మంచి మాట

ధర్మ దేవత-్భగవద్గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మ సంస్థాపనకు శ్రీరాముడికి పద్నాలుగు ఏళ్లు పట్టింది. దుష్ట బుద్ధితో కైకేయి కోరిన కోరికలు అధర్మానికి సాక్షి అయింది. ఈ పద్నాలుగేళ్ల కాలంలో ఎంతో కథ సాగింది. ధర్మం ఆచరించగానే ఫలితం వెంటనే వస్తుందని లేదు. విత్తనం నాటిన వెంటనే పంట చేతికి రానట్టు న్యాయం, ధర్మం, సమతుల్యంలో రావడానికి కొంత కాలం తీసుకుంటుంది. న్యాయం మనుషులు సృష్టించింది. ధర్మం సనాతనం. రుషి ప్రోక్తం. ధర్మానికి కాలం, కర్మం కలిసి రావాలి.
రావణుడికి తెలియని ధర్మమంటూ ఏమీ లేదు. కానీ మూర్ఖుడు. ధర్మం ఆచరించలేని అవివేకి. రాముడు వివేకి, జ్ఞానవంతుడు. వేద పారంగతుడు. ఆచరించి చూపే ఆదర్శవంతుడు. అందుకే రామాయణం నేటి వరకు నిలిచింది. రామాయణ కాలం ముందున్న సంఘర్షణ, రావణ వధతో సమాప్తం కాలేదు. అధర్మాన్ని శిక్షించి, ధర్మమార్గాన్ని నిర్వచించడమే రాముని చరిత్ర.
రాముని చరిత్ర ఒక అద్భుత సందేశం. శ్రీరాముని నిత్యం తలచుకుంటూ రామనామం జపిస్తూ ఒకరినొకరు హింసించుకోవడం మానసేరట అయోధ్యవాసులు. వేల సంవత్సరాల తర్వాత కూడా రామచంద్రమూర్తి కథ మనమెందుకు చెప్పుకోవాలన్న ప్రశ్నకు రామాయణమమనే పేరులోనే సమాధానం దొరుకుతుంది. రామ+ఆయనం అంటే ఇది రామాయణ మార్గం సూచిస్తుంది. ధర్మం కోసం ఆలు బిడ్డలను, బంధువులను పరివారాన్ని మిత్రులను ఎవరైనా అతనికి ధర్మ పరిపాలన తరువాతనే వుంటుంది.
పశుప్రాయమైన స్థాయినుంచి పరిపక్వత చెందిన మానవీయ స్థాయికి మనిషిని తీర్చిదిద్దన మహోన్నత గ్రంథం రామాయణం. కేవలం భారతదేశానికే కాదు, యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేసిన గ్రంథం. గాయత్రీప్రోక్తమయిన శ్లోకాలతో నిండిన రామాయణం. రామచంద్రమూర్తి పాటించిన ధర్మ మార్గమే మనకు సదా శ్రీరామరక్ష.
వాల్మీకి రామాయణం రాయాలని రాయలేదు. అతనికి అనుమానమైన 16 సుగుణాలు కలిగిన ఈ సృష్టిలో నా దృష్టిలో ఎవరైనా కనిపించాడా? అని నారదులవారిని అడిగాడు. దానికతడుచెప్పిన 16 సుగుణాలు సత్యమేనా యని మహర్షి అంతర్థుడైనాడు. రామాయణ గ్రంథాన్ని రచించాడు. రచనకు ముందు నారద మహర్షి బ్రహ్మరూపంలో కనిపించి గ్రంథ రచనకు తోడ్పడతాడు. ప్రతిపాదించాడు. వేదముచే ప్రతిపాదించినవాడు శ్రీరాముడు. వేదమే రామాయణం. వేదమే ధర్మంతో కూడి వుంటుంది. ధర్మం ఆచరించలేని వాడు అర్ధం చేసుకోలేనివాడు రామాయణం చదివి రాముడి నడవడి నేర్చుకుంటే చాలు. ధర్మము, కర్ణుడి కవచకుండలాల వంటిది. నివురు గప్పిన నిప్పలాంటిది. ధర్మం కనిపించదు. సత్యం వినిపించదు.
అధర్మపరుడైన కర్ణుడి వద్ద ధర్మరూపమైన కవచ కుండలాలు వుండకూడదని వాటిని వాడినుండి శ్రీకృష్ణపరమాత్మ తొలగించి వాడిని కోరలు తీసిన పాములా చేసాడు. బుసలు కొట్టడమే కానీ, వాడికి ధర్మం పనిచేయదు. అస్త్ర శస్తమ్రులు ఉపయోగపడవు. రామరావణ యుద్ధం ముగిసిన తర్వాత రాముడు అయోధ్యకు ప్రయాణమవుతాడు. ఆంజనేయుడ్ని భరతుని వద్దకు పంపుతాడు. ఈ పద్నాలుగేండ్లు తరువాత భరతునిలోఏమైనా స్వార్ధం పెరిగి, రాజ్యం పరిపాలిస్తాడేమో తెలుసుకుని రమ్మని పంపిస్తాడు. మానవ సహజమైన మనసు క్షణంలో మార్పు రావచ్చని తెలియజేస్తూ అతనివద్దకు పంపిస్తాడు. కానీ హనుమంతుడికి అక్కడ అటువంటి సన్నవేశం చూడలేదు. భరతుడు రాముని రాకకై ఆకాశం వంక చూస్తూ నిరీక్షిస్తున్నాడు. అతని ముందు అగ్నిహోత్రం వెలుగుచున్నది. క్షణం ఆలస్యమైతే అగ్నిప్రవేశం చేయుటకు చూస్తున్నాడు. ఇంతలో హనుమంతుడు ఆకాశమార్గాన భరతునికి కనిపించాడు. రాముని యోగక్షేమాలు సీతారాముల రాకను తెలియజేసాడు. హనుమంతుడు తెచ్చిన శుభవార్తకు అతన్ని ఆలింగనం చేసుకుని సంతోషపరిచాడు. రామాయణంలో ఎక్కడ చూసినా ఏ పాత్రలో వెతికినా ధర్మం తప్పని వారే కనిపిస్తారు. అందుకే రామాయణం నేటి వరకు ప్రవచనం చేయబడుచున్నది.

- జమలాపురం ప్రసాదరావు