మంచి మాట

గురుశిష్యుల సంబంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి వ్యక్తి, మాతృగర్భంనుండి బయటకు వచ్చి, నడక నేర్చుకొని మాటలు మాట్లాడడం మొదలుపెట్టిన తరువాత అతని జీవితంలో ప్రాధాన్యత కలిగియుండి, అతని భవిష్యత్‌కు దారులు వేసేది మహానుభావులయిన గురువులే.
‘గురుఃబ్రహ్మ గురుఃవిష్ణుః ...’ శ్లోకాన్ననుసరించి ప్రతి మనిషికి గురువే బ్రహ్మ, ఆయనే విష్ణువు, ఆయనే మహేశ్వరుడు. గురువే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడు. గురువు బోధనలు సక్రమంగా ఉండకపోతే విద్యార్థి దురలవాట్లపాలై, జీవితాన్ని నిరర్థకం చేసికొంటాడు.
విద్యార్థి తన బాధ్యతను అంటే గురువు దగ్గర బోధనలను సక్రమంగా నేర్చుకొని పాటించడం నిర్వహించాలి. అలాగే గురువు రాగద్వేషాలను విడనాడి విద్యార్థులందరికీ విద్యాబోధన చేయాలి. పూర్వం పురాణేతిహాసాలను పరిశీలించినట్లయితే పలు గురువులు, పలు శిష్యోత్తములు అగుపడతారు.
మహాభాగవత, భారత పురాణ కాలంలో సాందీపుని వద్ద శ్రీకృష్ణ బలరాములు, ద్రోణ, కృపాచార్యుల వద్ద కౌరవ పాండవులు విద్యార్థులుగా సకల విద్యలను అభ్యసించారు. ఆనాటి గురుకులాలలో రాజనీతి, పాలనా పద్ధతులు, వేదాలు, నైతిక విలువలు, ఆర్థికాంశాలు, పురాణ పఠనాలు- ఈ అంశాలపై గురువులు శిష్యులకు విద్యాబోధన చేసి వారిని సరైన మార్గంలో నడిపే సుమార్గదర్శకులయినారు.
గురుశిష్యుల సంబంధం రెండు వైపుల పదునుగల ఖడ్గము వంటిది. గురువు నిస్వార్థంతో ప్రతిఫలాపేక్ష లేకుండా బోధన చెయ్యాలి. శిష్యుడు అన్ని విద్యాపరమైన అంశాలతో ప్రావీణత్యను పొందటానికి నిరంతరకృషి చెయ్యాలి.
చారిత్రక నేపథ్యంలో చాణక్యుని బోధనలతో ఉత్తేజితుడయిన చంద్రగుప్తడు, మహానందులను పరాజితులనుగా చేసి తన సామ్రాజ్యాన్ని విస్తరించి ప్రజారంజకంగా పరిపాలన సాగించాడు. తన మాతృమూర్తినే మరొక గురువుగా స్వీకరించిన ఛత్రపతి శివాజీ, మిగిలిన గురువులు చేసిన బోధనలను ఆకళింపు చేసుకొని, ఔరంగజేబు మొదలైన పరదేశపు దుండగీడులను తరిమికొట్టి మాతృభూమి ఋణం తీర్చుకొన్నాడు.
శ్రీరామ, లక్ష్మణులను తనతో తీసుకొని వెళ్లిన విశ్వామిత్రుడు, వారికి దివ్యాస్త్ర ప్రయోగ పద్ధతులను వివరించి వారి ద్వారా తాటకి, సుబాహు వంటి దుర్మార్గులనంతమొందించాడు. ఇక్కడ లక్ష్యసాధనే పరమావధిగా శ్రీరామలక్ష్మణులు గురువైన విశ్వామిత్రుని మన్ననలందుకొన్నారు.
రామకృష్ణ పరమహంస హిందూ మతోద్ధారణకై ఎంతో కృషి చేసి ఎందరో శిష్యులకు మార్గదర్శనం గావించారు. వారిలో ఒకరైన నరేంద్రుడు (వివేకానందుడు) ఖండాంతరాలలోకి వెళ్లి, అక్కడ మన హిందూ ధర్మం గురించి ఎన్నో ఉపన్యాసాలిచ్చి గురువుకు తగ్గ మేలిమి శిష్యుడనిపించుకున్నాడు.
మృతసంజీవని విద్య ద్వారా రాక్షసులకు చావు లేకుండా చూస్తున్న శుక్రాచార్యులవల్ల ఖిన్నులైన దేవతలు కచుడిని ఆయన వద్దకు విద్యార్థిగా, శిష్యుడుగా దేవతలు పంపుతారు. కచుడు తన బుద్ధికుశలతతో, సత్ప్రవర్తనతో గురువు మన్ననలు పొందుతాడు. కానీ తోటి విద్యార్థులైన అసురల ఈర్ష్యాసూయలకు బలై శుక్రాచార్యుని కడుపులోకి చేరతాడు. అక్కడే మృతసంజీవనిని గురువు ద్వారా నేర్చుకొని బయటపడతాడు. దివికేగి, దేవతలకు ఆనందం కలిగిస్తాడు. ఇక్కడ గురుశిష్యుల సంబంధం ప్రేమానురాగాలతో కూడుకొన్నది. భీష్ముడు పరశురాముని వద్ద శుశ్రూష చేసి, విలువిద్యలో ఎంతో ప్రావీణ్యం సంపాదిస్తాడు. ఆ తదనంతర పరిణామాలలో అంబను విడువుమన్న పరశురాముని ఆజ్ఞను పాటించక గురువుతోనే యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధంలో గెలిచి గురువును మించిన శిష్యుడనిపించుకొన్నాడు.

- పొత్తూరి రాఘవేంద్రరావు