జాతీయ వార్తలు

ఛాయ్‌వాలా అవతారమెత్తిన మమతాబెనర్జీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోలకతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఒక్కసారిగా ఛాయ్‌వాలా అవతారమెత్తారు. ప్రధాని నరేంద్ర మోదీని నిరంతరం తన మాటలతో దుయ్యబట్టే ఈ ఫైర్‌బ్రాండ్ ఆయన వలే ఓ దుకాణంలో ఛాయ్ చేసి అక్కడ ఉన్నవారికి అందించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆమె సామాజిక మాధ్యమాలలో షేర్ చేశారు.రాష్ట్రంలో పర్యాటక అభివృద్దే లక్ష్యంగా కోస్టల్ ప్రాంతాల పర్యటనలో భాగంగా ఆగస్ట్ 15న డిఘా ప్రాంతానికి బయలు దేరారు. డిఘాకు మరికొద్ది సేపట్లో చేరుకుంటామనగా ఒక్కసారిగా తన కాన్వాయ్ ఆపమని మమత బెనర్జీ ఆదేశాలు ఇచ్చారు. వెంటనే కారు దిగి దగ్గరలో ఉన్న చిన్న కిరాణా కొట్టులోకి వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోను మమత బెనర్జీ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ‘‘కొన్నిసార్లు చిన్న చిన్న ఆనందాలు జీవితానికి ఎంతో సంతృప్తిని ఇస్తుంటాయి. ఛాయ్ చేయడం, ఛాయ్ ప్రియులకు స్వయంగా అందించడం మంచి జ్ఞాపకం’’ అని మమత బెనర్జీ రాసుకొచ్చారు.