Others

మానవసేవే మాధవసేవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పేదలకు సేవచేయాలంటూ భగవంతుడు నన్ను ఆదేశించారనిపిస్తోంది. మానవసేవే మాధవసేవగా భావిస్తున్నాను. ఆదివేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణంలో 2015 నవంబర్ 27 న భారీ ఎత్తున ఉచిత వైద్యశిబిరం నిర్వహిస్తున్నాం. అదేరోజు దాదాపు రెండువేల మందికిపైగా పేదలకు చీరలు ధోవతులు పంపిణీ చేయాలని నిర్ణయించాం. ఉత్సవాల సందర్భంగా ఇక్కడ భక్తులకు ముఖ్యమైన రోజుల్లో ఉచితభోజన సదుపాయం కల్పించాం. నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం మల్కాపుర్ గ్రామంలో మేం ఏర్పాటు చేసిన అశోక ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజీలో పేదవిద్యార్థులకు తగిన చేయూత ఇస్తున్నాం. శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణం నేను చేసినప్పటికీ, చేయించింది కలియుగదైవమే. ఆయనే నాకు తగిన శక్తిని ఇచ్చి, ముందుకు నడిపిస్తున్నాడు. ఏటా బ్రహ్మోత్సవాలకు 10-15 లక్షల రూపాయల వ్యయం అవుతోంది. స్వామివారికి గత ఏడాది బంగారు కిరీటం చేయించాం. దేవాలయంలో బ్రహ్మోత్సవాలతో పాటు ఆలయ నిర్వహణకు అందరి సహకారం లభిస్తోంది. కలియుగదైవం ఆశీస్సులతో మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగిస్తాను.
నోముల అశోక్ కుమార్, మేనేజింగ్ ట్రస్టీ
భూనీళా వేంకటేశ్వర ఆలయం, ఎవినగరం, టి. యాంజాల్.