మంచి మాట

గాయత్రి మంత్రము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాయత్రీ మంత్రము విశిష్టతను ఉపనిషత్తులు, బ్రాహ్మణాలు ఎంతగానో చాటుతున్నాయి. గాయత్రీ మంత్రము మనకు ఋగ్యజుస్సామ వేదాలలో లభ్యమగుచున్నది. సృష్టిలో అన్నింటికంటే మహోన్నతమైనది జ్ఞానం. జ్ఞానం చేతనే మనకు ముక్తి లభిస్తుంది. జ్ఞానాన్ముక్తిః కావున స్తుతి ప్రార్థనోపాసన మాత్రంగా గాయత్రీ ప్రాముఖ్యతను సంతరించుకున్నది.
‘గాయత్రీ’ అనగా గాయన్తం త్రాయతే ఇది గాయత్రీ’ (నిరుక్తం) ప్రతిదినము శ్రద్ధతో, ఏకాగ్రతతో గాయత్రీ మంత్రమును జపించినచో సర్వకాల సర్వావస్థలయందు అది మనలను రక్షించును. గాయత్రీ యందు రక్షణ శక్తి నిండి ఉన్నందువలన పరిపూర్ణ సుఖమునొందుదురు. స్ర్తి పురుషులు గాయత్రీ మంత్రం ద్వారా పరమాత్మను చేరగలరు. ఈ లోకాన్ని గాయత్రీ మాతయే రక్షిస్తున్నది. గాయత్రియే పృధ్వీ, భగవతియై మనలను కంటికి రెప్పలా కాపాడుతున్నది. వేయేల, గాయత్రి యందే ప్రపంచమంతా ప్రతిష్ఠితమై ఉన్నది.
పూలలోని మకరందం తేనెయైనట్లు పాలలోని పటుత్వం నేయి అయినట్లు, అన్నసారము రక్తమైనట్లు సర్వవేదముల సారము గాయత్రియే. కావున పాపనాశనియైన గాయత్రి వేదమాతయైనది. ఇది తెలిసికొన్నవారు జీవన్ముక్తులగుదురు. గాయత్రీ మంత్రము ధ్యానము చేయువారిని ఆ దేవి కాపాడుతుంది. అంతేకాదు గాయత్రీ జపము కోరికలన్నింటిని తీరుస్తుంది. మహాపురుషులైనవారు వారి అనుభవ సారముతో గాయత్రీ మహిమను ఎంతో చక్కగా విడమరచి వివరించారు. గాయత్రీ జపము భవ బంధములను త్రెంచి బ్రహ్మ సాయుజ్యమును చేకూర్చుతుంది. ఎందుకనగా గాయత్రీ మంత్ర పఠనముల భవ బంధములను ఛేదించి మోక్షమార్గాన్ని ఏర్పరచుతుంది. పాపాలు దూరమై దీర్ఘాయువు కలుగుతుంది. ఈ మంత్ర స్మరణతో మనకు విశిష్టమైన శక్తి కలిగి సద్బుద్ధి అలవడి ఆత్మకు తేజస్సు చేకూరుతుంది. గాయత్రీ జపమువలన సద్బుద్ధి అలవడి ఆత్మకు తేజస్సు చేకూరుతుంది. గాయత్రీ జపమువలన సమస్త సంకటములు మాయమై తపము, యోగము, సాధనము సిద్ధించి అనంతమైన శక్తి లభిస్తుంది.
మహాభారతములోని అనుశాసన పర్వంలో భీష్మ పితామహుడు ధర్మరాజునకు గాయత్రీ మహాత్మ్యాన్ని ఎంతో చక్కగా వివరిస్తాడు. యుధిష్ఠిరా! ఎవరు చిత్తశుద్ధితో గాయత్రీ జపం చేస్తారో వారికి సకల సంపదలు సమకూరుతాయి. దేశ విదేశాలలో కీర్తి ఇనుమడిస్తుంది. పంచభూతాలు, రాక్షసులు, యక్షులు, కినె్నరులు, గంధర్వులు వారికి ఎలాంటి హాని కలిగించరు. ఆలమందలో గాయత్రీ మంత్రాన్ని పఠిస్తే గోసంపద అభివృద్ధి చెందుతుంది. సర్పాలు, విషజంతువులు దూరంగా పారిపోతాయి. రఘు వంశ రాజులు, చంద్ర వంశరాజులు, సప్తఋషులు, ధృవుడు మొదలగు వారంతా గాయత్రీ మంత్రాన్ని జపించి ప్రశాంతతో కాలము గడిపి కీర్తినార్జించారు. అందుకే కృష్ణ్భగవానుడు భగవద్గీతలో ‘గాయత్రీ ఛందసామహమ్’ అన్నాడు. అంటే ఛందస్సులలో గాయత్రీ ఛందస్సును నేను అని విశదపరచాడు. ఋగ్‌యజుస్సామ మూడు వేదాలలోని గాయత్రీ మంత్ర మహిమ ఎంత గొప్పదో నాల్గ వేదమైన అధర్వణ వేదం తెలియజేస్తుంది. ఇది అనంతమైనదే కాక మహాశక్తివంతమైనది. సుసంపన్నమైనది.
గాయత్రీ మంత్రమును గురుమంత్రమని, సావిత్రీ మంత్రమనీ కూడా వ్యవహరిస్తారు. స్మరించేవారిని రక్షిస్తుంది. కనుక గాయత్రీ మంత్రమని సృష్టికర్తయైన పరమేశ్వరున్ని ఉపాసించుటకు ఉత్తమమైన మంత్రము గనుక సావిత్రీ మంత్రమని, సమస్త మానవ లోకానికి ఆ భగవంతుడే ప్రథమ గురువుగా నుండి మనము తరించు మార్గాన్ని చూపించుటకు ఉపదేశించిన మంత్రంగాబట్టి గురుమంత్రమైనది. మంత్రం చిన్నదైనా అర్థం అనంతం. గాయత్రీ మంత్రము ముఖ్యంగా మనకు జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ప్రపంచంలో జ్ఞానాన్ని మించిన వస్తువు మరొకటి లేదు. జ్ఞానంతోనే అన్నింటిని సంపాదించుకోగలుగుతాము.

- పెండెం శ్రీ్ధర్