మంచి మాట

మంచి దారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచి మాటే మనిషికి ఆభరణం. ఉత్తమ వ్యక్తిత్వాన్ని రూపొందించుకొనేందుకు మంచిమాట తీరు మాత్రమే దోహదం చేస్తుంది. ప్రతివారు పెద్దలను గౌరవించాలి. మర్యాదగా చూడాలి. గురువులు, కుటుంబం, సమాజం మెచ్చుకొనే విధంగా మాట్లాడాలి. మంచిగా మాట్లాడడం ఓ అలంకారం లాంటిది. అంచేతనే వాక్కును భూషణమని అంటారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆలోచించి నిదానంగా మాట్లాడాలి. పెద్దలను గౌరవంగా బహువచనంలో సంబోధించి మాట్లాడ్డం కనీస మర్యాదగా భావించాలి. వినమ్రతతో కూడిన వాక్కు ఎక్కడికి వెళ్లినా విజయానే్న కల్పిస్తుందని చిన్నజీయర్‌స్వామి వివిధ సత్సంగ సమావేశాల్లో అభిభాషిస్తుంటారు. మంచిమాట సాధించలేనిది ఏమీ లేదు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని లోకోక్తి. మానవుడు సంఘజీవి. సమాజంలో నలుగురిలో కలిసిమెలిసి జీవించడం అనివార్యం. మృదువుగా మాట్లాడి మిత్రులుగా మార్చుకోవడం బుద్ధిమంతుల లక్షణం. చాలామందికి నాలుకపై అదుపు వుండదు. నాలుక కత్తికన్నా పదునైనది. కత్తి కనిపించే శరీరాన్ని ఛేదించగలదు. మాటలు అదృశ్యంగా వున్న మనస్సునే ఖండిస్తుంది. ఒక్కసారి పగిలితే అతుకుపడనిది మనస్సు. పరుషంగా మాట్లాడి ఇతరుల మనసు కష్టపెట్టకూడదు. తొందరపాటుతో ఆవేశంలో మనం మాట్లాడే మాటలు ఇతరులను ఎంత కష్టపెడతాయో ఊహించలేం. కొంతమంది మాటలు తూటాల్లా తోటివారిని వేధిస్తాయి. వారి మనసులకు తూట్లు పొడిచేటట్టు ఉంటాయి. మరికొంతమంది మాటలు అమృతపు ఊటల్లా పదికాలాలపాటు మధురస్మృతుల్లా మిగిలిపోతాయి. అంచేతనే ఎంత కఠినమైన విషయాన్ని సయితం మధుర భాషణంతో చెప్పగలగడం గొప్ప నేర్పు.
ధర్మశాస్త్రాలు పేర్కొంటున్నాయి- చంద్రుడు, చల్లని నీళ్లు, చందన రసం, చల్లని నీడ మానవుణ్ణి ఆహ్లాదపరుస్తుంటాయి. అంతకంటే మధుర వాక్కు మరింత ఆనందం కలిగిస్తుంది. ప్రియంగా మాట్లాడితే అంతా సంతోషిస్తారు. నాలుగు మాటలు మధురంగా మాట్లాడితే మనకొచ్చిన సమస్య ఏమీ వుండదు. పైసా ఖర్చు కూడా కాదు.
ఎదుటివాడు కఠినంగా మాట్లాడినా, ఉద్రేకపడకుండా తిరిగి కఠినంగా స్పందించకపోతే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఓసారి గౌతమ బుద్ధుణ్ణి ఒక వ్యక్తి పరుష వాక్యాలతో దూషించాడు. బుద్ధుడు ఏ మాత్రం చలించకుండా ప్రసన్నవదనుడై నిలిచాడు. మీరలా ఎలా ఉండగలరని శిష్యుడు ప్రశ్నిస్తే గాలికి ఎగిరిపోయే మాటల్ని మన మనస్సు స్వీకరించకపోతే మన ప్రశాంతతకు ఎలాంటి భంగం వాటిల్లదంటాడు. అంగుళీమాలుని వంటి ముష్కరులను సైతం మృదువచనాలతో బుద్ధుడు మార్చగలిగాడు. దీన్ని బట్టి మాట ఓ మంత్రంలాంటిదని వెల్లడవుతుంది.
ఒక్కోసారి సత్యమైనదైనా, కఠినమైనదైనా విషయాన్ని ప్రియంగానే చెప్పాలని భగవాన్ శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో పేర్కొన్నాడు. ‘అహింసా సత్యమక్రోధ’ మొదలుగాగల గుణాల్లో ‘మార్థవం’ అని ఉటంకించాడు. ‘మార్థవం’ అంటే మృదుత్వం అని భావం. మృదుత్వం ద్వారా కఠినత్వాన్ని ఛేదించవచ్చు. సున్నితమైన నీటి బిందువు రాతిని సహితం కరిగించగలదు. అదేవిధంగా మృదు మధుర వచనాలతో కఠినాత్ముల హృదయాలను కూడా కరగించవచ్చు. మృదువచనాల్లో అంతర్లీనంగా ఉన్న శక్తి అలాంటిది. మనం పలికే మాటలు ఎదుటివారికి హితం కలిగించే విధంగా ఉండాలి. మనసుకు ఇంపుగా ఉండాలి. అలా మాట్లాడకలేకపోతే వౌనంగా ఉండటమే శ్రేయస్కరం. మనం మాట్లాడే మాటలు వినేవారికి ఉద్వేగం కలిగించరాదు. ఉల్లాసం, ఉత్సాహం కలిగించే విధంగా ఉండాలి. మృదువుగా, ఉత్సాహం కలిగించే విధంగా ఉండాలి. మృదువుగా, మధురంగా, చల్లగా ఉండటం నాలుక సహజస్వభావం. అంచేత దాన్ని సహజ స్థితిలో ఉంచి మృదువుగా మాట్లాడటం అలవరచుకోవాలి. దీన్ని అలవరచుకుంటే మన జీవనం మాధుర్యంగా ఉంటుంది. సుఖ, శాంతులతో పరిఢవిల్లుతుంది. మంచి మూర్తిమత్వాన్ని కలిగించడానికి మృధుమధుర భాషణమే తొలి సోపానమని గ్రహించాలి.

- వాండ్రంగి కొండలరావు