మనలో - మనం

మనలో-మనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

abukoilada@india.com
ఓ బాలికపై జరిగిన అత్యాచారానికి సంబంధించి విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు ఓ సంచలనాత్మక తీర్పు ఇచ్చింది. ఆయా నేరం చేసిన నిందితుడికి మరణించేవరకూ జీవిత ఖైదు శిక్షను అమలు చేయాలని కోర్టు ఆదేశించింది. అసలు ఈ శిక్షలు ఎలాంటి నిబంధనల ప్రకారం నేరస్థులకు వేస్తారన్నది ఎప్పటికీ అర్థంకాని ప్రశ్న. ఎందుకంటే గతంలో ఇలాంటి నేరాలు చేసిన నేరగాళ్లకే పది సంవత్సరాలో, ఇరవై సంవత్సరాలో జైలుశిక్ష వేయడం చూశాం. ఉదాహరణకు 2010లో బీఎస్పీ శాసనసభ్యుడు పురుషోత్తం నరేష్ ద్వివేది తన ఇంట్లో పనిచేస్తోన్న ఓ బాలికను దారుణంగా రేప్ చేశాడని రుజువు కావడంతో 10 సంవత్సరాల జైలుశిక్ష విధించారు. ఏదేమైనా నేరం నేరమే.. బలయ్యేది అమాయక ఆడపిల్లలే... అందులోనూ సామాన్య జనులకూ... రాజకీయ నాయకులకు వేరు వేరు న్యాయాలా? చేసేది ఒకే నేరమైనా.. వేరు వేరు రకాల శిక్షలను న్యాయమూర్తులు ఎందుకు వేస్తున్నట్టు?
చట్టం ఏ నేరానికైనా కనిష్ఠ - గరిష్ఠ శిక్షలను మాత్రమే నిర్దేశిస్తుంది. ఆ రేంజిలో ఏ నేరస్థుడికి ఎంత శిక్ష అన్నది కేసును బట్టి, విచారించే న్యాయమూర్తి ఆలోచనా రీతినిబట్టి ఉంటుంది. అన్ని నేరాలూ ఒకేలా ఉండవు కాబట్టి అన్నిటికీ ఒకే మోతాదు శిక్షను విధించడం సాధ్యంకాదు. అయితే మీరన్నట్టు శిక్ష విధింపులో ఇతరేతర ప్రభావాలు ఉండవన్న గ్యారంటీ లేదు. మసకబారని వ్యవస్థ అంటూ ఈ కాలంలో ఏదీ లేదు.

బి.ఆర్.సి.మూర్తి, విజయవాడ
పచ్చిమిర్చి కేజీ 150 అమ్ముతుంటే సామాన్యులు బతికేదెలా?
బియ్యం, కందిపప్పు, మినప్పప్పు, కూరగాయలు మాత్రం చవకగా ఉన్నాయా? పేద, మధ్యతరగతి ప్రజల గోడు మిడిమేలపు పాలకులకు ఎందుకు పడుతుంది?

దుమోరా, హైదరాబాద్
ఈ వారం (29.5.2016) అనుబంధంలో 8,9 పేజీలలో బాక్స్‌లలో విషయాలు నీలంరంగులో సన్న, సన్న తెలుపు అక్షరాలతోను, 14వ పేజీలో నలుపు రంగుపై నలుపు అక్షరాలను ప్రచురించారు. మా వంటి వయోవృద్ధులకు అవి చదవటం చాలా కష్టమయింది. కావున సరియైన రంగులు ఎన్నుకొని అందరూ చదవగలిగేలా ప్రచురించగలరు.
అలాగే.

ఆర్.కె., హైదరాబాద్
నిజం చెప్పండి. నేటి తరం వారికి పుస్తకాలు, నవలలు, వారపత్రికలు, డైలీ పేపర్లు చదివే ఓపిక, శ్రద్ధ ఉన్నాయా? ప్రబంధాలు, చారిత్రాత్మక రచనలు, పాత నటీనటుల మీద రాసే వ్యాసాలు చదవడానికి సీనియర్ సిటిజన్స్‌కైనా టైమ్ ఉందా?
ఉంటే గింటే వారికి మాత్రమే ఉంది. ఈ కాలంలో రాసేవాళ్లూ, చదివే వాళ్లూ వయసు మళ్లినవాళ్లే.

ఆర్.ఎల్.నారాయణ, దమ్మాయిగూడ, హైదరాబాద్
రెండు తెలుగు రాష్ట్రాలకు తగినన్ని నిధులు ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతుండగా - ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇవ్వటం లేదని క్రింది స్థాయి నాయకులతో చెప్పిస్తున్నారు. కావున ‘ఏది నిజం’ అనే విషయాన్ని తమరు కచ్చితమైన అంకెలతో ఓ వ్యాసాన్ని ప్రచురిస్తే ఈ నిధుల బాగోతం బయటపడ్తుందిగా!
అయినా నమ్మరు. తెలియక కాదు. గోల కొరకే గోల.

డి.వెంకట్రావు, ఉయ్యూరు
తెలుగు రాష్ట్రాలలో టి.డి.పి.యేతర, టి.ఆర్.ఎస్. యేతర నేతలను ఎక్కడ పడితే అక్కడ ఆపి కెసిఆర్ కారు ఎక్కించుకుంటున్నారు. బాబు సైకిల్ ఎక్కించుకుంటున్నారు. ఓవర్‌లోడ్ ప్రమాదకరం అనేది రవాణా వాహనాలకే కాదు.. పార్టీలకు కూడా అని తెలిసినా ఆపరేషన్ ఆకర్ష్‌కు బ్రేక్ వేయరు. ఎందుకని?
బ్రేకులు (లేక బుర్రలు) పనిచెయ్యక.

కాళిదాసు, కావలి
జిల్లా ‘మెరుపు’లో ‘కవిత’ కింద పేరు, ఫోన్ నెంబర్ ఇవ్వడం అభ్యంతరం ఉన్నవాళ్లు ‘ఒక విద్యార్థి, ఫలానా ఊరు (ఉదా.కావలి), ఫలానా విద్యా సంస్థ (ఉదా. ప్రభుత్వ డైట్) అని రాస్తే వేయరా? కచ్చితంగా రాసి తీరాల్సిందేనా?
అక్కర్లేదు. రచయిత ఇష్టం.

మీ పత్రిక మీద అభిమానంతో నా కూతురుకు ‘వెనె్నల’ అని పేరు పెట్టుకొన్నాను. ప్రోత్సాహక బహుమతి ఏమీ లేదా?
అమ్మాయి పెళ్లికి ఇద్దాం.

మోటమర్రి బుచ్చికృష్ణ, తుని
మహనీయ వెంకయ్య నాయుడుగారు ప్రో టి.డి.పి. అని బిజెపిని తెలుగు రాష్ట్రాలలో ఎదగనీయకుండా చేస్తున్నారని అందరూ కోడై కూస్తున్నా బిజెపి అధిష్ఠానానికి సదరు మంత్రివర్యులు గురించి తెలియదనుకోవాలా? తెలిసి ఎందుకు తప్పు చేస్తున్నారు?
ఎదగాలని లేదేమో!

ఉప్పు సత్యనారాయణ, తెనాలి
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనపై అభిమానంతో పార్టీ స్థాపించినప్పటి నుండి ‘్ఫటో ఆల్బమ్’ తయారుచేసి స్థానిక నాయకులకు చూపించగా, వారు ఆల్బమ్‌ను పట్టించుకోలేదు. కనీసం స్పందించలేదు. ఎన్టీఆర్‌పై అభిమానం లేని వారు పార్టీలో చెలామణి అవుతున్నారు. వీరిపై మీ కామెంట్?
వెన్నుపోటు వీరులు

ఎ.వి.సోమయాజులు, కాకినాడ
అమరావతిలో ఎన్టీఆర్ గారిది 150 అడుగుల విగ్రహం బాబుగారు ఏర్పాటు చేయడం వింతల్లో వింత. ఎన్టీఆర్‌గార్ని సి.ఎం కుర్చీ నుండి లాగేయడంతో మంచం పట్టి కన్నుమూసి 20 సం.లు అవుతోంది. ఆయన్ని పదవీభ్రష్టుడిని చేసిన బాబుగారే ‘శిలావిగ్రహం’ అనడం ‘్భరతరత్న’ అనడం వింతే కదండీ?
రోత.

పి.వి.శివప్రసాదరావు, అద్దంకి
ప్రవాహం లాంటి ప్రశ్నలతో కొందరు మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేసే సందర్భాలొస్తే? ఏమైనా వచ్చాయాండీ!
ఇంకా బొట్ల దగ్గరే ఉన్నాం.

మన దేశంలో కాంగ్రెస్ ఒకటే రాచరిక వ్యవస్థా? ప్రతి ప్రాంతీయ పార్టీ రాచరిక విధానంలోనే కొనసాగుతున్నాయి కదా. సొంతమనుకోవటం వల్లా? తనకంటే బాధ్యతగల సమర్థుడు లేడనా? పార్టీని పదికాలాలపాటు బతికించుకోవాలనే తపనా?
తమ కుటుంబం గుప్పిట్లో పార్టీని పదికాలాల పాటు ఉంచుకోవాలనే తపన.
***

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా : మనలో మనం, ఆదివారం అనుబంధం, ఆంధ్రభూమి దినపత్రిక, 36 సరోజినీదేవీ రోడ్, సికిందరాబాద్-500003
e.mail : bhoomisunday@deccanmail.com