మంచి మాట

ప్రదక్షిణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూమి సూర్యుని చుట్టూ ప్రదక్షిణ చేస్తుందని చరిత్ర చెప్తోంది. సూర్యుని చుట్టూ ఎన్నో గ్రహాలు నిత్యం ప్రదక్షిణం చేస్తూ, ఎంతో శక్తిని పుంజుకుంటున్నాయి. ఆలయంలోకి ప్రవేశించిన భక్తులు మొదటగా ఆచరించేది, ధ్వజస్తంభం నుంచి ఆలయం చుట్టూతా ప్రదక్షిణాలు చేయడం. రమణ మహర్షి మాటల్లో ప్రదక్షిణం అనే పదానికి ఒక అర్థం ఉంది. ‘ప్ర’ అనే అక్షరానికి అర్థం పాపాన్ని నాశనం చేసేది, ‘ద’ అంటే కోరికలు సఫలమవటం, ‘క్షి’ అనగా రాబోయే క్షయానికి, జన్మరాహిత్యానికి సూచన, ‘ణ’ అంటే అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ప్రసాదించే వరం అనే అర్థాన్ని చెప్పారు. కపిల సంహిత ‘ప్ర’ భయాన్ని తొలగిస్తుంది. ‘ద’ మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ‘క్షి’ అనారోగ్యాలను నివారిస్తుంది. ‘ణ’ సిరిసంపదలను కలిగిస్తుంది.
ప్రదక్షిణం చేయడమంటే హడావుడి పడకుండా నిదానంగా అడుగులు వేస్తూ భగవంతుని మనస్సులో ధ్యానం చేస్తూ, భక్తి భావాన్ని మనస్సులో నిలుపుకుంటూ ముందుకు నడవడం. ప్రదక్షిణా విధాలను ఐదు రకాలుగా తెలియజేసారు. 1.ఆత్మ ప్రదక్షిణ నమస్కారం 2.పాద ప్రదక్షిణం 3.దండప్రదక్షిణం 4.అంగ ప్రదక్షిణం 5.గిరి ప్రదక్షిణం. ఆత్మ ప్రదక్షిణం అంటే తన చుట్టూ తాను తిరగడం. పూజానంతరం భగవంతునికి ఆత్మ ప్రదక్షిణం చేసి నమస్కరిస్తారు. పాదాలతో ముందుకు నడుస్తూ చేసే ప్రదక్షిణాన్ని పాద ప్రదక్షిణం అంటారు. దండ ప్రణామములు చేస్తూ ఆచరించే ప్రదక్షిణం దండ ప్రదక్షిణమవుతుంది. శరీరంలోని అవయవాలు నేలకు తగులుతూ, గుడి చుట్టూతా తడి బట్టలతో దొర్లుతూ చేసే ప్రదక్షిణాలను అంగ ప్రదక్షిణం అంటారు. కొందరు భక్తులు ఈ రకమైన ప్రదక్షిణాలను ‘పొర్లు దండాలు’ అని కూడా అంటారు. కొండపైన దేవుడు ఉంటే, ఆ కొండ చుట్టూతా చేసే ప్రదక్షిణం గిరి ప్రదక్షిణమవుతుంది.
ఆలయంలో ధ్వజస్తంభం నుంచీ ఆరంభించిన ప్రదక్షిణాలు ధ్వజస్తంభం వద్దనే పూర్తవ్వాలి. ఒక్కొక్క భగవంతునికి కొన్ని సంఖ్యలతో ప్రదక్షిణాలు చేయవలసి వుంటుంది. నవగ్రహాలకు సాధారణంగా తొమ్మిది ప్రదక్షిణాలు చేస్తారు. అయితే, జాతకరీత్యా గ్రహదోషం ఉండి, దోష పరిహారం కోసం, ప్రత్యేకంగా ఆ గ్రహానికి పూజ చేయించి, ప్రదక్షిణాలు చేయవలసి వస్తే, ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క సంఖ్యలో ప్రదక్షిణాలు చేయవలసి ఉంటుంది. సూర్యునికి ఆరు ప్రదక్షిణాలు, కుజుడు, కేతువు గ్రహాలకు ఏడు, చంద్రునికి పది, గురువుకు పదహారు, బుధునికి పదిహేడు, రాహువుకు పద్ధెనిమిది, శనికి పంతొమ్మిది, శుక్రునకు ఇరవై ప్రదక్షిణాలు చేయవలసి ఉంటుంది.
లింగార్చన, చంద్రిక ప్రదక్షిణాలు గురించి తెలియచేయబడింది. అమ్మవారికి ఒక ప్రదక్షిణం, శివునికి మూడు ప్రదక్షిణాలు, గణపతికి మూడు, విష్ణుమూర్తికి నాలుగు, సూర్యునికి ఏడు ప్రదక్షిణాలు చేయాలని లింగార్చన చంద్రిక గ్రంథం ద్వారా తెలుస్తోంది. ఆగమ శాస్త్రం కూడా ప్రదక్షిణాల విషయంలో కొంత స్పష్టతగా తెలిపింది. వినాయకునికి ఒక్క ప్రదక్షిణం, ఆదిత్యునికి రెండు ప్రదక్షిణాలు, శివునికి మూడు, విష్ణువుకు నాలుగు ప్రదక్షిణాలు చేయాలని ఆగమ శాస్త్రం చెబుతోంది. విష్ణువు ఆలయంలో బేసి సంఖ్య కాకుండా సరి సంఖ్యలోనే ప్రదక్షిణాలు చేయాలి. బేసిసంఖ్యలో ప్రదక్షిణాలు చేయడం దోషంగా తెలుపబడింది. శివాలయంలో చండీ ప్రదక్షిణాలు చేస్తే, వాటిని ప్రత్యేకంగా చండీమాత ప్రదక్షిణాలుగా పేర్కొంటారు. కోవెలలో చేసే ప్రదక్షిణాలకు ఒక పరమార్థం ఉందని తెలుస్తోంది.
ప్రదక్షిణాలు చేయడం ద్వారా కర్మ నుంచి విముక్తి పొందవచ్చు. ఇతర విషయాలను మనస్సులోంచి తొలగించి, ఏకాగ్రతగా భగవంతుని రూపాన్ని మనస్సులో నిలుపుకుని, భక్తి భావాన్ని పెంపొందించుకునే చర్యే ప్రదక్షిణ. ప్రదక్షిణ కూడా భగవంతుని సేవలో, ఆరాధనలో ఒక భాగమే. భక్త్భివంతో, భగవంతుని స్మరిస్తూ, ప్రశాంత చిత్తంతో చేసే ప్రదక్షిణంవల్ల భగవంతుని కృపకు పాత్రులవుతారు.

- కె. నిర్మల