మంచి మాట

విద్య ఒక తపస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశం ధర్మప్రధానమైన దేశం. శాంతి సౌఖ్యాలు వర్థిల్లాలంటే ధర్మాచరణ ఎంతైనా అవసరం. ధర్మాచరణకు సత్యవచనం ప్రామాణికమైనదని శాస్తవ్రచనం. అందువలననే చతుర్విధ పురుషార్థాలలో (్ధర్మార్థ కామ మోక్షాలు) ధర్మానికి ప్రధమ స్థానం ఇవ్వబడింది. ధర్మాచరణకు మంచి విద్య అనివార్యం. విద్య జ్ఞానాన్ని కలిగిస్తుంది. అజ్ఞానమనే అంధకారాన్ని తొలగిస్తుంది. విద్యలేనివాడు వింత పశువు అంటారు. మనిషికి మేధాశక్తిని ప్రసాదించేది, సక్రమ మార్గంలో నడిపించేది విద్య. అయితే ఈ రోజుల్లో విద్యకు నామ రూపాలు మారిపోయాయి. అందుకు ముఖ్యకారణం పాశ్చాత్య అంధానుకరణం. అంతేకాదు మన సనాతన ధర్మం గురించిన అవగాహన క్షీణించడమూను. నేటి సమాజం విద్య ప్రయోజనం కేవలం ధనార్జనకే అన్న భ్రమలో ఉంది. బ్రిటీషు వారు తమ పాలనా సౌలభ్యం కోసం ఆంగ్ల చదువులను ప్రవేశపెట్టారు. దానివలన ఎంతో మేలు జరుగుతుందని మనం దాన్ని నెత్తికెక్కించుకున్నాం. అందువలన నైతిక విలువలకు సంబంధించిన విద్య లభించడం దుర్లభమైంది. మన సంస్కృతి విద్య వాటి స్వరూప స్వభావాలు తెలుసుకొని, తెలియనివ్వని విద్యా కుటుంబ వ్యవస్థ వెల్లివిరుస్తున్నది. మన ధర్మాన్ని కుత్సిత కోణాలలో చూస్తూ మన దేశంలో మన వారే మనపై గౌరవాన్నీ, నమ్మకాన్నీ దెబ్బతీస్తున్న దుర్మార్గం, పాఠ్యపుస్తకాలతో చోటుచేసుకుంటున్నది. దీనివలన పరాయితనం వైపు మక్కువ, స్వాభిమాన రాహిత్యపు విద్యా విషయాల బోధనలతో చిరు మస్తిష్కాలు డొల్లలవుతున్నాయి. మన సనాతన ధర్మం సంస్కృతులు, పరంపర ప్రాచీన ఋషులు మనకందించిన ఎన్నో మంచి విషయాల పరిజ్ఞానం పిల్లలకు అందుబాటులో లేకుండా పోయింది. నేటి ఆధునిక విద్యా వ్యవస్థ చెద పురుగులా మేధాశక్తిని తినివేస్తోంది. ఈ విద్య పిల్లలను ధనార్జనకు ప్రోత్సహిస్తోంది.
మనిషి జీవితానికి మార్గం నిర్దేశించేది బ్రహ్మచర్య అవస్థ. ఈ వయసులోనే పిల్లలు విద్యనవలంభించడం ప్రారంభిస్తారు. బ్రహ్మం అనే మాటకు వేదము, పరమాత్మ అనే అర్థాలే కాక జ్ఞాము, తపస్సు, విద్య అనే అర్థాలూ ఉన్నాయి. వీటినే పరమార్థంగా భావించి కృషి చేసే వాడు బ్రహ్మచారి. బ్రహ్మచర్యంవలన పటిష్టమైన వ్యక్తిత్వం అలవడుతుంది. అమోఘమైన శక్తి ప్రాప్తిస్తుంది అని స్వామీ వివేకానంద స్వానుభవంతో చాటి చెప్పారు. విద్యకోసం తపించటమే బ్రహ్మచారి చేసే తపస్సు. ఈ వయసులోనే ప్రతి వ్యక్తికి మంచో చెడో మార్గం నిర్దేశించబడుతుంది. కేవలం ధనార్జన కొరకే విద్య అవసరం అనుకునే మూఢుడు అసత్యమార్గాన్ని పట్టుకుంటాడు.
విద్య ఒక దేవత, ఒక శక్తి. అది చైతన్యవంతమైనదే కాని జడం కాదు. ఆ చైతన్య స్వరూపమైన విద్య మనకు ఒంటబట్టాలంటే ఆ శక్తి లేదా దేవతా అనుగ్రహం తప్పక ఉండాలి. గాలిలో దీపం ఉంచి దేముడా నీదే భారం అంటే ఆ దేముడు దీపాన్ని ఆరకుండా ఉంచలేడు. అలాగే త్రికరణశుద్ధిగా విద్యను ఒక తపస్సుగా భావించి గ్రహించగలిగితేనే ఆ దేవత అనుగ్రహం లభిస్తుంది. అందుకు తగిన జీవిత విధానం బాల్యంలోనే ఏర్పడాలి. దానినే తపస్సు అనుకోవాలి.
విద్యార్థికి అవసరమైన ఒక నియమబద్ధమైన జీవన సరళిని మన పూర్వజులు ఏర్పరిచారు. వాటిని శాస్త్రాలలోను, పౌరాణిక కథలలోను పొందుపరిచి మనకందించారు. వీటిని కాలం చెల్లినవని కొట్టిపారేస్తే విద్యవలన సత్ఫలితాలు లభించవు. విద్యార్థి గురువు పట్ల వినయ విధేయత, భక్తి కలిగి ఉండాలి. నేర్చుకున్న విషయాలను మరచిపోకూడదు. అధ్యయనం చేయడానికి అనుకూలమైన సమయం సూర్యోదయ పూర్వం. అందువలన విద్యార్థి తెల్లవారకుండానే లేచి చదువుకోవాలి. దైవభక్తి తప్పనిసరిగా ఉండాలి. భోగలాలసకు దూరంగా ఉండాలి.అపుడే విద్య రాణిస్తుంది, గుర్తింపు తెస్తుంది. గురువులు అట్టి ప్రశస్తమైన విద్యను శిష్యులకందించాలి. త్యాగమనే సదాశయం కలిగి జీవించే విద్యావంతులు సమాజానికి అవసరం. అదే నిజమైన విద్య. వారే నిజమైన విద్యాధికులు’’.

-గుమ్మా ప్రసాదరావు