మళ్లీ గోదారికే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్‌చరణ్- సుకుమార్‌ల క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న కొత్త చిత్రం ఇటీవలే మొదలై మొదటి షెడ్యూల్‌ను రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో పూర్తిచేసుకుంది. ఎండలను సైతం లెక్కచేయకుండా యూనిట్ కష్టపడి అనుకున్న టైమ్‌కి షూటింగ్ పూర్తిచేశారు. ఆ తరువాత నెల రోజులపాటు సెలవు తీసుకున్న ఈ టీమ్ సోమవారం నుండి మళ్లీ షూటింగ్‌లో బిజీ కానుంది. ఈ షెడ్యూల్ కూడా అక్కడే జరగనున్నదని సుకుమార్ టీం చెబుతోంది.. అచ్చమైన పల్లెటూరు నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో రామ్‌చరణ్ కొత్త తరహా పాత్ర చేస్తున్నాడన్నది పాతమాటే. ప్రస్తుతం లండన్ వెకేషన్‌లో వున్న చరణ్, ఈనెల 8 నుండి షూటింగ్‌లో పాల్గొంటాడట. త్వరలోనే చిత్రాన్ని పూర్తిచేసి దసరాకు విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.