మనలో - మనం

మనలో - మనం ఎడిటర్‌తో ముఖాముఖి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యుగంధర్, వక్కలంక
పాఠశాలలోని మధ్యాహ్న భోజన పథకంపైనా, బలహీన వర్గాల హాస్టళ్లల్లోని సౌకర్యాలు, ఇతర విషయాల గురించీ ఆయా గ్రామాలలోని సచ్చరిత్రులు అనబడేవారికి పెత్తనం ఇస్తే ఎలాగుంటుంది? ఏ రాజకీయ నాయకుడికీ అవకాశం ఇవ్వకూడదు.
మంచిదే. కాని ఎవరు సచ్చరిత్రులు? వారిని ఎవరు ఏ పద్ధతిన ఎంపిక చేస్తారు? నిజమైన సచ్చరిత్రులకు తీరిక, ఓపిక ఉంటాయా?

ఎం.కనకదుర్గ, తెనాలి
కొత్తొక వింత, పాతొక రోత అన్న చందాన ఆండ్రాయిడ్ ఫోన్లు వచ్చిన దగ్గర నుండి ప్రజలకు సెల్ఫీల పిచ్చి పట్టుకుంది. చిత్రవిచిత్రమైన విన్యాసాలతో, ప్రమాదకరమైన చేష్టలతో సెల్ఫీలు తీసుకుంటూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు...
ఎవరి పిచ్చి వారికి ఆనందం

కొమ్మన శ్రీనివాసకుమార్, నెల్లూరు
రంగనాయకమ్మగారి రచనల గురించి మీ అభిప్రాయం?
చదవలేదు.

సీరపు మల్లేశ్వరరావు, కాశీబుగ్గ
అవినీతిని అంతం చేస్తామన్న నేతలు ఓటుకు నోటు ఇచ్చి అవినీతికి పోషకులై ఎలా నిర్మూలిస్తారు అవినీతిని?
మిమ్మల్ని ఎవరు నమ్మమన్నారు?

ఎం.దుర్గారాజ్, అమలాపురం
భారతీయ సంస్కృతిని, సంప్రదాయాన్ని గౌరవించే ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడ్డాక కూడా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు సంప్రదాయ విరోధులకు, ఎర్ర కళ్ళద్దాలతో లోకాన్ని చూసి హిందూ సెంటిమెంట్లను ద్వేషించే వారికే అందుతున్నాయేమిటి?
ఉన్న అవార్డులను ఏటేటా తమకు కావలసిన వారికి ఇప్పించుకునేలా, ఒకరికొకరు సాయంపట్టి అందరూ బాగుపడేలా మీరన్న బాపతు వారి మధ్య చక్కటి అవగాహన ఉంది. అవార్డులను తమలో తాము పంచుకునేందుకు వారికి వాటమైన వ్యవస్థ ఉంది. దేశానే్నలే వారు తలచుకుంటే ఈ దిక్కుమాలిన పద్ధతి మార్పించగలరు. కాని తలచుకోరు. జమానా మారినా పైరవీలు, లాలూచీలు మామూలే.

ఎస్.రామకృష్ణ, కర్నూలు
నిరుద్యోగులకు ఒక శీర్షికను ప్రవేశపెట్టండి. ‘యువ’ శీర్షికలోనే కొంత స్థలం కేటాయించగలరు.
అలాంటి శీర్షికను సమర్థంగా నిర్వహించగల వారి కోసం చూస్తున్నాం.

వేదుల జనార్దనరావు, వంకావారిగూడెం, ప.గో.జిల్లా
ఉగ్రవాదులకు నీరాజనాలు ఇచ్చే పాక్ ప్రేరేపిత విద్యార్థులకు వంత పలుకుతున్న కుహనా లౌకిక పార్టీల గుర్తింపును రద్దు చేయడానికి కేంద్రమో, ప్రధాన ఎన్నికల కమిషనో చర్య తీసుకోవచ్చునా?
అయ్యే పనికాదు. అలాంటి పార్టీలకు ఏమి చేయాలన్నది ప్రజలే తేల్చుకోవాలి.

సి.ప్రతాప్, శ్రీకాకుళం
కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు నేతాజీ అదృశ్యం మిస్టరీని ఛేదిస్తామని శపథం చేసిన ప్రభుత్వం చివరకు ఆయన విమాన ప్రమాదంలోనే మరణించారన్న అరిగిపోయిన రికార్డునే తిరిగి వినిపించి, నాలుగు ఫైళ్లను బయటపెట్టి ఏదో ఘనకార్యం చేసినట్లు భుజకీర్తులు తగిలించుకుంటోంది. నేతాజీ అదృశ్యం మిస్టరీ ఇక మిస్టరీయేనా? అసంఖ్యాక నేతాజీ అభిమానులకు నిరాశే మిగులుతుందా?
అలాగే కనిపిస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వానికి శ్రద్ధలేదు. చిత్తశుద్ధీ అంతంతమాత్రమే.

దేశంలో కొన్ని సామాజిక వర్గాలు రిజర్వేషన్లు, ఇతరత్రా లబ్ధి పొందేందుకు ఉద్యమాలు చేపట్టి, వాటిని హింసాత్మక మార్గంలో నడుపుతూ విలువైన ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తుంటే ప్రభుత్వాలు ఎందుకు వౌనం వహిస్తున్నాయి?
రాజకీయ దౌర్బల్యం వల్ల. కర్తవ్యం కంటే ఓట్ల స్వార్థం ఎక్కువ అనుకోవడంచేత.

పట్నాల సూర్యనారాయణ, రాజమండ్రి
గత ఏడాది మయన్మార్ పార్లమెంట్ ఎన్నికల్లో నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీ అత్యంత భారీ మెజారిటీతో నెగ్గి, ఆ పార్టీ అధ్యక్షురాలు అంగ్‌సాన్ సూకీ ప్రజలకు బాగా దగ్గరయ్యారు. కాని మయన్మార్ అధ్యక్ష పీఠం ఆమెనే వరించగలదు అనుకొన్నారు. కాని ఆమె అధ్యక్ష పీఠంపై కూర్చోలేదు. ఎందుకని?
రాజ్యాంగపరమైన ఆంక్ష కారణంగా. అందుకే పాదుకా పట్ట్భాషేకం చేసి కూచోబెట్టింది కదా దేశాధ్యక్ష స్థానంలో తన డ్రయివరును!
*

==================================
ప్రశ్నలు పంపాల్సిన చిరునామా : మనలో మనం, ఆదివారం అనుబంధం, ఆంధ్రభూమి దినపత్రిక, 36 సరోజినీదేవీ రోడ్, సికిందరాబాద్-500003
e.mail : bhoomisunday@deccanmail.com