రాష్ట్రీయం

ఇంటర్ పరీక్షల్లో భారీగా మాల్ ప్రాక్టీస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిట్టింగ్ స్క్వాడ్‌లున్నా మాస్ కాపీయింగ్
తెలుగు రాష్ట్రాల్లో 80 మందిపై కేసులు
హైదరాబాద్‌లో చెవిలో మొబైల్ చిప్‌తో అభ్యర్థి

హైదరాబాద్, మార్చి 12: ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ ఎత్తున మాల్ ప్రాక్టీస్ జరుగుతున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయి. అనుమానంగా ఉన్న కేంద్రాల్లో సిట్టింగ్ స్క్వాడ్‌లను నియమించినా భారీ ఎత్తున మాస్ కాపీయింగ్ జరుగుతోంది. శనివారం నాడు ఒక్కరోజే ఫస్టియర్ ఇంటర్ పరీక్షల్లో తెలంగాణలో 68 మందిపై మాల్ ప్రాక్టీసు కేసులు నమోదుకాగా, ఆంధ్రాలో 12 మందిపై మాల్ ప్రాక్టీస్ కేసులను నమోదుచేశారు. హైదరాబాద్‌లో ఎస్‌ఆర్‌నగర్‌లోని రాయల్ జూనియర్ కాలేజీకి చెందిన అజీజ్ అనే విద్యార్ధి ఎన్‌ఆర్‌ఐ జూనియర్ కాలేజీలో పరీక్షలు రాస్తున్నాడు. శనివారం నాడు ఎకనామిక్స్ పరీక్ష రాయడానికి వచ్చిన అజీజ్ చెవిలో మొబైల్ చిప్ ఉండటాన్ని గమనించిన అధికారులు వెంటనే ఆయనను పక్కన కూర్చోబెట్టి పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. దాంతో పోలీసులు అతనని అదుపులోకి తీసుకుని పరిశీలించే సరికి అజీజ్ చెవిలో ఉన్న చిప్‌ను గుర్తించారు.
తెలంగాణలో రంగారెడ్డిలో నలుగురిపైనా, నిజామాబాద్‌లో 8 మందిపైనా, మహబూబ్‌నగర్‌లో 12 మందిపైనా, వరంగల్‌లో 9 మందిపైనా, నల్గొండలో 19 మందిపైనా, హైదరాబాద్‌లో 11 మందిపైనా, ఖమ్మంలో ఇద్దరిపైనా మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదుచేశారు. ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకున్న ఇంటర్ బోర్డు సూర్యాపేట, కోదాడ, మిర్యాలగూడ తదితర కేంద్రాలకు 40 మందిని ప్రత్యేక పరిశీలకులను పంపించామని బోర్డు కార్యదర్శి డాక్టర్ ఎ అశోక్ చెప్పారు.