హైదరాబాద్

మాల్స్‌లో వెస్ట్‌జోన్ పోలీసుల తనిఖీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, నవంబర్ 23: పశ్చిమ మండలం పోలీసులు సోమవారం రాత్రి పంజాగుట్ట, బంజారాహిల్స్ పరిదుల్లోని మాల్స్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పశ్చిమ మండలం డిసిపి వెంకటేశ్వరరావు నేతృత్వంలో అధికారులు జివికె వన్, పంజాగుట్ట సెంట్రల్, బిగ్‌బజార్, లైఫ్‌స్టైల్ మాల్స్‌లో దాడులు నిర్వహించారు. సివిల్ డ్రెస్‌లో ఉన్న పోలీసులు ఆయుధాలు ధరించి లోనికి వెళ్లినా సెక్యూరిటీ గుర్తించక పోవడంతో ఆశ్చర్య పోయారు. సెక్యూరిటీ వైఫల్యంపై డిసిపి ఆగ్రహం వ్యక్తం చేశారు. మాల్స్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. గతంలో పలుమార్లు నిర్వహించిన తనిఖీల్లో సైతం మాల్స్ సెక్యూరిటీ డొల్లాతనం బయటపడింది. వివిధ దేశాల్లో ఉగ్రదాడుల నేపథ్యంలో తనిఖీలు నిర్వహించినట్టు తెలుస్తుంది. తనిఖీలలో ఏసిపి ఉదదయ్‌కుమార్ రెడ్డి, వెంకటేశ్వర్లు, సిఐలు మోహన్ కుమార్, మురళీకృష్ణ పాల్గొన్నారు.

యువతిని కిడ్నాప్ చేసిన ముగ్గురి అరెస్టు
నేరేడ్‌మెట్, నవంబర్ 23: యువతిని కిడ్నాప్ చేసి ఇంట్లో బంధించి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ముగ్గురు
యువకులను అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించిన సంఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్‌ఐ ఇ.జహంగీర్‌యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం వౌలాలి ఈస్ట్ ప్రగతినగర్‌లో నివసించే జి.ఆనంద్ వృత్తిరీత్యా ఆటోడ్రైవర్. ఇతనికి ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. వౌలాలి గాంధీనగర్‌లో నివసించే ఎండి నవాబ్ (20) టైలరింగ్ పని
చేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం ఆనంద్ చిన్న కూతురుని ప్రేమించాలంటూ నవాబ్ వేధించాడు. యువతి తల్లిదండ్రులకు చెప్పడంతో వారు మందలించి వదిలిపెట్టారు. విషయం మనసులో పెట్టుకున్న నవాబ్ అతని స్నేహితులు ఈస్ట్ ప్రగతినగర్‌లో నివసించే కారు డ్రైవర్ సయ్యద్ అజీజ్(20), గాంధీనగర్‌లో నివసించే ఎండి సర్వర్‌తో కలసి ఆదివారం మధ్నాహ్నం ఆనంద్ రెండవ కూతురు(18)ని కిడ్నాప్ చేశారు. సాయంత్రం నాలుగుగంటల సమయంలో తండ్రికి ఫోన్ ద్వారా తనను నవాబ్ కిడ్నాప్ చేశాడని సమాచారం అందించింది. బాధితుడు మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న ఎస్‌ఐ జహంగీర్‌యాదవ్ ఫోన్‌ద్వారా దమ్మాయిగూడలోని బిజెఆర్‌నగర్‌లో ఉన్నట్టు గుర్తించారు. ఇంటిపై దాడి చేసి ముగ్గురిని అరెస్టు చేసి కిడ్నాప్‌కు ఉపయోగించిన కారు, మూడు సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకుని నిర్భయ, కిడ్నాప్ సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరిలించారు.