రాష్ట్రీయం

మన్ కీ బాబు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రధాని బాటపట్టిన ముఖ్యమంత్రి * ప్రజలతో ముఖాముఖికి యోచన

హైదరాబాద్, నవంబర్ 22: ప్రధాని నరేంద్ర మోదీ తరహాలో సిఎం చంద్రబాబు సైతం ప్రజలతో మమేకమయ్యేందుకు రేడియో/ టీవీ ఛానల్స్‌ను ఉపయోగించుకోవాలని యోచిస్తున్నారు. ఈ అంశంపై ఒక మంత్రితోపాటు మరో ప్రభుత్వ సలహాదారు, సీనియర్ అధికారితో సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం. నరేంద్రమోదీ ప్రతి నెలలో చివరి ఆదివారం ఉదయం 11గంటలకు ‘మన్ కీ బాత్’ పేరిట ప్రజలతో మాట్లాడుతున్నారు. మన్‌కీ బాత్ పేరిట ప్రసారమవుతున్న కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. ప్రారంభంలో కేవలం ఆకాశవాణి ద్వారా ప్రసారమైన ఈ కార్యక్రమం, తర్వాత టీవీ ద్వారా కూడా ప్రసారమవుతోంది. కేంద్రం పరిధిలోని ప్రసారభారతి ఈ కార్యక్రమం విజయవంతమయ్యేందుకు భారీఎత్తున ప్రచారం నిర్వహించింది. ప్రారంభంలో పెద్దగా స్పందన లేకున్నా, తర్వాత ప్రజల నుంచి మంచి స్పందన కనిపిస్తోంది. ఈ కార్యక్రమాన్ని లక్షలాది మంది రేడియో ద్వారా వింటున్నారు. రేడియోలో మాట్లాడుతున్న అంశాలనే టీవీ ద్వారా కూడా వింటున్నారు. మన్ కీ బాత్ సందర్భంగా వేలాది ప్రజలు ప్రధానితో మాట్లాడేందుకు తహతహలాడుతున్నారు. ప్రతినెలా ఏదోక అంశంపై ప్రజలతో ప్రధాని మాట్లాడుతూ వస్తున్నారు. ఇప్పటికి 14 పర్యాయాలు కార్యక్రమం ప్రసారమైంది. ఈ కార్యక్రమం సందర్భంగా ప్రధాని మోదీ తొలుత తన మనోభావాలను ప్రజలకు తెలియచేస్తున్నారు. తర్వాత ప్రజాభిప్రాయాలు వింటూ, వారి సమస్యలను నోట్ చేసుకుని పరిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పరిపాలనలో తీసుకోవాల్సిన మార్పులు, చేర్పులకు ఈ కార్యక్రమం బాగా ఉపయోగపడుతోందని తెలుస్తోంది. చంద్రబాబు కూడా ప్రజలతో మమేకమయ్యేందుకు ప్రచార సాధనాలను విరివిగా వినియోగించుకుంటున్నారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్నప్పటి నుంచే చంద్రబాబు మీడియాతో సన్నిహితంగా ఉంటున్నారు. బాబు చేపట్టే పథకాలు, కార్యక్రమాలకు ప్రచారం లభించేందుకు మీడియాను ఉపయోగించుకోవడంలో ఆయనను మించిన వారుండరంటే అతిశయోక్తి కాదు. చంద్రబాబు 1995లో ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన సమయంలోనూ మీడియా ఆయనకు పూర్తిగా అండగా నిలిచింది. 2014 ఎన్నికల సందర్భంగా బాబు రూపొందించిన ప్రణాళికకు మీడియా విస్తృతంగా ప్రచారం కల్పించింది. రైతులు, యువత, మహిళలు తదితరుల సమస్యలపై దృష్టి కేంద్రీకరించానని, అధికారంలోకి వస్తే వీటిని పరిష్కరిస్తానని 2014 సాధారణ ఎన్నికల సమయంలో బాబు ప్రచారం చేశారు. రైతు రుణాల మాఫీ, డ్వాక్రా సభ్యుల రుణాల మాఫీ, చేనేత కార్మికుల రుణమాఫీ, నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం, గత ప్రభుత్వ తప్పిదాలను ప్రజలకు తెలియచేయడం తదితర అంశాలన్నింటిని ప్రజలకు వివరించేందుకు మీడియాను చంద్రబాబు పూర్తిస్థాయిలో వాడుకున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న పథకాలు, కార్యక్రమాలు ప్రజల్లోకి మరీ ముఖ్యంగా కిందిస్థాయి ప్రజలకు అందించేందుకు మన్‌కీ బాత్ లాంటి కార్యక్రమాన్ని రూపొందించుకోవాలని చంద్రబాబు తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు తెలిసింది. దీనివల్ల తాను ప్రజలకు చెప్పదలచుకున్నది యథాతథంగా ప్రజలకు చేరుతుందని, అలాగే ‘్ఫడ్ బ్యాక్’ లభిస్తుందన్నది బాబు ఆలోచనగా తెలుస్తోంది. వీలైనంత త్వరగా ఈ ఆలోచనకు ఒక రూపు ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలిసింది. బాబు ప్రసంగాన్ని కేవలం ఆకాశవాణి (రేడియో)/ దూరదర్శన్‌ల ద్వారా మాత్రమేకాకుండా ఎఫ్‌ఎం స్టేషన్లు, ప్రైవేట్ టీవీ ఛానళ్ల ద్వారా కూడా ప్రసారమయ్యేలా చూసేందుకు బృహత్తర ప్రణాళిక రూపొందిస్తున్నట్టు తెలిసింది. రేడియో, దూరదర్శన్‌ల ద్వారా ప్రసారాల కోసం కేంద్రం అనుమతి అవసరం ఉంటుంది. కేంద్రం అనుమతి బాబుకు రావడం పెద్ద సమస్య కాదని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ప్రైవేట్ టీవీలు బాబు ప్రసంగాన్ని టెలిక్యాస్ట్ చేసేందుకు క్యూ కడతాయని అంటున్నారు. అన్ని కోణాల్లో అలోచించి పకడ్బందీ ప్రణాళికతో చంద్రబాబు ప్రజల ముందుకు త్వరలో వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.