మంచి మాట

చతుర్విధ ధర్మాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

84లక్షల జీవరాశుల్లో దుర్లభమైనది, సువర్ణ అవకాశమే మానవ జన్మ. అవకాశం, సువర్ణం అనేది ఎరగనంతగా బంగారం భాగ్యాల వెంట పరుగులు పెట్టడానికే మొగ్గుచూపడం జరుగుతోంది.
ధర్మార్థ కామ మోక్షాలు మానవులు ఆచరించవలసిన చతుర్విధ పురుషార్థాలని మానవ ధర్మాలలో చెప్పడం జరిగింది. ధర్మం, మోక్షం సంగతి దేవుడెరుగు. ఆ రెండు కంటికి కనపడేవి కావు. కొత్త జన్మల కోసం అటువంటపుడు కనపడేది జీవిస్తున్నది ప్రస్తుత జన్మ.
అందుకే మనిషిగా అర్థాన్ని సంపాదించడం ముఖ్యం అనుకోవడం. కామం అనే దానికి రెండర్థాలు. కోరిక అన్నిటిమీద కావాలనేది స్ర్తి, పురుషుల మధ్య ఉండే సంబంధం. రెండవది కామంగా, కామం అర్థంలో కోరిక ప్రధానంగా చెప్పడం జరుగుతోంది. అర్థం ఉన్నా లేకపోయినా కోరికలకు మనిషికి లోటు లేదు.
ఒకటి తీరితే మరొకటి- ఇంకా చెప్పాలంటే ఒకటి తీరకుండానే మరొకటి మనసులోనో, మతిలోనో ఉంటుంది. మనిషికి లక్ష కోరికలు తీర్చుకున్నా మరే కోరికలు లేవు. అన్నీ తీరి స్థిరపడ్డాననుకునేలోపే లక్షా ఒకటో కోరిక పుడుతూ ఉంటుంది.
మొదటిది ధర్మం, మానవ జన్మ తరించడానికి జన్మ రాహిత్యానికి, జన్మలు సుకృతం కావడానికి ధర్మాన్ని కలిగి ప్రవర్తించడం జరగాలి. ‘్ధర్మో రక్షతి రక్షితః’- ధర్మాన్ని రక్షించు, ఆ ధర్మం నిన్ను రక్షిస్తుందని సూక్తి ఉండనే ఉంది.
ధర్మానికి అవతారమెత్తి మరీ మనుష్యులమైన మనకు ధర్మప్రవర్తన గూర్చి తెలియచేశారు శ్రీరామచంద్రులు. అందుకే రామో విగ్రహవాన్ ధర్మః అని కీర్తించబడ్డారు.
ధర్మాన్ని నియమించేది, నియంత్రించేది యమధర్మరాజు. సమవర్తి అందరిని ఒకేరకంగా చూడగల ధర్మదృష్టి కలవారు.
ప్రతి మనిషికి వ్యక్తిగత ధర్మం, సమాజ ధర్మం అని ఉంటూంటాయి. వాటిని తప్పనిసరిగా పాటించగలగాలి. అర్థం రెండవ పురుషార్థం. మనిషి జీవనానికి తప్పనిసరైనది. అర్థం ఎంత అవసరమో మనిషిని మాయామోహితుని చేసేది కూడా అర్థమే. అర్థార్జన ధర్మం తప్పి ఉంటే అది వినాశనమే.
అర్థం ధర్మమార్గంలో సంపాదిస్తూనే తనకు, ఇతరులకు వినియోగపడేలా చూసుకోవాలే కాని, తరాలవారికి దాచడానికి కాదు. అసలే నిలకడలేని ధనలక్ష్మి ఒక్కచోట ఎలానూ ఉండదు. ఆ మాత్రం దానికి విపరీతంగా అక్రమార్జన ఏల?
పరద్రవ్యాపహరణం, మానుషధర్మం కాదు. పరదారాపహరణంతో రావణాసురుడు తన నాశనం తానే తెచ్చుకున్నాడు. పరద్రవ్యం అలాంటి వినాశనకారే!
కామం మూడవ పురుషార్థం. కామం అంటే ముఖ్యంగా కోరిక అన అర్థం. ఏది కావాలనుకునే ప్రతిదీ కోరికే.
కామం అగ్నివంటిది. అది ఎన్నటికీ చల్లారదు. జ్ఞానులకు అది నిత్య వైరి. కామం మనుష్యులను జ్ఞానం వైపు వెళ్ళనీయదు. ఇంద్రియములు, మనసు, బుద్ధి ఈ కామమునకు నివాసస్థానములు. కామం మనుష్యులను మోహితులుగా చేస్తుంది. ధర్మానికి విరుద్ధం కాని కామమే తృతీయ పురుషార్థం.
నాలుగవది మానవులకు అత్యవసరమైనది మోక్షం. జన్మబంధాలనుండి జీవి విడుదల కావడానికి అత్యవసరం. అది కేవలం మనుష్య జన్మలోనే ప్రయత్నం చేయగల అవకాశం దొరికేది.
మోక్షం గురించి హిందూమతంలో ద్వైత, అద్వైత, విశిష్టాద్వైతం అంటూ మహానుభావులు చెప్పియున్నారు. ఆ విధంగానే వైష్ణవ, శైవ మతస్థులు కూడా తమదైన నీతిలో చెప్పియున్నారు.
భగద్గీతలో కృష్ణ్భగవానుడు మోక్షం గూర్చి తనను జీవులు చేరుట, మరల పునర్జన్మలో పడకుండుటను గూర్చి అత్యంత విపులంగా విశదంగా వివరించి యున్నారు.
సమస్త ప్రాణుల ఉత్పత్తి, వినాశనం రెండూ పరమేశ్వరునివలననే సంభవించును. సమస్త జగత్‌నందును అతడు వ్యాపించి యున్నాడు. అట్టి పరమేశ్వరుని స్వాభావిక కర్మల ద్వారా పూజించి మానవుడు పరమ సిద్ధిని పొందగలడు.
మంచు నీటితో వ్యాప్తమైనట్లు సమస్త విశ్వం ఏమి చెప్పినా, ఆనంద స్వరూపుడు తేజోరాశి అయిన ఆ పరమాత్మలో లీనమయ్యే స్థితియే మోక్షమని జ్ఞానులు చెప్తారు.్ధర్మాన్ని రక్షించు, ఆ ధర్మం నిన్ను రక్షిస్తుందని సూక్తి ని మనసున నిలుపుకుని జీవనయానాన్ని సాగించాలి. ఆ ధర్మమే సత్యమే నిన్ను భగవంతునికి దగ్గరగా చేరుస్తుంది.

-జి.కృష్ణకుమారి