మంచి మాట

కార్తికం పరమ పవిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శివకేశవులిద్దరికీ అమిత ప్రీతికరమైన మాసం కార్తికం. నదీస్నానాలు, దీపతోరణాలు ప్రత్యేకతను సంతరించుకుంటాయిక్కడ. శివాలయాలన్నీ దీపాలవెలుగులో కాంతులీనుతుంటాయి. అభిషేకాలు, బిల్వపత్రార్చనతో నమఃశివాయ నామంతో మారుమ్రోగుతుంటాయి.
వైష్ణవాలయాల్లో తులసీర్చనలు, జాజిపూలు, చామంతులతో అలంకారాలు దగదగామెరిసే దీపకాంతులతో లక్ష్మీనారాయణులు ప్రకాశంవంతంగా కనిపిస్తారు. అటు అర్థనారీశ్వరుడైన శివుడు భక్తులను మోక్షపదవినిచ్చి అలరిస్తూ ఉంటే ఇక్కడలక్ష్మీనారాయణులు భక్తుల కోరికలను ఈడేరుస్తుంటారు. ఇలా శివకేశవలిద్దరూ భక్తుల మొరలు వినడానికి భూలోకానికి వేంచేస్తారని భక్తుల నమ్మకం.
ఉద్యానవనాల్లో ఉసిరిక చెట్లకింద భక్తులంతా దామోదర కథలువింటూ శివకథలు చెబుతూ వనభోజనాలు చేస్తుంటారు. తులసీవనాల్లో లక్ష్మీదేవితో కూడి విహరిస్తున్న నారాయణునికి తులసినిచ్చి వివాహం చేస్తుంటారు. తులసీవృక్షాన్ని, ఉసిరిక వృక్షాన్ని దగ్గరకు చేర్చి వివాహాలు జరిపిస్తారు. తులసికోట చుట్టూ దీపాలను వెలిగించి పూజిస్తారు.
ఏకాదశినాడు అంబరీషుని కథను, రుక్మాంగమహారాజు జీవిత చరిత్రను చెప్పుకుంటూ విష్ణుసహస్రనామాలను పఠిస్తారు. విష్ణునామస్మరణతో ఏకాదశినాడు ఉపవాసం చేసి జాగరణ చేస్తారు. ఇలా చేసినవారికి ఇహపరలోకాల్లో సంపదలు వృద్ధిఅవుతాయ.
కార్తికంఅంతా ఉపవాసాలతో ఉండలేనివారు సోమ, ఏకాదశులలో ఏకభుక్తం ఉన్నవారికి అపారమైన పుణ్యరాశిని శివకేశవులు అనుగ్రహిస్తారు. త్రిపురాసురులను రాక్షసులు వర గర్వం చేత దేవతలను, మానవులను నానా ఇబ్బందుల పాలు చేసేవారు. వారు ఏ ఆయుధం చేతకూడా మరణం లేకుండా చతుర్ముఖుని వద్ద వరం పొందారు. దాంతో వారికి కన్నుమిన్ను కానని అహంకార మదోమత్తులు అయ్యారు. అట్లాంటి వారిని కూడా అనాయాసంగా పరమశివుడు ఈ కార్తిక పున్నమినాడు మట్టు పెట్టాడు. అందుకే ముక్కంటిని త్రిపురాసురసంహారకుడన్న నామంతో అర్చిస్తారు. ఈ త్రిపురాసుర సంహారకథను పున్నమి నాడు చెప్పుకుంటే మనలోని అహంకారం కూడా నశిస్తుందని అంటారు.
క్షీరసాగర మదనంలో తన భర్త మింగిన గరళం వల్ల తన పెనిమిటికి ఆపదలు వాటిల్లకూడదని జ్వాలాతోరణాన్ని కట్టి అందుముమ్మారు తిరిగిందట పార్వతీదేవి అందుకనే కార్తిక పున్నమినాడు జ్వాలాతోరణోత్సవాన్ని నిర్వహింపచేస్తారు.
సూర్యోదయానికి ముందు స్నానపానాదులు నిర్వర్తించి ఇంటి గుమ్మంలోను, దేవాలయంలోను దీపంపెట్టడం, అట్లాగే సాయం సంధ్యాసమయంలో దీపారాధన చేయడం ఇంటిని, దేవాలయాలను దీపాలతో అలంకరించటం వంటివి చేసేవారికి ఇహపరాల్లో సంపదలకు కొదువ వుండదు. ఉసిరికాయపైన ఆవునేతితో దీపం మరింత మోక్షకారకమని అంటారు. అరటిదొప్పలల్లో నదీప్రవాహంలో దీపాలను వదలడం ఈ మాస ప్రత్యేకతే కాదు గంగానదికి దీపహారతి ఇవ్వడం వలన అనేక జన్మలలోని పాపాలన్నీ నాశనమవుతాయని అంటారు. ఆవు గిట్ట పట్టేంత స్థలంలో ఉన్ననీటిలోను విష్ణు అంశ ఉంటుంది కనుక ఆస్థలంలో దీపాలను ప్రకాశమానం చేస్తారు. దీపదానం చేయడం ఉత్తమోత్తమైన క్రియ అని వెండి కుందెలతోగాని హిరణ్య ప్రమిదలతోను దీపదానం చేస్తారు. ఆఖరికి పిండితో ప్రమిదను చేసికాని మట్టి ప్రమిదతోగాని దీపప్రజ్జ్వలనం చేసి దానం ఇస్తే గోరంత దీపానికి కొండంత జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడంటారు కైలాస వాసుడు. ఈ మాసంలోనే త్రిలోచన గౌరీ వ్రతం, శాంతివ్రతం, శాకసప్తమీ వ్రతం కామధేనువు వ్రతం ఆచరిస్తారు.
ఈ నెలలో చేసే లక్ష్మీ పూజలు అత్యంత ఫలప్రదాలు. అసలు ఏపూజచేసినా ఏవ్రతం చేసినా పార్వతీపరమేశ్వరుల అనుగ్రహం అపారంగా ఉంటుందని శాస్త్ర వచనం.

- రావుల రాజేశం