మంచి మాట

ముక్కోటి ఏకాదశి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏకాదశి విష్ణు వరప్రసాది. ప్రతిమాసంలో రెండు చొప్పున 24 లేక 26 ఏకాదశులు సంవత్సరంలో వస్తాయ. వాటిల్లో ప్రతి మాసంలో వచ్చే ఏకాదశి పవిత్రమైనా అత్యంత పవిత్రమైన ఏకాదశుల్లో పుష్యశుద్ధ ఏకాదశి ముక్కోటి ఏకాదశిగా ప్రాచుర్యం పొందిం ది. ఈ రోజున చేసే కార్యాలన్నీ విష్ణుప్రీత్యర్థం చేస్తే వేలకోట్ల పుణ్యరాశులు సొంతం అవుతాయ. వైకుంఠద్వారంలో మహావిష్ణువు దర్శనార్ధం ముక్కోటిమంది దేవీ దేవతలు వస్తారు. కనుక వైకుంఠ ద్వారం దగ్గర మానవులూ మహావిష్ణువు దర్శనభాగ్యంతో పాటు వారి దర్శనంకోసం ఎదురుచూస్తారు.
విష్ణువుకు అత్యంత ప్రీతికరమైంది తులసి. కనుక తులసీమాలలతో విష్ణువును అలంకరిస్తారు. జాజిపూల ప్రియుడని తలచి మహావిష్ణువుకు సుమధుర భరితమైన జాజిపూలతోనూ అలంకరణ చేస్తారు. తిరుపతిలో కలియుగదైవమైన్ర శియఃపతికి, భద్రాదిలో సీతారాముడికి, శ్రీరంగంలో రుక్మిణీసహిత పాండురంగడితోపాటు గా ప్రతి వైష్ణవాలయాల్లో ఉత్తర ద్వారదర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. విల్లిపుత్తూరు లోని ఆండాళ్ అమ్మవారి ఆలయంలోను ప్రత్యేక పూజలు చేస్తారు.
మురాసురసంహారం చేసిన మహావిష్ణువు పేర విష్ణ్భుక్తులు ఉపవాసం చేస్తారు. ప్రతి ఏకాదశి నాడు ఉపవాసం చేసి విష్ణుకథలను వినడం ఆచారంగా వస్తోంది. ఏకాదశీ ప్రాముఖ్యాన్ని పరమ శివుడు పార్వతీ దేవికి వివరించాడని పద్మ పురాణం చెప్తుంది. మహాభక్తులైన అంబరీషాదులు, రుక్మాంగద మహారాజులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించారు. వారే కాక వారి రాజ్యపౌరులందరి చేత కూడా ఏకాదశిని ఆచరింప చేసారు. ఏకాదశి మహత్వం వల్ల దుర్వాస మహాముని అంతటి వాడే అంబరీషుని రక్షించమని అడిగాడు. ఏకాదశీవ్రతాచరణులు మహావిష్ణువుతో సమానులని అంటారు.
ఈ ఏకాదశిని ‘మోక్షైకాదశి’ అనీ, ‘హరివాసరం’, ‘హరిదినం’ అనీ కూడా పేర్లు పెట్టారు. ఈ ఏకాదశీవ్రతాచరణ మూడు కోట్ల ఏకాదశీ వ్రతాలతో సమానమని పురాణా లు చెప్తున్నాయ. ఈరోజున ఉపవాసం చేసి మరునాడు ద్వాదశి ఘడియల్లో ‘పారణ’ చేసి వ్రతాన్ని ముగించటం ఆచారం. ఆ తరువాత శక్తికొలది ఒక బ్రాహ్మణుడికి భోజనం పెట్టి, దక్షిణ తాంబూలాలతో సత్కరించడమూ సంప్రదాయమే.
ఈ రోజున చేసే దానాలు విశేషపుణ్యఫలాన్ని ఇస్తాయని అంటారు. ఒకానొక కాలంలో భద్రావతీ రాజ్యాన్ని సుకేతుడు పరిపాలించేవాడు. ఆయన భార్య చంపక వీరు సత్కాలక్షేపంతోను పుణ్యకార్యాచరణతో పుణ్యదంపతులుగా కీర్తి పొందారు. కాని వీరికి సంతాన భాగ్యం కలుగలేదు. దానికోసం వీరిద్దరూ అనేక పుణ్యక్షేత్రాలను, తీర్థాలను దర్శించి సేవించారు. వారు ఎందరో ఋషివరేణ్యులను ఆశ్రయించి, ఏ నోము, ఏ వ్రతము ఆచరిస్తే సంతానయోగం కలుగుతుందో చెప్పుమని వేడుకునేవారు. ఒకసారి ఓ ఋషిపుంగవుడు ముక్కోటి ఏకాదశీవ్రతాన్ని ఆచరిస్తే, తప్పకుండా పుత్రులు కలుగుతారనిచెప్పాడు. దానితో వారు ప్రతి ఏకాదశి రోజు విష్ణువు పూజ చేస్తూ ఉపవాసం ఉండేవారు. ముక్కోటి ఏకాదశినాడు ఎంతో భక్తిశ్రద్ధలతో ఏకాదశీవ్రతాన్ని ఆచరించారు. వారికి లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో పుత్రుడిని పొందారు. కనుకనే ఈ ముక్కోటి ఏకాదశిని ‘పుత్రైకాదశి’ అని కూడా అంటారు.
మనలో ఉన్న అజ్ఞానమనే తలుపులను మూసివేసి జ్ఞానమనే తలుపును తెరిచి పరబ్రహ్మను దర్శనం చేసుకోవాలన్నది ఈ వైకుంఠ ఏకాదశిలోని అంతరార్థం. విష్ణుచిత్తుని కుమార్తె గోదా ఆలపించిన తిరుప్పావై పాశురాలతో నిత్య సంతోషిగా ఉన్న స్వామిని పెళ్లికొడుకుగా భావించి వివిధ పుష్పాలతో పూజచేస్తారు. భోగి పండుగ నాడు నిత్యకల్యాణోత్సవం జరుపుకునే స్వామిని అమ్మవార్లను ప్రత్యే కంగా అలంకరించి వివాహమహోత్సవాన్ని జరుపుతారు. ఆ రంగని వివాహం చూడడానికి రెండు కళ్లూ చాలవంటారు. మాలదాసరి ఆలపించిన కైశకి రాగంతోను, తిరుప్పావై పాశురాలతో తన్మయం చెందే స్వామిని వాటిని మరలా మరలా అనుసంధానిస్తూ స్వామిని సంతోషింపచేసి భక్తులంతా ఆనందిస్తారు.

- చోడిశెట్టి శ్రీనివాసరావు