు. ఆ శక్తిని అంబరీషుపైకి వెళ్తున్న ప్పుడు మహావిష్ణువు చూసి ఆగ్రహం తెచ్చుకుని కృత్యపైకి తన సుదర్శనాన్ని పంపుతాడు. ఆ సుదర్శన ధాటికి కృత్య శరణువేడుతుంది. ఆ సుదర్శనం దూర్వాసుని పైకి రాబోతుండడం మునీశ్వరుడు చూచి తన తప్పును తెలుసుకొని మహావిష్ణువు మన్నించమని ప్రార్థిస్తాడు. తన భక్తులకే ఆపద వచ్చినా నేను సహించనని, ఇపుడు నిన్ను రక్షించే వాడు అంబరీషుడు తప్ప మరేవరూ లేరని మహావిష్ణువు మహామునికి చెప్తాడు.
దుర్వాసుడు తిరిగి వచ్చి అంబరీషుని శరణు కోరతాడు. అంబరీషుడు ఆ చక్రాన్ని ప్రార్థించి మహర్షి ప్రాణాలు అంబరీషుడే కాపాడుతాడు. మహర్షి అంబరీషుని భక్తికి సంతసించి అతని ఆతిథ్యాన్ని స్వీకరించి సంతృప్తి చెంది ఆశీర్వదిస్తాడు.
ఇట్లా మహావిష్ణువు అనుగ్రహం కోసం ద్వాదశీవ్రతాన్ని ఆచరిస్తే ఆచరించిన వారి పాపాలు దూరం కావడమే కాదు వ్రతమాచరించిన వారు మహావిష్ణువు ప్రతిరూపాలు అవుతారు. ఏకాదశి రోజు ఈ అంబరీషోపాఖ్యానం చదివినా ఇహపరసుఖాలను మహావిష్ణువు ప్రసాదిస్తాడు.

- ఉషశ్రీ తాల్క