మంచి మాట

చైతన్య స్వరూపిణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ శక్తినే వివిధ రూపాల్లో, విభిన్న నామాల్లో దర్శిస్తాం.. పూజిస్తాం. ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క శక్తి ఉంది. చైతన్య స్వరూపంగా , జ్ఞానజ్యోతిగా ప్రకాశించినప్పుడు సరస్వతీదేవిగా పిలుస్తాం, ఆరాధిస్తాం, ఉపాసిస్తాం.
ఉపాసనా విధానంలో ప్రత్యేకత ఏమంటే, ఏ దేవతను అధిష్ఠాత్రిగా చేసుకుని, అభీష్టంగా ఉపాసిస్తున్నామో ఆ దేవతలోనే పరాశక్తి అంశలైన ఇతర దేవతలందరూ అంతర్లీనంగా ఉంటారు. ఆ విధంగా అన్వయం చేసుకుంటే సరస్వతి సర్వదేవతా స్వరూపం. మన దేశంలో అందరూ అందుకనే సరస్వతీదేవిని ఆరాధిస్తారు.జ్ఞానం, విద్య, వాక్కు మొదలుగా బుద్ధికి సంబంధించిన శక్తుల స్వరూపమే సరస్వతి. జ్ఞానం, విద్య ద్వారానే సంపద లభిస్తుంది.
ఒకప్పుడు లక్ష్మికి, సరస్వతికి నారదుడు పెట్టిన పరీక్షలో సరస్వతి విజయం సాధించిందని పురాణ కథనం. సంపదకు, దాని సద్వినియోగానికి బుద్ధి శక్తి అవశ్యం. ఆ శక్తికి మూలం సరస్వతి.
దేవీ భాగవతంలో వేదవ్యాసులు ‘‘మేధ, ఆలోచన, ధారణ, స్మృతి, ప్రజ్ఞ, ప్రతిభ వంటి ధీశక్తుల స్వరూపమే శారదగా సరస్వతి దర్శనమిస్తుంది. శే్వత పద్మదాసినియైన సరస్వతిని అందుకనే ‘శారద’ అన్నారు. వ్యాసులు నుడివిన ఈ స్తోత్రం గాయత్రీ మంత్ర భావం. సరస్వతిని ఈ స్తోత్రంతో ఉపాసిస్తే గాయత్రీ మంత్రాన్ని ఉపాసించగా వచ్చే ఫలం ప్రాప్తిస్తుందనడంలో సందేహం లేదు. సర్వులూ ఉపదేశం పొందనవసరం లేకుండా ఇలా సరస్వతిని ఉపాసించవచ్చు.
సరస్వతీ వైభవాన్ని వేదం ఎంతగానో ప్రస్తుతించింది. ‘ప్రాణ శక్తిః సరస్వతీ’ అని నిర్వచించింది. ఆత్మజ్యోతి ప్రకాశమే ప్రాణం. ప్రాణం మన నర నరాల్లోనూ ప్రసరిస్తున్నది. ఈ శక్తియే సరస్వతి. ఋగ్వేదం- సరస్వతీదేవిని ప్రస్తుతిస్తూ- అమ్మలలో, దేవతలలో, నదులలో శ్రేష్ఠురాలు. అంతేకాదు అన్న ప్రదాయినిగా, ధనప్రదాయినిగా సరస్వతిని శ్లాఘించింది.
సరస్వతీ సూక్తం సర్వాభీష్టాలను పిదికి ఇచ్చే దివ్యధేనువుగా దర్శింపజేసింది. ఆ కారణంగా సరస్వతిని వాగ్దేనువు, వాగ్దేవి అన్నారు. వాక్కే సర్వమునకు కారణం. జ్ఞాన సారం వాక్కు. వాక్కు జ్ఞానవాసినిగా ప్రవహించే దేవి వాగ్దేవి- సరస్వతి. విద్యలన్నీ వాగ్రూపాలే. వాక్కు మనిషికి అలంకారం.
వాక్కు ద్వారానే ప్రపంచం మనుగడ సాగిస్తున్నది. మనుషులను తరింపజేసేదే వాక్కు. ‘వాగ్భూషణం భూషణమే’ అను నానుడి అలా వచ్చిందే! జ్ఞానము, విద్యలకు పుట్టినిల్లు భారతదేశం. భారతి పేరునే తనలో నిలుపుకుంది. భారతి అంటే, ‘్భ’- జానము, రతాన్- ఇష్టముగా భావించేవారు భారతీయులు. అట్టివారు నివసిస్తున్న దేశం భారతదేశం.
ఇక అమ్మ రూపాన్ని చూస్తే స్ఫటికంలా తెల్లనిది. స్వచ్ఛమైనది. రూపమే కాదు ఆమె తెల్లని కలువపై ఆశీనురాలు. వాహనం హంస. శుద్ధమైన తెల్లని వర్ణం. ఆదిపరాశక్తి, ముగురమ్మలకు మూలపుటమ్మ. సరస్వతి వైభవాన్ని చండీ సప్తశతి అత్యద్భుతంగా వర్ణించింది. అమ్మ బుద్ధి, స్మృతి, భ్రాంతి, వృత్తి- ఇలా ఎన్నో శక్తులను తనలో నింపుకుని అసురీ శక్తులను నిర్జించడానికి, విజయం సాధించి లోకాలను రక్షించడానికి ఉద్యుక్తురాలైంది. మూలానక్షత్రం సరస్వతి జన్మ నక్షత్రం.
‘‘తల్లీ! సమస్త శాస్తమ్రుల సారము నీవు. మేధవు నీవు. సమస్త విద్యలు నీవు’’ అన్నారు వాల్మీకి వ్యాసాదులు. మంత్రశాస్త్రంలో సరస్వతిని అనేక రూపాలలో ఉపాసించడానికి వీలుగా ఆయా నామాలను పేర్కొన్నారు.
సరస్వతీ వైభవం అనంతం. స్మరణ మాత్రం చేత తరించగలం. శుద్ధ ధవళ కాంతులకు ప్రతీకయైన సత్వగుణానికి, శే్వత హంస వాహినియై, బుద్ధికి, సకల విద్యలకి అధిష్ఠాత్రియైన సరస్వతీమాతకు మనసా వాచా కర్మణా ఆరాధించి అనుగ్రహం పొందుదాం.

- ఎ.సీతారామారావు