అవీ .. ఇవీ..

కొమ్ములు తిరిగిన గేదె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఔను. ఈ ఫొటో చూస్తే ఈ గేదె గొప్పతనమేమిటో తెలిసిపోతుంది. రెండు కొమ్ములూ ఒకేలా, అందంగా, పొడవుగా వంకర తిరిగి గొప్పగా కన్పిస్తోంది. అస్సాంలోని ప్రఖ్యాత కాజీరంగా నేషనల్ పార్కులో తిరుగుతున్న ఈ గేదె భారీ కొమ్ములతో ఆకర్షణీయంగా కన్పించడంతో కేటర్‌న్యూస్‌కు చెందిన ప్రఖ్యాత వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ సంజీవ్‌చద్దా తన కెమెరాను క్లిక్‌మన్పించాడు.

హల్లో కిట్టీ ట్రెయిన్

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన కల్పితపాత్ర ‘కిట్టీ’. దీని పేరుతో ఇప్పుడు ఓ థీమ్‌డ్ రైలు సర్వీసును ప్రారంభించింది తైవాన్ ప్రభుత్వం. జపాన్‌కు చెందిన సానరియో కంపెనీ 1974లో ప్రారంభించిన ఓ కల్పితపాత్ర పేరు హల్లో కిట్టి. అనతికాలంలో ఆ పాత్ర జనంతో మమేకమైపోయింది. ముఖ్యంగా జపాన్, తైవాన్ తదితర ఆసియా దేశాల్లో దాని పేరుతో విమానాశ్రయాలు, విమాన సర్వీసులు, రెస్టారెంట్లు, షాపింగమాల్స్, థియేటర్లు, సూల్స్, చివరకు హాస్పిటల్స్‌కూడా ప్రారంభమయ్యాయి. దీనిపేరుతో నిర్వహించే హోటళ్లు, హాస్పిటల్స్‌లో పనిచేసే సిబ్బంది ధరించే డ్రెస్‌లు, అక్కడ లభ్యమయ్యే సేవలు, వస్తువులు అన్నీ కిట్టీని గుర్తుకు తచ్చేలా ఉంటాయి. ఇప్పుడు ప్రభుత్వమే ఏకంగా హల్లోకిట్టీ పేరుతో రైలు సర్వీసు ప్రారంభించింది. తైపీలోని షులిన్-తైతంగ్ స్టేషన్ల మధ్య ఈ కిట్టీ రైలు తిరుగుతుంది. త్వరలో ఈ తరహా రైళ్లను మరిన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిశ్ఛయించుకుంది. ఈ రైలులో సీటింగ్ దగ్గర్నుంచి అన్నీ కిట్టీ రూపాన్ని ప్రతిబింబిస్తూంటాయి. ఈ రైలు ప్రారంభోత్సవం సందర్భంగా ఓ ఔత్సాహికుడు ఇలా హల్లోకిట్టీ డ్రెస్‌తో అలరించాడు.

హోలీ...కేళి

ఈమధ్య భారత్‌లో రంగుల పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. అమృతసర్‌లోని స్వర్ణదేవాలయంవద్ద సిక్కు మతస్థుడు ఇలా ఓ విన్యాసంతో హోలీ సంరంభాన్ని చాటిచెప్పాడు.

స్వీట్..
క్యూట్

తియ్యటి కమలాపళ్ల రసాన్ని ఎవరుమాత్రం తాగకుండా వదిలేస్తారు. ఈ సీతాకోక చిలుకలకు తేనెకన్నా ఈ కమలాల రసమే బాగా నచ్చినట్లుంది. లండన్‌లోని నేచురల్ హిస్టరీ మ్యూజియంలో నిర్వహించి కమలాల ప్రదర్శనలో ఓ రెండు సీతాకోక చిలుకలు ఆ పళ్ల ముక్కలపై వాలి రసాన్ని గ్రోలుతూంటే..ఓ చిన్నారి కళ్లింత చేసుకుని చూస్తూండిపోయాడు. టెలిగ్రాఫ్ పత్రికకు చెందిన ఫొటోగ్రాఫర్ మొల్‌హాలెండ్ ఈ దృశ్యాన్ని తమ కెమెరాలో బంధించాడు.

పుష్పవిలాసం

దక్షిణ కొరియాలోని జిన్‌హాయ్ పట్టణం ఇప్పుడు వసంతశోభతో కళకళలాడుతోంది. ఒకవైపు సముద్రతీరం, నగరమంతా పరుచుకున్న కొండలు, కోనలతో ఉండే ఈ నగరంలో వసంతం వచ్చీరాగానే విచ్చుకునే లక్షలాది చెర్రీపూల వనాలతో వీధులన్నీ ఊదారంగు పరదాగా మారిపోతాయి. ఈ దృశ్యాన్ని చూసేందుకు దేశవిదేశాలనుంచి పర్యాటకులు ఇక్కడికి వస్తారు. జపాన్ ఆక్రమణలు ఎదుర్కొని విజయం సాధించినందుకు గుర్తుగా ఈ సందర్భంగా దక్షిణ కొరియా పదిరోజులపాటు విజయోత్సవాలను ఇక్కడ నిర్వహిస్తుంది. గున్‌హన్‌గ్జీ ఫెస్టివల్‌గా పిలిచే ఈ వేడుకల్లో కనీసం కోటిమంది పాల్గొంటారు. సైనిక కవాతులు, కార్నివాల్, పిల్లల ఆటపాటలు, ప్రదర్శనలు ఇలా పలురూపాల్లో వేడుకలు నిర్వహిస్తారు.

భారతి