మనలో - మనం

మనలో-మనం (ఎడిటర్‌తో ముఖాముఖి)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్
షిరిడీ సాయిబాబా భగవంతుడా? ఆయన భగవంతుడు కాదని ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు గారన్నారని ఎవరో కోర్టు నాశ్రయించారు. దేముడా, కాదా అని కోర్టులు ఏ చట్టం ప్రకారం తీర్పునిస్తాయి?
ఇది పనికిమాలిన వివాదం. హిందూ ధర్మం మీద రాళ్లేయటమే పనిగా పెట్టుకున్న వాళ్లు తీరి కూర్చుని రేపిన గోల. కోట్లాది హిందువులు బాబాను దేవుడిగా విశ్వసిస్తున్నప్పుడు వారి విశ్వాసాన్ని గౌరవించటం మన అందరి ధర్మం. సాయ ఆలయ వ్యవస్థ, అర్చనాదికాలు అన్నీ హైందవ పద్ధతిలో జరిగేటప్పుడు, బాబా కూడా సనాతన ధర్మాన్ని, గీతా ప్రమాణాన్ని అంగీకరించినప్పుడు ఆయనను, ఆయన భక్తకోటిని హైందవం నుంచి వేరుచేయాలని చూసేవాడు ఎవడైనా సమాజానికి, ధర్మానికి చీడపురుగు. ఉత్తరాది శంకర పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామికి పట్టుకున్న సాయి ద్వేషాన్ని మనం లక్ష్యపెట్టక్కర్లేదు. అన్నదానిని వక్రీకరించి ఈ గొడవలోకి పుణ్యాత్ముడు చాగంటిని లాగటం దుర్మార్గం.

జోస్యుల రాధాకుమారి, కాకినాడ
సాయిబాబా తరఫున ఎవ్వరూ ఇవ్వని వక్తాలా తీసుకుని, టీవీ చానల్ వాళ్లను డబ్బుతో కొనేసి, మానవీయ ఆధ్యాత్మిక గురువులను నోటికొచ్చినట్టు తూలనాడిన చవకబారు శాల్తీ ఒక మహర్షా?!
కాదు. మహిషి.

అనదాసు సత్యనారాయణ, పెద్దాపురం, తూ.గో.జిల్లా
గతంలో చంద్రబాబు నాయుడుగారు ముఖ్యమంత్రిగా ఉండగా, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నేను నిద్రపోను, మిమ్ములను నిద్రపోనివ్వను అని వత్తిడి చేసి కదలిక తెచ్చారు. ఇప్పుడు ఆయన నిద్రపోవుట లేదు, ఉద్యోగులు నిద్రపోవుచున్నారు. ఏం చెయ్యాలి?
ఆయన్నీ నిద్రపొమ్మంటే సరి!

ఉద్యోగులు అడిగిన అన్ని కోర్కెలు అమలు చేస్తున్నారు. పూర్తిగా ఉద్యోగుల సలహాలపై ఆధారపడినారు. వారానికి 5 రోజులు పని, 30 శాతం ఇంటి అద్దె, హైదరాబాద్ నుండి అమరావతికి ప్రత్యేక రైలు, వారికి వసతి, ఇలా చేస్తూ పోతే రాష్ట్రం అధోగతిపాలు కాదా?
కాదు. ఉద్యోగుల బాగోగులు చూడటం ప్రభుత్వ ధర్మం. అన్నీ ఇచ్చినా వాళ్లు పని చెయ్యకపోతే కొరడా పట్టుకోవలసిందే.

కాకుటూరి సుబ్రహ్మణ్యం, కావలి
స్థలాభావం ఏర్పడినప్పుడు ఇతర శీర్షికలను ఆలోచించండి. ‘మనలో మనం’ శీర్షికను ఉపసంహరించకండి. ఇది అభిమాన పాఠకుల అభిమాన వేదిక కదా!
సమస్య స్థలాభావం కాదు.. ప్రశ్నాభావం.

యశ్వంతరావు శేషగిరిరావు, ధవళేశ్వరం
క్రీ.పూ.3139న మహాభారత యుద్ధం జరిగిందని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ అనే సంస్థ వాదించింది. అంటే ఈజిప్టులో ఫారోలు, పిరమిడ్లు ద్వాపర యుగానికి చెందినవా? వాటి ప్రసక్తి భారతంలో ఉందా?
ఫారోలు, పిరమిడ్ల కంటే భారతకాలం కనీసం కొన్ని వందల సంవత్సరాలు పాతది. (మీరన్న సంవత్సరం ప్రకారమే.)
ఎ.వి.సోమయాజులు, కాకినాడ
‘రాని హోదా ఎవరి ఘనత?’ అని మీరు ఎడిటోరియల్‌లో ప్రశ్నించారు. నా ఉద్దేశంలో ప్రధానంగా ఆ ఘనత ఇప్పటివరకూ ఆ విషయం గట్టిగా అడగని బాబుగారిది. ప్రత్యేక హోదా కోసం అన్ని పార్టీలనూ కూడగట్టడం మాని, ప్రధాన ప్రతిపక్షాన్ని మింగివేయాలని చూసేవారు ఏమి సాధిస్తారు? మీరు అన్నట్లు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలుగుతామని తెలుగుదేశం వారు, పదవులకు రాజీనామా చేస్తామని బిజెపి వారు హెచ్చరించవచ్చు. కాని పిల్లి మెడలో గంట ఎవరు కడ్తారు?
ఎవరూ కట్టరు.

తమ నియోజకవర్గం అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నామనే జంప్‌జిలానీ ఎమ్మెల్యేలపై మీ కామెంట్?
వారనేది కుటుంబ నియోజకవర్గం అభివృద్ధి.

ఉపాధ్యాయుల రామం, వక్కలంక
అప్పుడే పుట్టిన పిల్లవాడిని అడిగినా మన దేశంలో రిజర్వేషన్లు ఎప్పటికీ పోవని చెబుతాడు. అలాంటపుడు మోదీగారు నొక్కినొక్కి ఇదే మాటను ఈ మధ్య సెలవిచ్చారు. అవసరమా?
రాజకీయ అవసరమే.

గుండు రమణయ్య, పెద్దాపూర్
జగన్ నిరాహారదీక్షకు కారణమేమై ఉంటుంది?
బహుశా రాజకీయ ఆకలి.

శిష్టా రాజగోపాల్, హైదరాబాద్
హిందువులను ఊచకోత కోసిన దుర్మార్గ టిప్పుసుల్తాన్ వేసవి విడిది గురించి ఎందుకు ‘ఆంధ్రభూమి’లో ప్రచురించిరి? స్వయంగా ‘ఆంధ్రభూమి’ లోగడ టిప్పుసుల్తాన్ దక్షిణ భారతంలో చేసిన దుర్మార్గములు వ్రాసిన మీకు ఇది తగునా?
మాగజిన్‌లో ఫీచర్ వ్యాసాలు వేసేటప్పుడు సంబంధిత వ్యక్తులు సన్మార్గులా, దుర్మార్గులా అన్నది చూడం. దేనికదే.

పొట్టి వెంకట శివప్రసాదరావు, అద్దంకి
ఈ మధ్య ఓ సబ్బుల కంపెనీ వారు టీవీల్లో సంస్కారవంతమైన ఓ ప్రకటన ఇస్తున్నారు. దానిలో కొందరు పిల్లలు ఒడ్డుకు కొట్టుకువచ్చిన చేపలను సముద్రంలో వేస్తుంటారు. విశ్వనాథ్‌గారు ఎందుకంటే బతికించటానికి మా చేతనైన సాయం అంటారు. ఇది సంస్కారవంతం ఎందుకు అవుతుంది? బతికించేది దేనికి? తింటానికి కాదా వాళ్లు?
ఏమో! అలాంటి ప్రకటనలు చూసేంత సంస్కారం నాకు లేదు.

యామా జనార్దన్, సూర్యాపేట
లలిత కళాతోరణంలో జాగృత భారత్ పిలుపు మేరకు మీ అధ్యక్షతన జరిగిన మహాసభ సాయంత్రం 6.30 నుండి రాత్రి 9.30 గంటల వరకు భారీ వర్షంలో కూడా శ్రోతలందరు ఆసాంతము ఉండి విజయవంతమయినది. ఇట్టి మహాసభ గురించి మరునాటి రోజు ప్రముఖ దినపత్రికలలో ఏ మాత్రము ప్రచురించలేదు. ఈ మహాసభ విశేషాలను ప్రచురించని పత్రికలను ఏ విధంగా అర్థం చేసుకోమంటారు?
వాటి పని అవి చేశాయి. *