మనలో - మనం

మనలో మనం (ఎడిటర్‌తో ముఖాముఖి)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిట్టా లోకపావని, విజయవాడ
‘మాతృదేవోభవ... పితృదేవోభవ’ అంటారు కదా. కోట్లు సంపాదించే అతను తల్లిదండ్రులు నెలకి 65వేలు అడిగితే... పుట్టుమచ్చలను ఆపరేషన్ ద్వారా తొలగించుకుని మీరు నా కన్న తల్లిదండ్రులే కాదనడం...? బాల్యంలో అల్లరి తట్టుకోలేక కఠినంగా దండిస్తే పగ పెంచుకుని ఇల్లు వదిలి సూపర్‌స్టార్ అల్లుడిగా ఎదిగి... ఇలా కోర్టుల వెంట తిరగడం...? సినిమాలో హీరోగా మంచిమాటలు చెప్పడం కాదు, ఆచరించి చూడాలి కదా?
దీని మీద ఇంకో సినిమా తీయవచ్చు.

జ్ఞానేశ్వర్, హైదరాబాద్
నరేంద్ర మోదీ ప్రచారం చెయ్యటం వల్లనే ఇటీవల ఎన్నికలు జరిగిన ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో బిజెపి గెలవగలిగిందని ఆ పార్టీవారు చెప్పుకున్నారు. అయతే మోదీగారు పంజాబ్, చిన్న రాష్ట్రాలైన గోవా, మణిపూర్‌లలో కూడా ప్రచారం చేశారు కాని మూడు రాష్ట్రాల్లో ఫలితాలు బిజెపికి అనుకూలంగా రాలేదు ఎందువల్ల?
మోదీ మహిమకూ పరిమితులున్నాయ కనుక. అక్కడి పరిస్థితులు వేరు కాబట్టి.

మెజార్టీ రాకపోయనా గోవా, మణిపూర్‌లలో బిజెపి అధికారం కోసం అడ్డదారులు తొక్కింది. గతంలో అరుణాచల్ ప్రదేశ్‌లో కూడా ఇలానే చేసి అభాసుపాలయంది. మరీ ఇంత అధికార దాహమా? ఈ విషయంలో కాంగ్రెస్‌కి, బిజెపికి తేడా లేదనిపిస్తోంది. మీరేమంటారు?
రాజకీయాల్లో నీతుల మడి కుదరదు. అసెంబ్లీలో బలపరీక్ష నెగ్గారు కనుక, అవతలివాళ్లూ పత్తిత్తులు కారు కనుక ఆవేశపడటం వృథా.

ఎల్. ప్రపుల్లచంద్ర, ధర్మవరం
మీరే ముఖ్యమంత్రి అయతే...?
అందరికీ ఆంధ్రభూమి ఫ్రీ!

ఎస్. శ్రీనివాసరావ్, ఎమ్మిగనూరు
తెలుగుదేశం పార్టీ అసమర్థత, అవినీతి, అధికార దుర్వినియోగ పాలనకు నిదర్శనమనీ, కాగ్ నివేదికతో సిగ్గు తెచ్చుకోవాలని, తక్షణం ముఖ్యమంత్రి, మంత్రులు రాజీనామా చేయాలని పిసిసి ఉపాధ్యక్షుడు గారు డిమాండ్ చేశారు. మరి ఇటువంటివెన్నో కాంగ్రెస్ పాలనలో జరిగినా వారేమన్నా రాజీనామాలు చేశారా?
అదంతే.

కోవూరు వెంకటేశ్వర ప్రసాదరావు, కందుకూరు
ఇదివరకు శ్రీరామనవమి పర్వదినాన ఆకాశమంత పందిళ్లు వేసి పౌరాణిక నాటకాలు, హరికథా ప్రవచనం, భరతనాట్యం వంటి రసవత్తరమైన సాంస్కృతిక కార్యక్రమాలతో అటు భక్త్భివం, ఇటు ఆనందం వెల్లివిరిసేది. కానీ ఇప్పుడు తూతూమంత్రంగా ఏదో షామియానా వేసి అసభ్యకరమైన పాటలతో మారుమోగిస్తున్నారు. ఇది కేవలం కాలక్షేపానికేనా? ముక్తి కోసమా?
అప్పుడూ ఇప్పుడూ కాలక్షేపానికే.

యాక్టర్ ప్రతిభ వేల లక్షల మందికి తెలుస్తుంది! డాక్టర్ ప్రతిభ ఆ పరిధిలోని కొంతమందికే తెలుస్తుంది. వీరిలో ఎవరు గొప్ప?
ఎంత గొప్ప యాక్టరైనా డాక్టరు దగ్గరికి వెళ్లాల్సిందే.

డి. యోగానంద్, కొవ్వాడ, తూ.గో.
శ్రీకృష్ణుడే గొప్ప ఈవ్‌టీజర్ అన్న ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ బుర్ర వ్యాకోచించిందా?
పైత్యం ప్రకోపించింది.

యుగంధర్, వక్కలంక
తనకు మంత్రి పదవి దక్కనందున పార్టీ సభ్యత్వానికి రాజీనామా ఇచ్చిన ఒకరు తనకు సంరక్షకులు (గన్‌మెన్) అక్కర్లేదని చెప్పారుట. పార్టీ సభ్యుడుగా వున్నప్పుడు ప్రాణహానీ, రాజీనామా చేశాక ఆ హాని తొలగిపోయందనీ ఆయన అనుకుంటున్నట్లా?
అదో రకం అలక.

అయనం రామారావు, ఖమ్మం
ఫిరాయంపుదారులకు పదవులా? మొదటినుండి పార్టీనే నమ్ముకున్న నేతల గతేంటి?
కొత్తగా వచ్చేవారిని మోయటం!

ప్రతిదాన్ని మత కోణంలో చూసే ఛాందసవాదులను ఏమనాలి? వందేమాతరం పాడితే తప్పా? ఎందుకింత వివక్ష?
మన దేశభక్తి అలా ఏడ్చింది.

Ì*

ఎడిటర్‌తో ముఖాముఖి

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా

మనలో మనం,
ఆదివారం అనుబంధం, ఆంధ్రభూమి దినపత్రిక,
36 సరోజినీదేవీ రోడ్, సికిందరాబాద్ - 500003.

: email :
sundaymag@andhrabhoomi.net