తెలంగాణ

నేడు కొమురవెల్లి మల్లన్న కల్యాణోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాజరుకానున్న ముఖ్యమంత్రి కెసిఆర్

చేర్యాల, జనవరి 2: వరంగల్ జిల్లాలో ప్రముఖ శైవక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జునస్వామి కళ్యాణం రేపు(ఆదివారం) అంగరంగ వైభవంగా జరుగనుంది. కల్యాణోత్సవ ఏర్పాట్లను జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఆర్డీవో వెంకట్‌రెడ్డి, డిఎస్పీ శనివారం పరిశీలించారు. కల్యాణ వేదిక, క్యూలైన్ తదితర ప్రదేశాలను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్న కొమురవెల్లి మల్లన్న దేవాలయంలో స్వామివారి కల్యాణాన్ని కన్నుల పండువగా జరుపుకోవాలన్నారు. కల్యాణానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలని దేవాలయ ఇవో వైరాగ్యం అంజయ్య, సిబ్బందిని ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా ఎంపిపి మేడిశెట్టి శ్రీ్ధర్, సర్పంచ్ గీస బిక్షపతి, వైస్ ఎంపిపి బత్తిని జ్యోతిశ్రీనివాస్, టిఆర్‌ఎస్ యూత్ జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దిపడిగ క్రిష్ణారెడ్డి, సంపత్‌రెడ్డి, మం గోలు చంటి, శివగారి అంజయ్య, మేర్గు శ్రీనివాస్ తదితరులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు.
కొమురవెల్లి మల్లికార్జునస్వామి కల్యాణానికి తెలంగాణ సిఎం కెసిఆర్ హాజరవుతున్నారనే సమాచారంతో జిల్లా ఎస్పీ అంబర్‌కిషోర్‌ఝా శనివారం హెలిప్యాడ్ ప్రదేశాన్ని పరిశీలించారు. అదే విధంగా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జనగామ ఆర్డీవో వెంకట్‌రెడ్డి, డిఎస్పీలు సైతం హెలిప్యాడ్ ప్రదేశాన్ని పరిశీలించారు. సిఎం వచ్చే రూట్‌లో ఎస్పీ ఆధ్వర్యంలో తనిఖీ నిర్వహించారు. అయితే కల్యాణానికి సిఎం వస్తున్నాడనే విషయంలో ముందస్తు చర్యలు లేకపోవడం, డాగ్ స్క్వాడ్ రాకపోవడంతో సిఎం రాకపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.