మంచి మాట

నిజమైన భక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిరాడంబరంగా, నిర్మలంగా, నిశ్చలమైన మనసుతో చేసే ఒకానొక పవిత్ర కార్యమే నిజమైన భక్తి. భక్తి అంటే బాహ్యాడంబరాల ప్రదర్శన అనే భావన కలియుగంలో ప్రబలుతోంది. ఇంటిలో చేసే చిన్న వ్రతం అయినా పండగ అయినా సరే నిండు మనసుతో, నిస్వార్థంతో, నిరాడంబరంగా చేసుకోవాలి.
భక్తి అనేది కేవలం తమ గొప్పదనాన్ని, దర్జాని దర్పాన్ని ప్రదర్శించుటకొరకే అనే భావనతో చేసే పూజలలో, వ్రతాలతో, నోములలో, పండగల్లో భక్తి కన్నా ఆడంబరం ఎక్కువై పోతుంది. ఏ దేవుడూ, దేవత కూడా మనం ఎంత ఆడంబరంగా చేశామా, ఎంత ధనం ఖర్చుపెట్టి పూజలు, వ్రతాలు చేశామా అని చూడడు. దైవం చూచేది కేవలం తన భక్తునిలోని సేవా దృక్పథం. ధర్మనిరతిని. అంతేకాని మరే మీ కాదు. మనసును పవిత్రంగా వుంచుకుని చేసే ఏ వ్రతమైనా, పూజైనా సరే అది ఎంత చిన్నదయినా సరే తప్పకుండా భగవంతుడికి ఇష్టం అగును. మనసు నిర్మలంగా లేనిచో అనగా మనసులో, అసూయ, అహంకారం, ద్వేషం, పగ, ప్రతీకారం వంటివి కొలువుండగా అటువంటివారు ఎన్ని నోములు, వ్రతాలు, జపాలు, యజ్ఞయాగాదులు చేసినా అవి నిష్ప్రయోజనం, ఫలితం ఇవ్వక వ్యర్థమగును.
దీన్ని సూచించేదే తులాభారం. ఆనాడు సత్యాదేవి తులాభారంలో శ్రీకృష్ణపరమాత్మను ఎంత బంగారంతో తూచినా ఆయన సరితూగలేదు. రుక్మీణీథేవి కేవలం భక్తితో ఒక తులసీ దళాన్ని సమర్పించగానే ఆయన సరితూగాడు. అందుకే నిజమైన భక్తితో పండునో, కాయనో, ఆకునో లేక పోతే నీటినిచ్చినా భగవంతుడు ఇష్టంగా స్వీకరిస్తాడు. అధిక సొమ్ముతో భగవంతుడికి బంగారు కిరీటాలు, వజ్ర వైఢూర్యాలతో ఏడు వారాల నగలు చేయించడం, బంగారు గోడలు నిర్మించడంలాంటివన్నీ భగవంతుడి దృష్టిలో భక్తితో చేసిన పనులుకావు.
నిరుపేదైనా సరే భక్తితో ఒక బియ్యం గింజనే మనస్ఫూర్తిగా స్వామికి నైవేద్యంగా సమర్పించిన చాలు, అదే ఆయనకు ఆనందదాయకం. అలనాడు కుచేలుడు శ్రీకృష్ణపరమాత్ముడి వద్దకు తనకున్నదానిలో అటుకులని గుప్పెడు పట్టుకెళ్లాడు. వాటినే ఆ పరమాత్ముడు పరమాన్నంగా భావించి పరమానందంగా ఆరగించాడు. కుచేలుడిని అనుగ్రహించాడు. భక్తిలో ఎన్నో రకాలు, విధానాలున్నాయి. ఏ విధానమైతే ఏ రీతి అయనా భక్తి మాత్రం ఒక్కటే. కనుక సర్వసాక్షి అయన భగవంతుడు నిరంతరం మనలను చూస్తున్నాడని తెలుసుకొని ఎవరి కన్ను గప్పో తప్పిదం చేద్దామని అనుకోక సత్యధర్మాలకే విలువ నివ్వాలి. ఆ సత్యధర్మాలే భగవంతుని రూపుగా తలవాలి.
భక్తి అనే పదానికి భయం అనే ముసుగువేసి భక్తికాక ఇతరాలను ఆశ్రయంచినవారికి అటు భగవంతుని పథమూ ఇటు సజ్జనుల సఖ్యమూ దూరమై రెంటికి చెడిన రేవడిగా మారుతారు. కనుక ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు జరిగినా ధర్మాచరణకేవిలువనివ్వాలి. నిస్వార్థంగా పనులు చేయాలి. సాటి మనుషులల్లో పరమాత్మ అంశాన్ని చూడగలగాలి.
భక్తి యొక్క అర్థాన్ని పరిపూర్ణంగా గ్రహించాలి. భక్తుల భయాలను తొలగించేవాడు భగవంతుడు. మనస్ఫూర్తిగా, ఆర్తితో భగవంతుణ్ణి పిలిస్తే పలుకుతాడు. అందుకే ఆయన్ను భక్తుసులభుడు అన్నారు. తన భక్తుల కోసం ఎన్నో అవతారాలను దాల్చి వారు కోరుకున్నవిధంగా వారికి దర్శనమిచ్చాడు.
అందుకే భక్తుడు ఎపుడూ కూడా భగవంతుడిని మాయ చేద్దామని కాక ప్రకృతి మాయలో చిక్కుకొనక నిరంతరం భ గవంతుని సశ్చీలంతో ప్రార్థించాలి. భగవంతుని తత్వాన్ని ఎరి గి భగవంతుడు మెచ్చుకునే విధముగా ఆ స్వామిని పూజించడం, సేవించడమే నిజమైన భక్తి. భక్తుడు భగవంతుడు వేరు వేరుకాదు. భగవంతుని స్వరూపుడే భక్తుడు అందుకే భగవంతుడు భాగవత సేవ చేయాలని తలచి శ్రీకృష్ణావతారాన్ని సృజియంచుకున్నాడట. అందుకే భాగవత సేవ భగవంతుని సేవగా నిరాడంబరంగా మనస్ఫూర్తిగా చేయాలి. అదే నిజమైన భక్తి.

-శ్రీష్టి శేషగిరి