మంచి మాట

దృష్టి శక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పశుపక్ష్యాదులకన్నా ఉత్కృష్టమయినది మానవజన్మ. మనిషికిగల సమీకృత శక్తిని ప్రాథమికంగా నాలుగు విధాలుగా విభజించవచ్చు. అవి- శారీరక (్భతిక) శక్తి, మానసిక శక్తి, బుద్ధిపరమైన / విజ్ఞానపు శక్తి మరియు ఆధ్యాత్మిక శక్తి. ఈ సమీకృత శక్తిని వెలుపలకు తీసుకొని రావడమన్నది ఏకీకృత / ఏకాగ్రత శక్తివలననే సాధ్యమవుతుంది. ఇక్కడ విజ్ఞానపు శక్తి ఇంద్రియాలచే నియంత్రించబడే మానసిక శక్తిని, శారీరక శక్తిని తన స్వాధీనంలో నియంత్రణలో ఉంచుకొంటుంది. మనసు తనలోపలకు రకరకాల ఆలోచనలను ప్రవేశింపచేస్తుంది. కానీ, వాటిలో ఏవి మంచివో, ఏవి కాదో విజ్ఞానపు / బుద్ధిశక్తి నిర్ణయించి, నియంత్రిస్తుంది. ఈ సందర్భంలో బుద్ధిశక్తి విచక్షణాశక్తిగా తన బాధ్యతను నిర్వహిస్తుంది. ఒక మనిషికి తెలివితేటలు ఎన్ని ఉన్నా, అతని బుద్ధి సరిగా లేకపోతే, అవి సమాజ విధ్వంస కారకాలవుతాయి. ఒక సమస్యకు పలు రకాల పరిష్కారాలుంటే, ఉత్తమమైనదానిని బుద్ధి నిర్ణయిస్తుంది.
ఈ విచక్షణా శక్తి దృఢంగా ఉన్నప్పుడు, మనిషి దృక్పథం సామాజిక హితంగా పరివర్తన చెందుతుంది. దృక్పథం అంటే, ఇక్కడ ఒక మనిషి యొక్క ఆలోచనాసరళి / మార్గంగా చెప్పుకోవచ్చు.
శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్లుగా మానవ దేహంలో శరీరావయవాలకన్నా ఇంద్రియాలు గొప్పవి. వాటికన్నా మనసు గొప్పది. ఆ మనసుకన్నా శ్రేష్ఠమైనది బుద్ధి. బుద్ధికన్నా పరమశ్రేష్ఠమయినది ఆధ్యాత్మి శక్తి. ఒక వ్యక్తిలో ఈ శక్తులన్నీ ఏకీకృతమయితే, ఆ వ్యక్తి దృక్పథము పరిపూర్ణతను సాధించినట్లే.
పురాణేతిహాసాలను పరిశీలిస్తే మనకు పరిపూర్ణ దృక్పథం కలిగిన మహాపురుషులు కొందరు గోచరిస్తారు. రామాయణంలో శ్రీరాముడు సురాజ్య పరిపాలనే ధ్యేయంగా ప్రజలను పరిపాలిస్తూ, ఒక అల్పుడైన రజకుని మాటకు కూడా విలువనిచ్చి, తన అర్థాంగి సీతా సాధ్వినే పరిత్యజించిన గొప్ప వ్యక్తి. శ్రీరాముని దృక్పథంలో ఎప్పుడూ ప్రజల బాగోగులే నిలుస్తాయి. రాగానురాగాలు, రాగబంధాలు ఆయన కర్తవ్య పాలనలో అవరోధాలను కల్పించలేదు. అట్లాగే, హను దృక్పథంలో శ్రీరామచంద్రుడే తన స్వామి. ఆ తరవాతే సుగ్రీవుడు. అందువలననే సీతానే్వషణ మొదలు రావణ సంహారం వరకూ శ్రీరామునికి నమ్మినబంటుగా ఉన్నాడు. యయాతికి అభయమిచ్చిన సందర్భంలో కూడా తన దృక్పథంలో శ్రీరాముడే తన యజమాని అనే భావించాడు.
ఈ సందర్భంలో విచిత్ర గణితాన్ని ప్రస్తావిస్తాను. ధన సంపదను పలువురి మధ్య పంచితే, అది తరుగుతుంది. కానీ జ్ఞానసంపదను పంచితే అది ఇనుమడిస్తుంది (అంటే వారితో చర్చించటంవల్ల మన జ్ఞాన సంపద వృద్ధి చెందుతుంది). మన సంతోషాన్ని నలుగురితో పంచుకొంటే, మన మనసు తేలికపడి మన సంతోషం ఎక్కువవుతుంది. మన విషాద, విచారాలను పలువురితో పంచుకుంటే మన దుఃఖ, విషాద, విచారాలు తగ్గిపోయి స్వాంతన లభిస్తుంది (తోటివారి సానుభూతివలన). ఇవన్నీ కూడా మానవ సంబంధాలలో ప్రస్ఫుటంగా పాత్ర పోషించే దృక్పథాలవల్లనే సాధ్యమవుతాయి.
మహాభారతంలో ద్రోణాచార్యులవారు కౌరవ, పాండవులకు విలువిద్య నేర్పే సందర్భంలో, అర్జునుడు కౌరవ, పాండవులకు విలువిద్య నేర్పే సందర్భంలో, అర్జునుడు సర్వ ప్రథముడిగా నిలుస్తాడు. ఎందుకంటే పక్షి కంటిని గురిచూసి బాణంతో కొట్టేటప్పుడు అతని దృక్పథంలో పక్షి కన్ను తప్ప, మిగిలిన వస్తువులు, పరిసరాలు కనబడవు. ఈ దృక్పథమే తన మిగిలిన సోదరులకంటే అర్జునుని మేటి విలుకాడిగా తీర్చిదిద్దినది.
పర స్ర్తి, పరదారా వ్యామోహమనే దృక్పథం కలిగిన రావణుడు, వాలి మొదలగువారికి దురవస్థ సంప్రాప్తించింది. కవి సార్వభౌముని దృక్పథం రాజభోగాలపై, కీర్తికాంతలవైపు మొగ్గి జీవితపు చరమాంకం విషాదాంతమయింది. సహజకవి భక్తిపోతన దృక్పథంలో రాజులకన్నా రాముడే మిన్న అన్న భావన నిండి, ఆయన జీవితం సాఫీగా గడిచిపోయింది.

- పొత్తూరి రాఘవేంద్రరావు