మనలో - మనం

మనలో మనం (ఎడిటర్‌తో ముఖాముఖి)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సి.మనస్విని, విజయవాడ
భారత్-పాక్‌ల మధ్య క్రికెట్ ఆటను కేవలం ఆటగా మాత్రమే చూడకుండా - దృశ్యమాధ్యమం ఒక భయంకర యుద్ధ వాతావరణాన్ని సృష్టించడం దారుణం కదా! ఏ జట్టూ ఎప్పుడూ గెలవదు. ఏ జట్టూ ఎప్పుడూ ఓడిపోదు. గెలుపోటములు ఆటల్లో సహజం. ఆ సంగతి వదిలేసి మేధావులనుకునే టీవీ జర్నలిస్టులూ, ఛానెల్ సొంతదార్లూ - భీకర ఉద్రేకాన్ని నిర్మితి చేయడం దుర్మార్గమనిపించడం లేదూ?!
ఔను. మళ్లీ అందులో బోలెడు మతలబులు. లోపాయకారి మాచ్ ఫిక్సింగులు.

గతంలో కేవలం పత్రికలే సమాచార మాధ్యమాలుగా ఉన్న రోజుల్లో గొప్ప పాత్రికేయులుండేవారు. వారు ఎంతో సంయమనంతో వార్తలుగానీ వ్యాఖ్యలుగానీ వ్రాసేవారు. వారి అభిప్రాయాలతో అంగీకరించకపోయినా వారి నిజాయితీని పాఠకులు శంకించేవారు కాదు. నేటి దృశ్య మాధ్యమపు జర్నలిస్టులు టిఆర్‌పీ రేటింగులూ - పాఠకుల ఆమోదము కోసమూ చేస్తున్న జిమ్మిక్కులు - ఫోర్త్ ఎస్టేటుకు చాలా అపఖ్యాతి తెస్తున్నాయి. ఇది భరించక తప్పదా?
ఈ పరిస్థితిని ఎలా మార్చాలన్నదే ఇప్పుడు ఆలోచించవలసింది. గట్టిపట్టుపడితే మార్చగలం. మీడియాకు ఒకప్పటి ప్రతిష్ఠను మళ్లీ తేగలం.

బాబుపటేల్ జి.
నేతాజీ సుభాస్ చంద్రబోస్ మరణం గురించిన నిజం ఇక ఎప్పటికీ తేలదు అనుకోవచ్చా? నిజం బయటికి వస్తే మనకీ, రష్యా - జపాన్ దేశాల మధ్య సంబంధాలు ఇబ్బందికరంగా మారతాయని అనుకోవచ్చా? దేశం నిండా అంతర్గత శత్రువులు చాపకింద నీరులా నాలుగు వైపులా కమ్ముకొస్తున్న స్థితిలో అంతర్జాతీయంగా మనకి సహాయం అవసరం కాబట్టే ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఇలాగ మసలుకుంటున్నదని అనుకోవచ్చాండి?
దానికీ దీనికీ సంబంధం లేదు. నేతాజీ మిస్టరీని ఛేదిస్తే చాలా పీఠాలు కూలుతాయి. మహానుభావులనబడే వారి మీద జనాలకు భ్రమలు తొలుగుతాయి. కందిరీగల తుట్టె కదులుతుంది. ఇప్పుడున్న ప్రభుత్వానికి ఇందులో భయపడవలసిందీ దాచిపుచ్చవలసిందీ ఏమీ లేదు. కాని అది దృఢంగా కదలాలన్నా ప్రజల నుంచి గట్టి ఒత్తిడి రావాలి.

డొక్కా సోమశంకరం, వక్కలంక
దినపత్రికలో అప్పుడప్పుడు మీరు వ్రాసే వ్యాసాలూ, మనలో మనంలోని కొన్నికొన్ని ప్రశ్నలకు యిచ్చే జవాబులూ, భవిష్యత్తులో మీకు తలనొప్పులు తెస్తాయేమోనని భయంగా ఉంది. నా భయం సహేతుకమైనదా, నిర్హేతుకమైనదా?
రెండోది.

కావలి నాగరాజరావు ఆచార్యులు, మామిళ్లగూడ
బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ గారి ఉదంతంలో మీ విలువైన అభిప్రాయం కోసం ఎదురుచూస్తున్నాం సార్. ఈ సంఘటన వారు వ్రాయబోయే పుస్తకము నవ్యాంధ్ర ప్రభుతకు తలనొప్పిగా పరిణమించునా?
అంత లేదు.

ఆలపాటి జనార్దనరావు, అచ్చంపేట
ఐ.వై.ఆర్.కృష్ణారావు గార్ని ఫేస్‌బుక్‌లో వచ్చిన కామెంట్స్ ఆధారంగా పదవీచ్యుతుణ్ణి చేయడం ఎంతవరకు సబబు?
అది కేవలం ఒక సాకు.

జ్యోతిర్మయి, విజయవాడ
సత్యసాయి చనిపోయిన వెంటనే దొరికిన బంగారు ఇటుకలు, అతెందుకు ఒక్కో అధికారి పట్టుబడినప్పుడు దొరికే వెయ్యి కోట్లు మనం మునిగిపోయేంత ధనం మన దగ్గరే.. ఇంకా విదేశీ బ్యాంకుల్లో దాచిన నల్లడబ్బు.. ఘరానా వ్యక్తులు దాచిన సొమ్ము.. ఇంత డబ్బుండి మనం ప్రపంచ బ్యాంకు దగ్గర అప్పు చేయవలసిన అవసరం లేదు కదా?
ఇప్పుడున్న చట్టాల చట్రంలో అయ్యే పని కాదు.

వాండ్రంగి కొండలరావు, పొందూరు, శ్రీకాకుళం
మహిళా సర్పంచుల, ఎం.పి.పి. జడ్పీటీసీల భర్తలు ఆయా కార్యక్రమాల్లో హాజరైనప్పుడు సర్పంచ్, ఎం.పి.పి. జడ్పీటీసీల ప్రతినిధులు అని పత్రికల్లో రాయడం సమంజసమంటారా?
తప్పు.

యల్లాప్రగడ మల్లన్న, గుల్లలపాలెం
నేను ఇచ్చే పెన్షన్ డబ్బు తింటున్నారు. నేను వేయించిన రోడ్లపై నడుస్తున్నారు. మా పార్టీ, నేను యిష్టం లేనప్పుడు పెన్షన్ తీసుకోకండి, నేను వేయించిన కొత్త రోడ్లపై నడవకండి అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక సభలో అన్నారు. సి.ఎం. అయ్యాక రాష్ట్ర ప్రజలందరూ తనకి సమానమే కదా? ఇలా విభజించి మాట్లాడతగునా?
అది బుద్ధితక్కువ మాట. *

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా

మనలో మనం,
ఆదివారం అనుబంధం, ఆంధ్రభూమి దినపత్రిక,
36 సరోజినీదేవీ రోడ్, సికిందరాబాద్ - 500003.
: email :
sundaymag@andhrabhoomi.net