తెలంగాణ

తెరాస వైపు మక్తల్ ఎమ్మెల్యే చూపు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలో అధికార తెరాస పార్టీలోకి విపక్ష ఎమ్మెల్యేల వలసలకు ఇంకా తెరపడడం లేదు. ఇన్నాళ్లూ టిడిపి ఎమ్మెల్యేలు ‘క్యూ’ కట్టి మరీ తెరాసలో చేరగా, ఇపుడు కాంగ్రెస్ వంతు వచ్చినట్టు కనిపిస్తోంది. మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి తెరాసలో చేరేందుకు యోచిస్తున్నట్లు సమాచారం. ఆయన బుధవారం ఉదయం సిఎం కెసిఆర్‌ను క్యాంపు కార్యాలయంలో కలవడంతో ఈ చర్చకు తెరలేచింది. మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే డికె అరుణ సోదరుడైన రామ్మోహన్ రెడ్డి ఇప్పటికే జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి లక్ష్మారెడ్డితో భేటీ అయ్యారు. నేడో, రేపో తెరాసలోకి చిట్టెం చేరడం ఖాయమన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి.