మంచి మాట

గుణసంపద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషి పుట్టినప్పటి నుండి శరీర పోషణ విషయం తెలియడానికి ఆకలి, శరీర రక్షణకు దుస్తులు, ఇవి అవసరంగా వస్తున్నవి.
‘‘పగటి పూట ఆకలికి, ఆహారముకై, దుస్తులు- అవసరాలకై, సంపాదన చేసే మనిషి రాత్రిపూట ఆ శరీరాన్ని మరల శక్తివంతం చేయడానికి అన్నట్టు నిద్ర అవసరంగా భావిస్తారు. ఆ నిద్రకు ఒకచోటు ఉండాలి. కాబట్టి నివాసం ఏర్పరచుకోవడం జరుగుతోంది.
మనిషి ముఖ్యావసరాలు తిండి, బట్ట, నివాసం. అనుకుంటే వీటికై నిరంతరం శ్రమపడటం ఇంతవరకు బాగానే ఉంటుంది. వీటికై సంపాదనలో మనసు, మేథస్సు. అవసరం వరకనే ఆగిపోలేదు. అవసరాల మించి సుఖాలకై తాపత్రయ పడటం ఆపై ఆడంబరాలకు ఆర్జన ఇలా రకరకాల పోకడలలో మనిషి మునిగిపోవడం జరుగుతోంది.
నిత్య అవసరాలు సమకూర్చుకోవడానికే ప్రథమ తాపత్రయంగా అయితే ఏ గొడవలు ఉండవు. సుఖాలు ఆడంబరాలతోనే సమస్తం కామ, క్రోధ లోభాలు మొదలవుతాయి.
శ్రీమద్భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పనే చెప్పారు! 16వ అధ్యాయం, 21వ శ్లోకములో ‘‘త్రివిధం..........త్యజేత్‌॥ - ‘‘జీవులు భగవత్ ప్రాప్తిని పొందుటకు మానవ జన్మ లభించుట ఒక సువర్ణావకాశం, కామ, క్రోధ లోభాలు నరక ప్రాప్తికి హేతువులు. మరో మూడు ఉన్నాయి. వీటినే అరిషడ్ వర్గాలు అంటారు. ఈ ఆరు మనిషికి అంతర్గత శత్రువులు.
‘‘కామానికి మోహం, క్రోధానికి మదం, లోభానికి మాత్సర్యం జతగా ఉంటుంటాయి. అందుకే కామ, క్రోధ లోభాలున్నచోట, తప్పనిసరిగా మద మాత్సర్యములుంటాయి. ఒక దానిని విడిచి మరొకటి ఉండవు. ఈ అరిషడ్ వర్గాలు వినాశ హేతువులనుటకు స్వయంగా మనుషుల జీవితం ఎవరికి వారికి చెప్తూనే ఉన్నా గ్రహించుకోలేని అజ్ఞానం.
‘‘కామం వలన ‘కీచకుడు’, ద్రౌపదిని కామించి భీముని చేతిలో హతమవడం జరిగిన విషయం. క్రోధముతో హిరణ్య కశిపుడు జన్మతఃహరిద్వేషంతో ఉండే వాడు. తన సోదరుడిని. హిరణ్యాక్షుణ్ణి విష్ణువు వరాహ రూపంతో చంపడం జరిగింది. హరిద్వేషం క్రోధముగా మారింది. హరి భక్తులను హింసించడం జరిగింది.
‘‘తన కొడుకే ‘ప్రహ్లాదుడు’ హరిభక్తుడు. క్రోధం పరాకాష్టగా కొడుకైనా లెక్కచేయక హింసించడం హరిని చూపమని హరి చేతిలో అంతమొందడం జరిగిన విషయం.
‘‘లోభానికి’’ దుర్యోధనుడు చక్కటి ఉదాహరణ. రాజ్యం అంతా అర్హత, వారసత్వం ఏ విధంగా తనకు చెందనిదైనా తనకే కావాలనే లోభం. కురుక్షేత్ర యుద్ధానికి తన సర్వనాశనానికి కారణమయింది ఆ లోభం!
‘‘మోహనికి ‘్ధృతరాష్ట్రుడు’ పుత్ర వాత్సల్యం శారీరకంగా గుడ్డితనమున్నా దుర్యోధనుడిపై పుత్ర మోహం కారణంగా ఎప్పుడూ, ఎక్కడా వారించలేకపోయాడు.
‘మదానికి రావణాసురుడే రాజ్యాధిరాజు, పది తలలు ఇరవై చేతులు, కలిగినంతటివాడు లేడన్న మదంతో విచక్షణ కోల్పోయి తన తన వారి నాశనానికి కారకుడైన సీతాపహరణం చేయడం, రామరావణాయుద్ధం ‘రావణ సంహారం’ జరిగింది.
ఈ విషయాలు నాశన కారణాలని తెలుసుకోని వారై నాశన మయ్యారు. ‘మాత్సర్యం’ కలిగిన విశ్వామిత్రుడు తొందరలోనే వశిష్టుని స్నేహ వాత్సల్యాలవలన తన తప్పు తెలుసుకుని తనలో కలిగిన మాత్సర్యాన్ని విడిచిపెట్టి మహర్షిగా మారారు.
‘‘నేడు ఉతృష్టమైన జీవన సత్యాలను తెలియచేసే వేదాలను, పురాణాలను, మానవుడు నమ్మడం లేదు. పురాణాల ద్వారా కాకపోతే తమ ప్రపంచంలో జరిగే అకృత్యాలకు, అధర్మాలకు ‘అరిషడ్ వర్గాలే కారణమని తెలుసుకోవడం మానవ ధర్మం. ప్రతీవారు తాము ఆ ధర్మంనుండి తమకు తామే కాపాడుకోవాలి. సాత్వికాహారం తీసుకొంటూ సత్యధర్మాలను పాటిస్తూ జీవనం చేస్తే మనం ఆచరిస్తున్న ధర్మమే మనలను రక్షిస్తుంది.

- ఎ.నాగభూషణరావు