మనలో - మనం

మనలో మనం (ఎడిటర్‌తో ముఖాముఖి)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయినం రఘురామారావు, ఖమ్మం
నల్ల కుబేరులకు, పార్టీ అనుచర గణానికి ముందే తెలిసి జాగ్రత్త పడ్డారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎంతవరకు నిజం?
నోట్ల రద్దుకు ముందు మూడు నెలల కాలంలో దేశంలో బ్యాంకు డిపాజిట్లు లక్షల కోట్ల రూపాయల్లో విపరీతంగా ఎందుకు పెరిగాయి అన్నది లోతుగా ఆరాతీస్తే ఆశ్చర్యకర విషయాలు బయటపడగలవు.

ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్
పార్లమెంటులో తనను మాట్లాడనివ్వడం లేదని మోది, తననే మాట్లాడనివ్వడం లేదని రాహుల్ బాబు వార్తల కెక్కుతున్నారు. ఇద్దరూ బయటే జన సభలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇక పార్లమెంటు ఎందుకు?
గోల భరించటానికి.

జయలలిత మరణం మీద అనేక అనుమానాస్పద కథనాలొస్తున్నాయి. ఇందులో వాస్తవమెంతండి?
సమగ్ర విచారణ జరిపితే కాని తేలదు. కాని జరపరు. ఎవరి రాజకీయం వారిది.

కె.సుజాత నాగరాజరావు, చెన్నై
జయలలితగారి పార్ధివ దేహాన్ని, ఆవిడ బ్రాహ్మణ అయ్యంగార్ కనుక, అగ్ని సంస్కారము సంప్రదాయముగా చేయవలసి వుండగా ఖననం జరిగినది. ఎందువలన?
మనకు తెలిసిన ధర్మశాస్త్రాల ప్రకారం అది తప్పే. అమ్మ, చిన్నమ్మలు ధర్మానికి అతీతులు.

సి.ప్రతాప్, శ్రీకాకుళం
ప్రభుత్వం విడుదల చేసిన 2వేల నోటు నీటిలో తడిపితే రంగు వెలిసిపోతోంది. ఇక ఏ షాపు వారు వీటిని తీసుకోవడం లేదు. సామాన్యులకు రెండు వేలు అంటే చాలా పెద్ద మొత్తం. పొరపాటున రంగు వెలసిన నోట్లను బ్యాంకు అధికారులు కూడా తీసుకోవటం లేదు. క్రొత్త నోట్ల వలన కొత్త సమస్యలు వస్తున్నాయి. మీరేమంటారు?
సర్కారు వారికి దేని మీదా ఎవరి మీదా కంట్రోలు ఉన్నట్టు తోచదు. నోట్ల రద్దు పెద్ద ప్రహసనం.

ఎం.కనకదుర్గ, తెనాలి
అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల కుంభకోణంలో భారత వైమానిక దళం మాజీ చీఫ్ అరెస్ట్ తీవ్ర సంచలనం సృష్టించింది. అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి ఈ విధంగా అధికార దుర్వినియోగం చేసి కోట్లకు కోట్లు స్వాహా చేస్తే ఇక మామూలు ప్రభుత్వ ఉద్యోగి సంగతి వేరే చెప్పాలా? ఇటువంటి వారికి కఠినాతి కఠినమైన శిక్షలు విధిస్తే తప్ప మిగతా వారికి భయం కలగదని నా అభిప్రాయం.
అతడి అవినీతికి అవకాశం ఇచ్చిన మాజీ పాలకులూ తోడుదొంగలే. వారినీ శిక్షించాలి.

వై.వి.శివకాంత, అచ్యుతాపురం, శ్రీకాకుళం జిల్లా
ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క మనిషిని కాపు పెట్టేటంత సత్తా ఉన్న ప్రభుత్వం ఎర్రచందనం అపహరించడం అరికట్టలేక పోతున్నదెందుకు?
అందరూ దొంగలే.

వాండ్రంగి కొండలరావు, పొందూరు
ప్రజాస్వామ్య వ్యవస్థలో వంశపారంపర్య రాజకీయాలకు అంతమెప్పుడు?
ఓటర్లకు బుద్ధి వచ్చినప్పుడు.

కోవూరు వెంకటేశ్వర ప్రసాదరావు, కందుకూరు
మోదీగారి తల్లి పండు ముసలి బ్యాంక్ క్యూలో వుండి తన అవసరమైన కరెన్సీ కొరకు పడిగాపులు కాస్తూ వున్నది. అయితే కేంద్ర మంత్రులు కాని, రాష్ట్ర మంత్రులు కాని, ప్రజా ప్రతినిధులు కాని కనీసం మచ్చుకైనా ఒక్కరు క్యూలలో కన్పించరే? సినీ నటులు కూడా అంతే. నోట్ల రద్దు సామాన్య మానవుని తిప్పలు పెట్టటానికేనా?
చూడబోతే అలాగే ఉంది.

డొక్కా సోమశంకరం, అగ్రహారం
పూర్తి స్థాయిలో నగదు రహిత లావాదేవీలు జరగాలంటే, అన్ని రకాల కరెన్సీ నోట్లనూ రద్దు చేసి, మళ్లీ ముద్రించకూడదు. ఇలా చేస్తే ‘గతిలేక’ జనం అలవాటు పడ్తారు. ఏమంటారు?
అప్పుడు ఆ ప్రభుత్వాన్ని ప్రజలు రద్దు చేస్తారు. (సమయం వచ్చినప్పుడు.)

ఆర్.ఎల్. సికిందరాబాద్
అమ్మ వెళ్లిపోయింది. చిన్నమ్మ దగ్గర మోకరిల్లుతున్నారు. పన్నీరు అంత పనికిరానివాడై పోయాడా అప్పుడే?
అతగాడు ఎప్పుడూ పాదుకే.

ఎ.వి.సోమయాజులు, కాకినాడ
మోదీగారు పెద్ద నోట్లు ఏ ముహూర్తాన రద్దు ప్రకటించారో గాని, ఈ నెల్లాళ్లు పెళ్లి చేసుకొనే వారి డబ్బు కష్టాలు - సామాన్యులు అవస్థ పడుతోంటే, టాటా, బిర్లాలు, రిలయన్స్ వారు, రద్దును స్వాగతించడం ఆశ్చర్యం కదండి?
మరి బాగుపడేది వారే కదా.

కొత్త నోట్ల కట్టలు కోట్లలో కూడబెట్టిన టిటిడి పాలక సభ్యుడు శేఖర్‌రెడ్డిగార్ని ఎవరు నియమించారు? ఎవరి సిఫారసుతో నియమించారు?
నాయుడుగారు చెప్పాలి.

ఎ.వెంకటస్వామి, కర్నూలు
నల్లకుబేరులు డబ్బు దాచుకొనుచున్నారు. వారికి నగదు రహిత విధానము అమలు చేయాలి. సామాన్యులకు, మధ్యరకము వాళ్లకు నగదు ఇవ్వవలెను. డబ్బు చెలామణి చేయు వారికి యివ్వవలెను.
అయ్యే పని కాదు.
**

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా :
మనలో మనం, ఆదివారం అనుబంధం,
ఆంధ్రభూమి దినపత్రిక, 36 సరోజినీదేవీ రోడ్,
సికిందరాబాద్-500003.
e.mail :
sundaymag@andhrabhoomi.net