మంచి మాట

అంతర్ముఖం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ సృష్టి చాలా విచిత్రమైనది. భగవంతునిచే సృష్టించబడిన మనిషికి భగవంతుడు ‘ఒంటరితనం’ అనే రక్కసి కోరల్లో నుండి తప్పించుకొనుటకు ‘సమాజం’ అనే మిత్రుడ్ని ప్రసాదించుట భగవంతుని సృష్టి వైచిత్రానికి ప్రధాన తార్కాణం. ఈ సమాజంతోపాటు మానవుడికి దైవం/మతం అనేవి ప్రసాదించి అతడి దృష్టిని అంతర్ముఖం గావించి మానవుడ్ని ఇలపై (్భగవంతుని) తన ప్రతిరూపంగా మలచుటయే ఆ ఆద్యంతరహితుని అపర సృష్టి ప్రత్యేకత. భగవంతుడు మానవుడికి ప్రతిదాన్ని రెండుగా మలచి ఇచ్చాడు.
ఒకటి- తన చుట్టూ ఉండి తన నేత్రాలకు గోచరించే ఈ భౌతిక ప్రపంచంలోని ఆకర్షక విషయాలు, మరొకటి అంతర్నేత్రానికి మాత్రమే గోచరించే ఆధిభౌతికాంశాలు. ఈ భౌతిక విషయాలన్నీ ఇహంగా భావిస్తే ఈ ప్రపంచానికి ఆవల ఉండేది పరం. ఇలాగ ఇహ, పరాలు రెండు. సుఖ దుఃఖాలు రెండే. స్వర్గం, నరకం రెండు. జనన మరణాలు రెండే. మంచి చెడ్డలు రెండే. శారీరక ఆనందం, మానసిక ఆనందం అనేవి రెండే. అయితే ఈ ఇహ పరాల్లో మనిషిని పరానికి దూరం చేస్తున్న భౌతిక విషయ వాంఛలవనుండి మనిషి బయటపడటానికి, తన్ను చేరడానికి ఆ భగవంతుడు మనిషికి శారీరకంగా రెండు ఏకాంగాలను సృష్టించాడు.
అవి ప్రతి మనిషికీ రెండు కాళ్ళు, రెండు చేతులు, రెండు చెవులు, నాసికారంధ్రాలు రెండే, దివ్య చక్షువులు రెండే. ఈ రెండేసి ఏకాంగాలను కదిలించే మనస్సు / బుద్ధి అనేది మాత్రం ఒకటే. ఈ ఏకాంగాల లక్ష్యం.. కాళ్ళు రెండు- ఒకటి తన గమ్యం తాను చేరడానికి. రెండవది- ఇబ్బందులో ఉన్నవారిని వారి గమ్యం వారు చేరడానికి సహాయపడటానికి. కరములు రెండే- ఒకటి తన అనుష్టానాలు నిర్వర్తించుకొనడానికైతే, రెండవది భగవధనుష్ఠానంతోపాటు మాధవ సేవలో భాగంగా మానవ సేవ చేయడానికి. రెండు చెవులూ ఒకటి- ఇహలోక విషయాలు వినటానికి మరొకటి- పరం చేరడానికి, పరమాత్ముని లీలాగానామృతాన్ని ఆస్వాదించడానికి.
ఇక కన్నులు రెండే- ఒకటి బాహ్య ప్రపంచాన్ని తిలకించడానికి, రెండవది పరమాత్ముని లీలలు తిలకిస్తూ తనలోపలి ఆత్మను పరిశోధించడానికి. నాసికా రంధ్రాలు కూడా రెండే. ఒకటి శక్తికి ప్రతిరూపంగా ఉన్న ప్రాణవాయువుతో ప్రాణాలు నిలుపుకొనుట, రెండవది ఈ శరీరంలోని వాయురూప మలినాలు విసర్జించటానికి. ఇక పెదవులు రెండే. ఈ రెండు పెదవులూ కలిస్తేనే మానవ ఆలోచనా సంకేత రూపానికి చిహ్నమైన భాషను వ్యక్తీకరించటానికి.
భాషారూపంగా తన అంతర్గత మనోభావాలను వెల్లడిచేస్తూ ఆ దివ్య పురుషుని నామామృతాన్ని గ్రోలుటకు ఈ రెండు పెదవులూ సృష్టించబడ్డాయి. అయితే మానవుడికి బుద్ధి మాత్రం ఒకటే. ఎందుకంటే ‘గీతామృత సృష్టికర్త’ అయిన శ్రీకృష్ణ్భగవానుని సందేశంలో ‘బుద్ధి కర్మానుసారిణి’- దీని ప్రకారం కర్మలను ఏకోన్ముఖంగా నిర్వర్తించటానికి. ద్వైదీభావాన్ని విడనాడి ఈ ప్రపంచానికి, ఈ సృష్టికి ఆధారపూరితమైన మహాశక్తిని ఆత్మశక్తితో దర్శించటానికి భగవంతుని ద్వారా మానవునికి ఈయబడినది ఈ బుద్ధి. మనోవాక్కాయకర్మలను ఆ పరమాత్మార్పణం కావించి, ఈ భౌతిక ప్రపంచ విషయ వాంఛలనుండి బయల్పడి పరాన్ని, పరమాత్మను చేరడానికి నిరంతరం మన బుద్ధిని మనం ప్రక్షాళన గావించుకోవటం మన నిరంతర ఏకోన్ముఖ కర్తవ్యం. తన లోపలికి తాను చూచుకోవడమే బుద్ధిని ప్రక్షాళన చేసుకొనే ఏకైక మార్గం.
**

మంచిమాట శీర్షికకు ఆధ్యాత్మిక సంబంధమైన వ్యాసాలను
సులభశైలిలో ఎవరైనా సొంతంగా రాసి పంపించవచ్చు. రచనలు పాఠకులకు ఆసక్తికరంగా వుండాలి. మూడు అరఠావులకు తగ్గకుండా వుండాలి. ప్రచురించిన రచనలకు పారితోషికం ఉంటుంది.

- మండా శ్రీ్ధర్