సంక్రాంతి వెలుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జ్యోతిషశాస్త్రం ప్రకారం సూర్యుడు మకరరాశిలోనికి పరివర్తనం చెందే రోజు సంక్రాంతి. మకర సంక్రమణం అని కూడా అంటారు. ఆ రోజు నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. సంవత్సరంలో ఆరు నెలలు ఉత్తరాయణంగా, ఆరు నెలలు దక్షిణాయనంగా మన పెద్దలు విభాగం చేశారు. సంస్కృతీ సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం సంక్రాంతి. మకర రాశిలో సూర్యుని ప్రవేశంతో పండుగ ప్రారంభమైన ఈ పండుగ ముచ్చటగా మూడు రోజులు సాగుతుంది. తొలిరోజు రంగ నాయకుల మెప్పు పొంది భోగములందిన గోదాదేవి స్మరించుకుని ఇహలోకంలో భోగాలను ప్రసాదించమని వేడుకొనే భోగి, ఈరోజు సంక్రాంతి, ఇక రేపు మూడవ రోజు పశువుల పండుగ కనుమ. సంక్రాంతి మూడుదినాలలో బొమ్మల కొలువులను తీర్చుస్తారు. కొత్త అల్లుళ్ళను, కూతుర్లను ఇంటికి పిలిచి ఆనందంగా పిండి వంటలతో భోజనాలను ఆరగిస్తారు
రైతన్నలకు వ్యవసాయపనుల్లో సాయపడిన పశువులకు కొత్తపంటతో వండిన పొంగళ్లనుపెట్టి కొమ్ములకు రంగులు పూసి ఉత్సవాలు చేసే పండుగే కనుమ. ఈ పండుగకు నెలముందునుంచి వాకిళ్లల్లో రంగవల్లులు తీర్చడం తెలుగునాట ప్రత్యేకత. భారతదేశం అంతా సంక్రాంతిని జరుపుకున్నా ముఖ్యంగా తెలుగురాష్ట్రాల్లో పంటలు ఇంటికి వచ్చిన శుభవేళను పురస్కరించుకుని సంక్రాంతిని విశేషంగా జరుపుకుంటారు.
స్ర్తిలు సావిత్రి గౌరీవ్రతం చేస్తారు. సంక్రాంతినాడు నువ్వులు బియ్యం కలిపి శివుణ్ణి అభిషేకిస్తారు. సంక్రాంతి రోజున శివునికి నువ్వుల నూనెతో దీపం పెడితే శని దోషాలు తొలగిపోతాయని పురాణవచనం. స్ర్తిలందరూ పండు తాంబూలాలను పంచుకుని సంతోషంగా సంక్రాంతిని సంభావిస్తే తనతో పాటు వ్యవసాయం చేయడంలో తమ తోడ్పాటు అందించిన కర్మచారులైన వారిని, జానపద కళాకారులైన బుడుబుక్కలవాళ్ల పాటలు, దాసరుల వైష్ణవ సంకీర్తనలు, జంగందేవర శైవనామాలు, గంగిరెద్దుల వాళ్ల ఆట పాటలు, సన్నాయి మేళాలు వాయంచేవారిని - ఇలాంటివారినందరిని పిలిచి వారు పంచే జానపద సంపదను అందుకుంటూ తాను పండించిన పంటలో వారికి కొంత భాగాన్ని పంచుతూ వారిని గౌరవిస్తున్నారు. పిల్లలందరూ గాలిపటాలను ఎగురవేసి సంక్రాంతి పండుగను సంబరంగా జరుపుకుంటారు.
వ్యవసాయవృద్ధిలో తమకు చేదోడుగా వున్న పశుగణాన్ని పూజించే రోజు. పశువులను కడిగి అలంకరించి వాటిని పూజించి సాయంత్రంవేళ ఎడ్లబండ్లకు కట్టి ఊరు ఊరంతా తిప్పుతారు. దీన్ని బండ్లు తిప్పటం, పండుగ అని కూడా అంటారు. జాజు, సున్నం పట్టీల అలంకరణతో ఈ బండ్లు ఎంతో కన్నుల పండువుగా ఊరేగింపులో ఉంటాయ.
ఇంద్రునికి ప్రీతికలిగించేకార్యాలను, పితృదేవతలకు తర్పణాలు విడవడం, దానాలు చేయడం కూడా సంక్రాంతిరోజున చేయాల్సిన విధులుగా ధర్మశాస్త్రాలు చెబుతున్నాయ. శ్రీమద్భగవద్గీత పఠనం, గంగాస్నానం, త్రికాల గాయత్రి సంధ్యావందనం, గోవిందనామ స్మరణం చేయాల్సిన పనులుగా నిర్ణయసింధు, ధర్మసింధువులు చెప్తున్నాయ. తెలుగునాట అంతా నువ్వుల ఉండలను చేసి ఒకరికొకరు పంచు కోవడమూ ఆచారంగా వస్తోంది. ఇవే కాక ఈరోజున కూష్మాండం, కంబళి, ధాన్యాదులు, లోహాలు, వస్త్రాలు, తైలదీపదానాలు చేస్తే మంచిదని శాస్త్ర వచనం. బూడిద గుమ్మడికాయను దానంచేసిన వారికి భూదానం చేసిన ఫలం వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయ. పెరుగును దానం చేయడం వల్ల అనారోగ్యబాధలు తీరుతాయ. బుద్ధివికాసం కలుగుతుంది.
కుడిచేతిని చిన్ముద్రగా చేసుకుని శబరిమలైమీద వెలిసిన హరిహరపుత్రుడు స్వామి అయ్యప్ప జ్యోతిరూప దర్శనంకోసం లక్షలాదిమంది ఎదురుచూస్తుంటారు. దీక్షాధారణ చేసిన అయ్యప్పలందరూ శబరిమలై చేరి మకర విళక్కు (మకర పూజ)ను నిర్వర్తించి మకరజ్యోతి దర్శనం చేసుకోవడం సంక్రాంతి పండుగ మరో ప్రత్యేకత.

- చివుకుల రామమోహన్