మంచి మాట

స్నేహబంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కష్టకాలంలో మనలను ఆదుకునేవాడు స్నేహితుడు. కల్లాకపటము, స్వార్థములేని మైత్రీబంధం ఒక దివ్యానుభవం. కష్టనష్టాల్లో కూడా ఉండి, చెడుదారిలోనడిచేవానిని కూడా మంచిదారిలోకి మళ్లించగలిగే స్నేహమే స్నేహమని పెద్దలంటారు.
స్నేహశీలత్వంలో కులమతాలు కాని హెచ్చుతగ్గులు కాని తలెత్తవు. ఒకరి అభిరుచులు మరికొరి అభిరుచులతో కలిస్తే చాలు ఆ స్నేహం దినదినాభివృద్ధి చెందుతుంది. సజ్జనుల స్నేహం దొరకడం పూర్వజన్మ పుణ్యంగా చెప్తారు. ఈ విషయమే మనకు శ్రీరాముని జీవితం చెబుతుంది. గుహుడు, విభీషణుడు, సుగ్రీవుడు జటాయువు శబరి లాంటివారితో శ్రీరాముని స్నేహం మనకు ఎటువంటివారితో స్నేహం చేయాలో స్నేహవిలువ ఎంతటిదో కూడా తెలుపుతుంది.
అసలు మంచి చెడు అనేవి వారి వారి నైజాలను, ప్రవర్తనలను బట్టి ప్రవర్తిల్లుతాయ. ఉదాహరణకు జలజము, జలగ రెండూ నీటిలోనే పుడ్తాయ. పద్మం లక్ష్మీదేవి నివాసానికి సానుకూలంగా ఉంటుంది. పైగాఅందరికీ తన దర్శనంతోనే ఆనందాన్ని కలిగిస్తుంది. కాని జలగచూడడానికి కంపరాన్ని కలిగిస్తుంది. ఇక స్పృశించగానే మన రక్తమును పీల్చివేస్తుంది. అట్లానే మంచివారు నలుగురి కల్యాణానికి మూలకారణం అయతే దుర్జనులు నలుగురి దుఃఖానికి కారకులు అవుతారు.
లోకంలో మానవులందరూ ఒక్కటే జాతి. అందరూ ఆ దేవుని బిడ్డలే. ఏ మతమైనా దేవుడు ఒక్కడే అని చెప్తుంది. మతం ఎల్లపుడూ మంచి పనులను చేయమని అంటుం ది. కాని వారి వారి బుద్ధి చెడునడతకు దారితీస్తుంది. పెద్దలు అందుకే మనసుచెప్పినట్లు నడుచుకోమంటారు. అంతర్మాతకు జవాబు ఇవ్వగలిగేపని ఏదైనా చేయవచ్చు. కాని అంతర్మాతను తొక్కేసి, బుద్ధికి తోచినట్లు నడిస్తే వారి నడవడిలో ఒడిదొడుకులు కలుగుతాయ. ఇతరులకు కీడు కలిగించే పనులు వారి నిజజీవితాన్ని అతలాకుతలం చేస్తాయ.
సుధ-సుర రెండూ సముద్ర మథనంలో పుట్టాయ. కాని అవి ఒకటి ప్రాణదాత, మరొకటి ప్రాణహారి. అట్లానే పుట్టుకతో మనుషులుగా పుట్టినా వారి ఆలోచనా విధానం వల్ల వారు సజ్జనులు, దుర్జనులుగా మారుతారు. సజ్జనుల వల్ల ఇతరులకు ఉపకారం జరిగితే దుర్జనుల వల్ల అపకారం కలుగుతుంది. సజ్జనులను అందరూ కీర్తిస్తే దుర్జనులను నిందిస్తారు. ఈ కీర్తి అపకీర్తికి కారణం వారి వారి నడతనే.
ఇదే విషయాన్ని శ్రీకృష్ణుని జీవితమూ చెప్తుంది. ద్వారకానాథుడు ఆగర్భ శ్రీమంతుడైన శ్రీకృష్ణుడు- ఆగర్భదరిద్రుడైన కుచేలునితో స్నేహం చేస్తాడు. కృష్ణుని చూచి తమ దారిద్య్రవిమోచనానికి దారి అడిగి రమ్మని తన భార్య పంపించగా వచ్చిన కుచేలుణ్ణి చూచి ఆనందాతిరేకంతో కృష్ణుడు కుచేలుణ్ణి ఆలింగనం చేసుకొని సాదరంగా ఆహ్వానించి తన పక్కన కూర్చోబెట్టుకుంటాడు. తన శ్రీమతితో కలసి అతిథి మర్యాదలు చేస్తాడు. కృష్ణదర్శనంతో అపరిమితానందానికి లోనైన కుచేలుడు వచ్చిన పనిని మరిచాడు. ఆ ఆనందంతోనే కృష్ణుని దగ్గరే కొంతకాలముండి తిరిగి ఏమీ అడగకుండానే తన నిజవాసానికి వెళ్లిపోతాడు. కాని సర్వమూ ఎరిగిన శ్రీకృష్ణుడు కుచేలునకు కావాల్సిన దాన్ని అందిస్తాడు. మంచివారు అడగకపోయనా కావాల్సిన దాన్ని ఇస్తారు. మంచివారి స్నేహమెప్పుడూ చంద్రుని వెనె్నలవలే చల్లగా పదినాళ్లు ఉంటుంది. చెడ్డవారి స్నేహం మధ్యాహ్న మార్తాండునిగా మొదలైనా పెద్దగాలికి ఎగిరిపోయే దూదిపింజంగా ఎక్కువ కాలం మనలేదు. అందుకే మంచివారితో స్నేహాన్ని పది కాలాలపాటు ఉండేలా చూసుకోవాలి. దుర్జనులతో స్నేహం చేయ కూడదు. ఒకవేళ తెలియక చేసినా వారిని ఖర్చు చేసైనా దూరం చేసుకోవాలంటారు పెద్దలు. మల్లెలు మూటగట్టిన గుడ్డకూడా మల్లెల సువాసనను వెదజల్లినట్టుగా సజ్జనస్నేహం కొద్దినాళ్లే దొరికినా ఆ స్నేహపరిమళం జీవితాంతం గుర్తుండిపోతుంది. భావిభారత పౌరులుగా ఎదిగే నేటి చిన్నారులకు స్నేహం విలువను, స్నేహతత్వాన్ని నేర్పించాలి.

- ఎ. రాజమల్లమ్మ