మనలో - మనం

మనలో మనం (ఎడిటర్‌తో ముఖాముఖి)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోవూరు వెంకటేశ్వర ప్రసాదరావు, కందుకూరు
1963 సెప్టెంబర్ 17వ తేదీ ‘మహాలయ అమావాస్య’ తదుపరి వచ్చే దశమి విజయదశమి కదా! కాని అక్టోబర్ 27 ఆదివారం విజయదశమిగా వచ్చినది! ఆ సంవత్సరం ఆ విధంగా ఎందుకు మార్పు జరిగినది?
ఆశ్వియుజం అధికమాసం అయినప్పుడు అంతే.

బి.ఆర్.సి.మూర్తి, విజయవాడ
మన దేశంలో ఏ ఉద్యోగి జీతం రాష్టప్రతి జీతాన్ని మించకూడదంటారు. నిజమా?
అందుకే రాష్టప్రతి జీతమూ అమాంతం పెంచేస్తున్నారు కదా?

తెల్లకోటు కోర్సుకు కోట్లు వెచ్చించాలని పత్రికాముఖంగా చదివాం. మున్ముందు డాక్టర్ల కొరత తప్పదంటారా?
వైద్య నైపుణ్యంగల డాక్టర్ల కొరత తప్పదు.

మార్టూరు అజయ్‌కుమార్, రామచంద్రాపురం, చిలకలూరిపేట
ఈ దేశంలో అన్నీ ప్రాంతీయ పార్టీలది ఒకటే దారి, ప్రాంతీయ పార్టీ కుటుంబ సభ్యుల సమూహం తప్ప మరొకటి కాదు, బీహార్‌లో ఆర్‌జెడి, యుపిలో ఎస్పీ, తమిళనాడులో డిఎంకె ఇలా ఏ పార్టీ చూసినా ఏమున్నది గర్వకారణం అనిపిస్తున్నది. తమిళనాడులో జయలలిత తరువాత ఎవరు అంటే సమాధానం లేని పరిస్థితి? ఈ పరిణామాలపై మీ అభిప్రాయం ఏమిటి?
చెట్టు చెడిన కాలానికి కుక్కమూతి పిందెలు.

తాళాబత్తుల సత్యనారాయణమూర్తి, ప్రకాష్‌నగర్, విశాఖ
సరిగా అసెంబ్లీకి ఎన్నికల ముందు రూలింగ్ పార్టీని ముక్కలు చేస్తే ప్రత్యర్థికి కళ్లెం ఇచ్చినట్టే అని ఎందుకు ఆలోచించరు ఈ బుర్రల్లేని సమాజ్‌వాదీలు? యు.పిలో ఎసిపి చీలికతో బిజెపికి 190 నుంచి 260కి సులువుగా పెంచుకుంటారు. ఏమంటారు?
ఇప్పుడే చెప్పలేము. అక్కడ మాయావతి ప్రభావాన్ని తక్కువ అంచనా వేయకూడదు.

పొట్టి వెంకట శివప్రసాదరావు, అద్దంకి, ప్రకాశం జిల్లా
షిర్డి సాయిబాబా దేవుడు కాదు. సైతాన్ అంటున్న ద్వారక పీఠాధిపతి వ్యాఖ్యలపై మీ స్పందన ఏమిటి?
మతిలేని మాటలు.
జయలలిత ఆరోగ్యంపై అనుమానాల హంగామా ఎందుకు? వీటి సృష్టికర్తలు ఎవరు? స్పష్టం చేస్తే వచ్చే నష్టం ఏముంది?
ముఖ్యమంత్రి ఆరోగ్య స్థితిని అధికార వర్గాలు అతి రహస్యంగా మూసిపెట్టటమే అనుమానాలకు మూలం.

నాగరాజరావు, భాగ్యనగరం
ఇటీవల ఓ ఇంజనీరింగ్ విద్యార్థి, మరో వైద్య విద్యార్థి ఆత్మహత్యలతో ప్రాణాలు కోల్పోవడం శోచనీయం. కనీసం ఒక సంవత్సరం లగాయతు, ఎంతమంది విద్యార్థినీ విద్యార్థులు ఈ విధంగా చనిపోయారు. వారి గురించిన విచారణ కూలంకషంగా జరిపి, నివేదిక రావాలి. ముఖ్యంగా కార్పొరేట్ విద్యాసంస్థలలో సంఘటనల గూర్చి. కౌన్సిలింగ్ విద్యాసంస్థలలో ఏర్పాటు చేయాలి. ఈ దిశలో ప్రభుత్వం పయనిస్తుందా? మీరు ఏమంటారండీ?
పౌర సమాజం నుంచి ఒత్తిడి వస్తే తప్ప ప్రభుత్వం చలించదు.

తన్నీరు సీతారామాంజనేయులు, జగ్గయ్యపేట, కృష్ణాజిల్లా
‘తెలుగు భాషాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. తెలుగు ప్రాధికార సంస్థ నిర్మాణం, అకాడెమీల పునరుద్ధరణపై సలహాలు ఇవ్వండి’ అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రముఖులు అంటున్నారు. ప్రతి నియోజకవర్గపు సెంటరు నందు, ఉద్యోగుల, విశ్రాంతి ఉద్యోగుల సంఘాలున్నాయి. వారిలో కవులున్నారు. రచయితలున్నారు. భాషాభిమానులున్నారు. క్షేత్ర స్థాయి నుండి, కవుల రచయితల భావాలను పొంది ‘్భషాభివృద్ధికి ప్రభుత్వం పునాదులు వేయవచ్చు కదా?
వేస్తే మంచిదే.

ఎ.వి.సోమయాజులు, కాకినాడ
‘హైదరాబాద్‌లో ఎ.పి. భవన్ కట్టిస్తారట బాబుగారు. ఈ భవనాలు నేతాశ్రీలు, వారి అనుచరులు ఫ్రీగా లాడ్జింగ్ ఖర్చు లేకుండా ఉండటానికే కదా!
హైదరాబాద్‌లో ఇంకా వారికేమి పని?

‘హోదా’ అనేది మాయమయిపోయిందాండీ?
ఆహా!

పదవిలో ఉన్న మన నేతలకు రాష్ట్ర హోదా ఎందుకు? వారి హోదాలు పెరగాలి, ఆస్తులు అంతస్థులు పెరగాలి గాని?
నిజమే.

విరూపాక్షుడు, వక్కలంక
కొన్ని రైళ్ల వేగం పెంచి, గమ్యానికి 5, 10 నిమిషాల ముందరే చేరేటట్లు ఏర్పాటు అయ్యిందిట. ఈ ప్రగతికి మనం ఎంత సంతోషించాలి?
బండి 5, 10 నిమిషాల ముందరే బయలుదేరినా ప్రయాణికులకు ఇబ్బందే.

యం.ఎస్. సికిందరాబాద్
ఏ రంగంలోనైనా పేరొస్తే మనుషులు మాట్లాడరేంటి?
కళ్లు మసక, వినికిడి సమస్య. అదో నడమంత్రపు జబ్బు.

అడ్డగట్ల శివప్రసాద్, సంగారెడ్డి
దేశవ్యాప్తంగా సర్దార్ వల్లభాయి పటేల్ జయంతిని జాతీయ సమగ్రత దినోత్సవంగా ఉత్సవాలు జరుపుతూ ఉంటే ఇక్కడ తెలంగాణా ప్రభుత్వానికి కాని, తెరాస నాయకులకు కాని కనీసం ఆ మహనీయుడ్ని స్మరించి, నివాళులు అర్పించే తీరిక కూడా లేకుండా పోయింది. నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణాకు విముక్తి ప్రసాదించిన నేతకు ఓటు బ్యాంకు రాజకీయానికి ముడిపెట్టడాన్ని ఏమనాలి?
దుర్మార్గం.. ధూర్త రాజకీయం. *

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా : మనలో మనం, ఆదివారం అనుబంధం, ఆంధ్రభూమి దినపత్రిక, 36 సరోజినీదేవీ రోడ్, సికిందరాబాద్-500003. e.mail : bhoomisunday@deccanmail.com