గుంటూరు

పొగడ వృక్షవాహనంపై ఊరేగిన మల్లేశ్వరస్వామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, మార్చి 6: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి పొగడ వృక్ష వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. కైంకర్యపరులుగా జంజనం ప్రసన్నకుమార్, అనిత వ్యవహరించారు. ఆలయం నుంచి ప్రారంభమైన స్వామివారి గ్రామోత్సవం మెయిన్ బజార్‌లో మిద్దె సెంటర్ వరకు వెళ్లి తిరిగి ఆలయానికి చేరింది. ఆలయ కార్యనిర్వహణాధికారి సూర్యప్రకాశరావు ఏర్పాట్లు పర్యవేక్షించారు.
నేడు మల్లేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుని శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి కల్యాణ మహోత్సవం సోమవారం రాత్రి వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని ఆలయ ఇఓ సూర్యప్రకాశరావు తెలిపారు. తొలుత ఎదురుకోల జరుగుతుందని, 8వ తేదీన స్వామివారి దివ్యరథోత్సవం జరుగుతుందని భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు.

మహాశివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి
గుంటూరు, మార్చి 6: మహాపర్వదినాల్లో అత్యంత విశిష్ఠమైన రోజుగా శివభక్తులు, ఆధ్యాత్మిక చింతనాపరులు పరిగణిస్తున్న మహాశివరాత్రి మహోత్సవానికి నగరంలోని 11 ప్రధాన శివాలయాలు సంప్రదాయబద్ధంగా ముస్తాబయ్యాయి. ఈ సంవత్సరం మహాశివరాత్రి శివారాధకులకు ఇష్టమైన సోమవారం నాడే రావడంతో శివభక్తుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఈ సందర్భంగా అన్ని ఆలయాల్లో తెల్లవారుఝామున బ్రాహ్మీముహూర్తం 4.30 గంటల నుండి అర్ధరాత్రి లింగోద్భవకాలం వరకు రోజంతా అభిషేక ప్రియునికి మహాభిషేకం, బిళ్వదళాలతో అర్చనలు నిర్వహించనున్నారు. పాత గుంటూరులోని శ్రీ అగస్తేశ్వరస్వామివారి దేవస్థానం ఆర్ అగ్రహారంలోని శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామివారి ఆలయం, కొత్తపేటలోని ఉమామహేశ్వరాలయం, పట్ట్భాపురం కంచికామకోటి పీఠ హరిహరదత్త క్షేత్రం, జూట్‌మిల్లు ఏరియాలోని చంద్రవౌళేశ్వరాలయం, మారుతీనగర్‌లోని మారతీక్షేత్రం, గుంటూరు రూరల్ మండలంలోని ముఖ్య ఆలయాల్లో శివరాత్రి మహోత్సవాన్ని మహావైభవంగా నిర్వహించనున్నారు. లింగధారుడైన ఈశ్వరుడికి అభిషేకంతో పాటుగా శ్రీ పార్వతీదేవి, గంగాదేవి, ఉమాదేవి, భ్రమరాంబ మూర్తులకు ప్రాతఃకాల, సాయంకాల కుంకుమార్చనలు జరుగుతాయని ఆలయాల అధికారులు తెలిపారు.

బిసి సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించాలి
గుంటూరు , మార్చి 6: రాష్ట్రప్రభుత్వం బిసి సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించాలని బిసి సంఘ రాష్ట్ర నాయకులు, మాజీ మంత్రి పి రామారావు డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక అమరావతి రోడ్డులోని బండ్లమూడి గార్డెన్స్‌ను బిసి సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన రాష్టస్రదస్సుకు 13 జిల్లాల నుండి ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ వృత్తిదారుల సంక్షేమానికి ప్రభుత్వ ఆధ్వర్యంలో బ్యాంకులు ఏర్పాటుచేసి నిధులు కేటాయించి పాత రుణాలు రద్దు చేయడంతో పాటు కొత్తరుణాలు ఇవ్వాలన్నారు. బిసిలకు ప్రతి మండలంలో రెసిడెన్షియల్ విద్యాలయాలు ఏర్పాటుచేసి కెజి నుండి పిజి వరకు ఉచిత విద్యసౌకర్యం కల్పించాలన్నారు. మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి, గుంటూరు అర్బన్ టిడిపి అధ్యక్షుడు బోనబోయిన శ్రీనివాసయాదవ్‌లు మాట్లాడుతూ బిసి జనగణన వివరాలను ప్రకటించాలన్నారు. బిసి సబ్‌ప్లాన్ నిధులను ఎంబిసిలకు, వృత్తిదారులకు ప్రాధాన్యతనిచ్చి ఖర్చుచేయాలన్నారు. సంఘ రాష్ట్ర నాయకులు డాక్టర్ ఆలా సాంబశివరావు మాట్లాడుతూ టిడిపి ఎన్నికల మ్యానిఫెస్టోలో ఏడాదికి 10 వేల కోట్లు కేటాయించి సబ్‌ప్లాన్ ఏర్పాటుచేస్తామని చెప్పినప్పటికీ 2014-15లో 3,130 కోట్లు, 2015-16 సంవత్సరానికి 3,232 కోట్లు కేటాయించి నిధులు మాత్రం నామమాత్రంగా కేటాయించారన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 6,640 కోట్లతో బిసి సబ్‌ప్లాన్‌ను ఏర్పాటుచేస్తూ జీవో 7ను జారీచేసినా అది బుట్టదాఖలైందన్నారు. సంఘ జిల్లా అధ్యక్షులు ఎం కోటయ్యయాదవ్ మాట్లాడుతూ బిసిల సామాజిక రక్షణ చట్టాన్ని ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో రూపొందించి అమలు చేయాలన్నారు. నగర అధ్యక్షులు పేరయ్యయాదవ్ మాట్లాడుతూ బిసిలు అద్దె ఇళ్లలో నివశిస్తూ జీవనం సాగిస్తున్నారని, వారికి ఇళ్లస్థలాలు మంజూరు చేసి ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ఈ సదస్సులో సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు యర్రాకుల తులసీరామ్ యాదవ్, యాదవ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు శివకుమార్, వివిధ జిల్లాల నుండి అధిక సంఖ్యలో ప్రతినిధులు హజరయ్యారు.