మంచి మాట

మాటతీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాక్కుకున్న శక్తి వాడియైన కత్తికి కూడాలేదు. కార్యాన్ని సిద్ధింప చేసుకోవాలన్నా, అపభ్రంశం అయినా మాటతీరుమీదనే ఆధారపడి ఉంటుంది. లియోటాల్ స్టాయ్ చైనా సామెతను ఉదహరిస్తూ ఇలా అంటాడు. ‘‘నీ ఆలోచనలను పరిశీలించుకో అవి మాల ట రూపం దాల్చుతాయి. నీ మాటలను జాగ్రత్తగా చూసుకో అవి కార్యరూపం దాల్చుతాయి. నీవు చేసే కార్యాలు నీస్థాయిని సూచిస్తాయి. నీ కార్యాల పట్ల అవగాహన ఉంచకో అవే అలవాట్లుగా మారుతాయి. ఆ అలవాట్లు నీవిధిని నిర్ణయిస్తాయి’’
మనలోని మనోదౌర్భల్యం కావచ్చు. మితిమీరిన ఉత్సాహం కావచ్చు. అనవసరమైన మాటలను పలికేలా చేస్తాయి. ఆ అనవసరపు మాటలు కొన్ని అకార్యములకు కారణము అవుతాయి. ఆ అకార్యం మరొక అకార్యమునకు దోహదమై చెడుమాటల మూట బరువు మెడకు చిక్కుకుని తలవంపుకు గురి అవుతాము.
మాట అనేది హృదయాంతరాళల్లో ఉద్భవించి స్వరపేటిక ద్వారా ప్రయాణించి నాలుక ద్వారా పలుకబడే ఒక శక్తిస్వరూపం. మాట అనేది స్వరయుక్తంగా జీవం కలిగి, శక్తికలదై ప్రేరణ కలిగించేదిగా చైతన్యవంతమైనదిగా ఉండాలి.
మాటకు విలువ కలిగేదిగా ఉండాలి. స్పష్టంగా ఉండాలి. వర్ణములను సరిగా పలకాలి. స్వరము అనగా ఉదాత్తనుదాత్త స్వరాలు, సక్రమంగా ఉచ్ఛరించాలి. మాత్రః హ్రస్వ దీర్ఘాక్షరాలు వ్యత్యాసం కనిపించాలి. బలం అంటే అక్షరాలను ఉచ్ఛరించేటపుడు ప్రయత్నం త్వరగానూ గాక మరీ నిదానం గాను కాక మధ్యగతిలో పలకాలి...
ఈ విషయమే శ్రీరాముడు హనుమంతుని నుంచి మొట్టమొదట మాట్లాడిన మాటలల్లో ఈ సంయమనం ఉందని ఈ మాటతీరును బట్టే ఆంజనేయుడు మంచి స్నేహశీలి అని చెప్పాడు. మారుతి లాంటి మంచి మాట్లాడగలిగే నేర్పును అందరూ నేర్చుకోవాలి.
మనగొంతునుండి మాట బయటకు వెళ్లేటపుడు జాగ్రత్తలు పాటించాలి. అంతేకాదు ఇతరులకు ఉద్వేగం కలిగించనిది, సత్యం హితము అయిన మాటలు మరియు వేదశాస్త్ర పఠనం, పరమేశ్వరనామ జపం ఇవన్నీ వాచక తపోకార్యాల్లాంటివి.
చక్కగా ఆకర్షణీయంగా మాట్లాడగలగడం ఓ వరం కొందరు మాటకారితనాన్ని పరిమితికి మించివాడుతారు. ఇది కృతకంగా అసహజంగా ఉంటుంది.
కొందరు తక్కువగా మాట్లాడినా అద్భుతంగా ఉంటుంది. కొందరు లొడలొడా వాగుతూ అక్కర్లేని పేచీలు కొనితెచ్చుకుంటారు. అనువుగాని చోట అధికులమనరాదు. అందుకే మన మాటకు విలువ లేని చోట ప్రగల్భాలు పలికితే ప్రమాదాలు కొని తెచ్చుకునేవారమవుతాము.మనలో వివిధ మానసిక పరిస్థితులు ఉద్వేగాలు అనుసరించి మాట బయటకు వస్తుంది. ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా నిదానంగా మాట్లాడగలగడం ఓ నేర్పు. ఉత్తమమైన వైఖరిగలిగి నిజమైన ఆధ్యాత్మిక సాధన కలవారికి ఇది సాధ్యం.
మంచిమాటతీరు మనిషికి ఆభరణం లాంటిది. సత్కర్మలను ప్రేరేపించు ఉత్ప్రేరకం లాంటిది. ఉత్సాహం నింపేటి ఔషధం లాంటిది. నిద్రాణమైన శక్తులను తట్టిలేపు సంజీవని లాంటిది. అందుచేత మనం స్పష్టంగా వివేచనతో నిజాయితీగా ఆత్మీయంగా ఆదరంగా అవసరాన్ని బట్టి గంభీరంగా మంచి మాటలను పలకాలి.
మాటతీరును బట్టి మనిషి ఏవిలువ చేస్తాడో చెప్పచ్చు. దాన్ని బట్టి ఆ మనిషి మంచివాడో చెడ్డవాడో నిర్ణయం చేయవచ్చు. కనుకనే మాటనే మనం నేర్పుగాను, జాగ్రత్తగాను వాడితే మన విలువను మనం పెంచుకునే నేర్పును పొందవచ్చు.
***

మంచిమాట శీర్షికకు ఆధ్యాత్మిక సంబంధమైన వ్యాసాలను
సులభశైలిలో ఎవరైనా సొంతంగా రాసి పంపించవచ్చు. రచనలు పాఠకులకు ఆసక్తికరంగా వుండాలి. మూడు అరఠావులకు తగ్గకుండా వుండాలి. ప్రచురించిన రచనలకు పారితోషికం ఉంటుంది.

- చావలి శేషాద్రి సోమయాజులు.