తెలంగాణ

గాల్లోకి కాల్పులు.. రైతులపై లాఠీచార్జి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్: మల్లన్నసాగర్ జలాశయ పథకాన్ని వ్యతిరేకిస్తూ జిల్లాలో పలుచోట్ల ఆందోళనలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ఈ పథకానికి భూ సేకరణను వ్యతిరేకిస్తూ కొండపాక మండలం ఎర్రవల్లి వద్ద రైతులు ఆదివారం రాస్తారోకో చేశారు. ట్రాఫిక్ స్తంభించడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులపై కొందరు రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి, రైతులపై లాఠీచార్జి చేశారు. తెలంగాణ రైతు సంఘం అధ్యక్షుడు ప్రతాపరెడ్డితో పాటు మరికొందరు ఆందోళనకారులు లాఠీచార్జిలో గాయపడ్డారు.