మనలో - మనం

మనలో- మనం ఎడిటర్‌తో ముఖాముఖి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుష్యమీసాగర్, హైదరాబాద్
మొన్నటికి మొన్న శబరిమల అయ్యప్ప స్వామిని మహిళలు ఎందుకు దర్శించకూడదు, ఇది మహిళా హక్కులను భంగపరచడం అని కోర్టు తప్పుపట్టింది. సదరు ట్రావెన్‌కోర్ వారిని సంజాయిషీకి నోటీసులు పంపింది. ఇంచుమించుగా షిరిడికి దగ్గరలోనే వున్న శని శింగనపూర్‌లో మహిళా ప్రవేశంపై ఉద్యమాలు జరుగుతున్నాయి. వందల సంవత్సరాల నుంచి వస్తున్న హిందూ నమ్మకాలపై ఇలా ప్రశ్నించడం.. ఇది ఘోరం, అవమానం అంటూ రచ్చకెక్కడం ఎంతవరకు సమంజసం? ఇదే నీతి అన్ని మతాల ఆచారాలను ప్రశ్నించడంలో ఎందుకు అంత ఉత్సుకత చూపరు. ముస్లిం కమ్యూనిటీలో కూడా చాలావరకు మహిళలు మసీదు ప్రవేశానికి పరిమితులు ఉన్నాయి. మరి వాటిని ఎందుకు ప్రశ్నించరు. కేవలం హిందూ సమాజంపైననే అత్యున్నత న్యాయస్థానం తప్పు పట్టడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటారు?
హిందూ మతం ఇవాళ దిక్కులేని అనాథ! ఆ మతం తరఫున ధైర్యంగా నిలబడి, ఎంతకైనా తెగించి పోరాడే తెగువ హిందూ నాయకులుగా చలామణి అయ్యేవారిలో కరవైంది. సూడో సెక్యులరిజం వారికి బాగా ఒంటబట్టింది. ఇతర మతాల వారిలాగా సామాన్య హిందువులూ తమ మతం కోసం క్షేత్ర స్థాయిలో పోరాడటం నేర్చుకోనంతవరకూ ఈ కథ ఇంతే.

విద్యార్థుల మధ్య ఏర్పడిన వివాదాన్ని పరిష్కరించాల్సిన రాజకీయ వర్గాలు ఈ చిచ్చును మరింత రగిలించి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూడటం అమానుషం కాదా? రోహిత్ వేముల ఆత్మహత్య విషయంలో ఇంత ఓవర్ రియాక్ట్ అయిపోతున్న ఈ సూడో సెక్యులర్ రాజకీయ నాయకుల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా పఠాన్‌కోట్ దాడిలో చనిపోయిన సైనికుల కుటుంబ సభ్యులను కలిసి సంతాపం తెలపలేదేం? ముష్కరులను మట్టుబెట్టే పనిలో తీవ్రంగా గాయపడ్డ సైనికులను రాహుల్‌గాంధీ, వై.ఎస్.జగన్, కేజ్రీవాల్ లాంటి నాయకులు కనీసం పరామర్శించలేదేం? ఇది ద్వంద ప్రమాణం కాదా..?
ముమ్మాటికీ.

సుజాతరావు, హైదరాబాద్
బహుముఖ పాత్రాభినయమా? పలువురు యాంకర్లు ప్రతిభావంతులైననూ, వారే పార్టిసిపెంట్సు కన్నా, నాట్యము చేయుట, రకరకాల భాషలలో పాటలు పాడుట.. ఇవి ఎబ్బెట్టుగా లేవా?
ఆ గంతులు చూసేవారికీ వేసేవారికీ లేని బాధ మనకేల?

సీరపు మల్లేశ్వరరావు, కాశీబుగ్గ
మన సి.ఎం.గారి ప్రమాణ స్వీకారం ఖర్చు, అమరావతి ఆరంభం ఖర్చు, విదేశాల పర్యటనల ఖర్చు, ఉచిత వస్తువుల పంపిణీ ఖర్చులకు కోట్లాది రూపాయలు వ్యయపర్చకుండా ఉంటే ప్రతి విద్యార్థిని రూ.10/- అమరావతి కోసం అడిగే బాధ తప్పేది కదా?
పాయింటే.

ఎ.శ్రీనివాసరావు, గద్వాల
మన దేశం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిక్షణా శిబిరాలను ధ్వంసం చేయాలనుకోవటం అత్యాశేనంటారా?
పాకిస్తానీల మెహర్బానీకి అంగలార్చే ప్రభుత్వాల నుంచి అలాంటిది ఆశించడం ముమ్మాటికీ పేరాశే.
సి.ప్రతాప్, శ్రీకాకుళం
లైంగిక విజ్ఞానాన్ని 8వ తరగతి నుండి పాఠ్యాంశంగా చేర్చాలని కొందరు మేధావులు ప్రభుత్వానికి సూచనలు ఇస్తున్నారు. విద్యార్థులకు నైతిక విలువలు, క్రమశిక్షణ, ఆధ్యాత్మికత వంటివి నేర్పకుండా ఇటువంటి విజ్ఞానాన్ని ప్లేటులో భోజనం వడ్డించినట్లు అందిస్తే వారి సున్నిత మనస్సులు వికృతం చెందవా? ఆ వయస్సు నుండే వారిలో కామోద్రేకం పురివిప్పి జీవితం గతి తప్పదా?
బుద్ధి తక్కువ సూచన.

యుగంధర్, వక్కలంక
గత 3,4 సంవత్సరాలుగా బాలసుబ్రహ్మణ్యం గొంతు ఏ సినిమాలోనూ వినపడలేదు. అలాంటిది ఈ మధ్య చంద్రబాబుగారు ‘బాలు’కు సన్మాన సభలో మాట్లాడుతూ ‘ఈ గొంతు రాబోయే 30, 40 సంవత్సరాల వరకూ వినబడుతూనే ఉంటుంది’ అన్నారు. మీ కామెంట్ ప్లీజ్!
వినబడేది సినిమాలకు వెలుపల అని ఆయన ఉద్దేశమేమో.

వై.వి.శివకాంత, అచ్యుతాపురం, నగరి కటకం పోస్ట్
ఇంచుమించు రోజూ ఎర్రచందనం దుంగలు దొరికినట్లు వార్తల్లో చదువుతున్నాం. ఇంకా దొరకనివి ఎన్నో? ఇంత మందీ మార్బలం ఉన్న ప్రభుత్వం అటవీ సంపదను సంరక్షించుకోలేదా? ఆదాయానికి కొత్త వనరులు అనే్వషించడానికి కంటె వున్న వనరులు రక్షించుకోలేదా? దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టదెందుకు?
స్మగ్లర్లను అరికట్టాల్సిన డిపార్టుమెంట్లలోనే వారి తోడుదొంగలు ఉన్నారు కనుక. వారికి రాజకీయ వత్తాసు మస్తుగా ఉన్నందుచేత.

ఎ.వి.సోమయాజులు, కాకినాడ
కెసిఆర్ గారు మిగిలిన పార్టీ వారిని తమ పార్టీలోకి చేర్చుకుంటే తెలంగాణ ప్రతిపక్ష పార్టీలన్నీ (టిడిపితో సహా) విమర్శించడమెందుకు?
తాము చేస్తే లౌక్యం. అదే పరులు చేస్తే మోసం.

నందం కామేశ్వరరావు, భట్టిపోలు, గుంటూరు జిల్లా
నాలుగేళ్లుగా ఆంధ్రభూమి అభిమాన పాఠకుడిని. నా సంవత్సర చందా గడువు పూర్తవగానే మీ ఏజెంటు నాకు చెప్పాపెట్టకుండా పత్రికను ఆపేశాడు. మళ్లీ చందా కట్టటానికి సిద్ధంగా ఉన్నాను. మీ కార్యాలయానికి ఫోన్ చేసినా పని కాలేదు. దయచేసి నాకు పత్రిక ఆగకుండా అందేట్టు చూడండి.
మీ ఫిర్యాదు అందగానే మా మార్కెటింగు సిబ్బంది కదిలారు. మీ చందాను పునరుద్ధరించామని తెలిపారు.

ఆర్.వి.రామారావు, తిరువూరు, కృష్ణాజిల్లా
నిరుడు సెప్టెంబరు 30తో నా చందా అయిపోయింది. మళ్లీ చందా కడతానని అడిగినా మీ కార్యాలయం నుంచి ఎవరూ స్పందించలేదు. నాకు ఆంధ్రభూమి దినపత్రిక అందేట్టు చేయండి. ఇది ఎవరి మీదా ఫిర్యాదు కాదు.
ఈపాటికి మీకు పత్రిక సరఫరా మళ్లీ మొదలై ఉండాలి. *
------------------
ప్రశ్నలు పంపాల్సిన చిరునామా : మనలో మనం, ఆదివారం అనుబంధం, ఆంధ్రభూమి దినపత్రిక, 36 సరోజినీదేవీ రోడ్, సికిందరాబాద్-500003

email: bhoomisunday@deccanmail.com