మంచి మాట

సాత్వికాహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సర్వ ప్రాణికోటి జీవనాధారం ఆహారమే! మనలోని ఆకలిని చల్లబరిచి, శరీరంతోపాటు పంచ ప్రాణాలకూ ఆధారమై, పంచభూతాల సాక్షిగా శక్తిని సమకూర్చే అన్నం సృష్టి యజ్ఞానికే ఆలంబన. ఈ ఆహారం వల్లనే మనిషిలో సత్వరాజస తామస గుణాలు ఏర్పడుతాయని అంటారు.
‘ఆహార శుద్ధౌ సత్త్వశుద్ధిః సత్త్వశుద్ధౌ ధ్రువాస్ముతికః’- అనే ప్రసిద్ధ వాక్యం జీవన క్రమాన్ని సూచిస్తుంది. మనం తీసుకునే ఆహారం పరిశుద్ధంగా ఉంటే సత్త్వంగుణం ఉదయస్తుంది. ఆ సత్వగుణం వల్ల బుద్ధిని, మనసునూ, జీవిత సరళినీ క్రమబద్ధీకరించి మానవ మనుగడను ఆనందమయం చేస్తుంది. ఆహారాన్ని బట్టే మన ఆలోచనలపర్వం మారతుంది. అందుకే ‘యథాఅన్నం తథా మనః’ అన్నారు పెద్దలు.
ఆహారం అపరిశుద్ధం అవడానికి మూడు రకాల దోషాలుఉపకరిస్తాయ.
ఈ దోషాల నుంచి ఆహారాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి.అట్లా కాపాడుకున్న ఆహారమే మనిషి సత్వగుణ సంపన్నుడుగా మారుస్తుంది. లేకపోతే రాజస తామస గుణాలకుదాసోహంమై పోతాడు. మానవుడు దానవుడుగా మారుతాడు. ఎన్నో జన్మల పుణ్యంగా లభించిన ఈ మనుష్య జన్మ వృథాగా కాల యాపన చేస్తాడు.
వాసన వలన తినే పదార్థం అపరిశుద్ధమవుతుంది. రెండవది ఆశ్రయ దోషం. ఈ ఆశ్రయ దోషం వలన అంటే చెడుమార్గంలో సంపాదించిన ధనం. అందుకే ఆతిథ్యం ఇచ్చినా, పుచ్చుకున్నా ధర్మంగా మెలగాలి. మూడవది నిమిత్తదోషం. అపరిశుభ్రత నిర్లక్షత వలన ఆహారం అపరిశుద్ధమవడం. ఈ మూడు దోషాలు లేని ఆహారమే శుద్ధమవుతుంది. అలా స్వీకరిస్తేనే సత్త్వం చేకూరుతుంది. ఆహారం అంటే శక్తినిచ్చే సంకల్పం. కనుక సంకల్పం పరిశుద్ధంగా ఉంటేనే మనస్సు సాత్వికమై ఉంటుంది. ‘పరిశుద్ధమైన ఆహారం’ అంటే ధర్మయుతంగా సంపాదించిన దానిల్లోంచి తిన్న ఆహారమే సత్వగుణుడుగా రూపొందిస్తుంది. దానం చేసినా అది న్యాయ మార్గంలో సంపాదించిన దానిలో నే చేస్తే పుణ్యం వస్తుంది. కాని పరులను దోచి అందులో భాగం భగవంతునికి ఇస్తే అది పుణ్యాన్ని కాదు పాపాన్ని ఒనగూరుస్తుంది.
మనుషులు మనసా, వాచా కర్మణా పరిశుద్ధులై ఆహార నియమాల్ని పాటిస్తూ పద్ధతిగా, ప్రణాళికాబద్ధంగా అన్నమనే సంకల్పాన్ని శరీరాలకందిస్తూ ఆరోగ్యవంతులై జీవించాలి. అన్నాన్ని ఎపుడూ తక్కువగా చూడకూడదు. అన్నమంటే ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అన్నది వేదం. కనుక అన్నాన్ని భగవంతుని రూపంగా ధ్యానించాలి. మనం తిన్నా ఇంకొకరి పెట్టినా అది భగవంతుని గా భావించాలి కాని ఎదో మనకు ఎక్కువైనదో లేక లేదనో అన్నాన్ని తక్కువచూపు చూడకూడదు. ‘కూటి కోసమే కోటి విద్యలు’ అనే లోకోక్తిలోని ఆంతర్యమూ కూడా అదే.
శ్రీకృష్ణుని జీవితాన్ని చూస్తే స్వామి పరబ్రహ్మ అయ ఉండికూడా గోపాలుడై గోవులను కాచడానికి ఇతర గోపాలురతో కలసి అడవి వెళ్తాడు. అపుడు వారు తెచ్చుకున్న చద్ది అన్నాన్ని అక్కడున్న కొలనులోని తామరాకుల లో పెట్టుకుని స్వామిని మధ్యన కూర్చోబెట్టుకుని గోపాలురంతా చుట్టూ తా కూర్చుని కృష్ణునికి పెడుతూ వారు అంతా తింటారు. కృష్ణుడు సైతం వారు పెట్టింది ఎంతో ప్రీతిగా తింటూ తాను సైతం వారికి తన చల్ది అన్నాన్ని పెడతాడు. వెన్నముద్దులు తినే ఈ చిన్ని పాపడు చల్దిని కుడుస్తున్నాడని నారదుడు చతుర్ముఖుని చెప్పగా పరబ్రహ్మ రేపల్లె లో పుట్టటం పైగా చద్దిని తినడమా అందులో ఎంగిలి తినడమా అని ఆశ్చర్యపోయ మరీ నారదునితో కలసి వచ్చి ఆ చల్ది తినే చందాన్ని కనులప్పగించి చూచాడట. తాను కూడా ఓ గోపాలునిగా మారి కృష్ణుని చేతి ముద్దలు తినాలని ఎంత గానో ఉవ్విళ్లూరాడట ఆబ్రహ్మ. కనుకనే అన్నం పరబ్రహ్మస్వరూపమని తెలుసుకొని ఆ అన్నాన్ని ఎంతో గౌరవంగా, శుచిగా తిని సత్వగుణులై మానుష జన్మను సార్థక్యం చేసుకోవాలి.

- నాగలక్ష్మి